Devara Collection: పెరుగుతూ తగ్గుతున్న దేవర కలెక్షన్స్.. 3 వారాల్లో వచ్చింది ఇంతే.. మరి లాభాలు ఎంతంటే?-devara 21 days worldwide box office collection jr ntr devara 3 weeks collection 509 cr gross and devara profit 65 cr ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Collection: పెరుగుతూ తగ్గుతున్న దేవర కలెక్షన్స్.. 3 వారాల్లో వచ్చింది ఇంతే.. మరి లాభాలు ఎంతంటే?

Devara Collection: పెరుగుతూ తగ్గుతున్న దేవర కలెక్షన్స్.. 3 వారాల్లో వచ్చింది ఇంతే.. మరి లాభాలు ఎంతంటే?

Sanjiv Kumar HT Telugu

Devara 21 Days Worldwide Box Office Collection: దేవర మూవీ కలెక్షన్స్ 21వ రోజు కాస్తా తగ్గాయి. కానీ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దేవర సినిమా మూడు వారాల్లో మంచి ప్రాఫిట్ సొంతం చేసుకుంది. అలాగే, దేవర 21 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏంటనే పూర్తి వివరాల్లోకి వెళితే..

పెరుగుతూ తగ్గుతున్న దేవర కలెక్షన్స్.. 3 వారాల్లో వచ్చింది ఇంతే.. మరి లాభాలు ఎంతంటే?

Devara 3 Weeks Box Office Collection: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ మొదటి సారి జంటగా నటించిన సినిమా దేవర. జనతా గ్యారెజ్ మూవీ తర్వాత కొరటాల శివ-తారక్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

హిందీ బెల్ట్ నుంచి

దాంతో సెప్టెంబర్ 27న చాలా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో మంచి జోరు చూపిస్తోంది. దేవర చిత్రానికి 21వ రోజున భారతదేశంలో రూ. 1.3 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. వాటిలో రూ. 1.13 కోట్లు తెలుగు నుంచి రూ. 17 లక్షలు మాత్రం హిందీ బెల్ట్ నుంచి వసూలు అయ్యాయి.

దేవర 21వ రోజు కలెక్షన్స్

అయితే, 20వ రోజుతో పోలిస్తే 21వ రోజున 7.14 శాతం వసూళ్లు తగ్గాయి. ఇలానే దేవర సినిమా కలెక్షన్స్ తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. ఇక 21 డేస్‌లో దేవర సినిమాకు ఇండియాలో రూ. 280.6 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అందులో తెలుగు నుంచి రూ. 210.52 కోట్లు ఉంటే, హిందీ నుంచి 60.72 కోట్లు ఉన్నాయి. అలాగే, కర్ణాటక నుంచి 2.04 కోట్లు, తమిళనాడు నుంచి 5.97 కోట్లు, మలయాళం ద్వారా 1.35 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.

దేవర 3 వారాల బాక్సాఫీస్

ఇక దేవర సినిమా రూ. 331.90 కోట్ల ఇండియా డొమెస్టిక్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా మూడు వారాల్లో రూ. 410 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. అక్టోబర్ 17న తెలుగులో దేవర సినిమా 19.80 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో 21వ రోజు దేవరకు రూ. 71 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

రాష్ట్రాల వారీగా వసూళ్లు

అలాగే, ఏపీ, తెలంగాణ కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 21 రోజుల్లో అంటే మూడు వారాల్లో దేవర సినిమా రూ. 156.63 కోట్ల షేర్ కలెక్షన్స్, రూ. 226.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇక ఇతర రాష్ట్రాలైన కర్ణాటకలో 17.85 కోట్లు, తమిళనాడులో 4.15 కోట్లు, కేరళలో 97 లక్షలు, హిందీ రెస్టాఫ్ ఇండియాలో 33.90 కోట్లు, ఓవర్సీస్‌లో 35.95 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టింది దేవర చిత్రం.

దేవర ప్రాఫిట్

ఇక వరల్డ్ వైడ్‌గా మూడు వారాల్లో దేవర సినిమాకు రూ. 249.45 కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా.. రూ. 509 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు. అలాగే, 182.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను పూర్తి చేసుకున్న దేవర సినిమా 21 రోజుల్లో రూ. 65.45 కోట్ల లాభాలను అర్జించింది. దాంతో బ్లాక్ బస్టర్ హిట్ వైపుకు దూసుకుపోతోంది. ఇలా దేవర 3 వారాల కలెక్షన్స్ ఉన్నాయి.