Dejavu Movie Review: డెజావు మూవీ రివ్యూ - ర‌చ‌యిత సృష్టించిన పాత్ర‌లు అత‌డికి ఎదురుతిరిగితే-dejavu movie telugu review arulnithi starrer engaging crime thriller movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Dejavu Movie Telugu Review Arulnithi Starrer Engaging Crime Thriller Movie Review

Dejavu Movie Review: డెజావు మూవీ రివ్యూ - ర‌చ‌యిత సృష్టించిన పాత్ర‌లు అత‌డికి ఎదురుతిరిగితే

Nelki Naresh Kumar HT Telugu
Nov 26, 2022 06:27 AM IST

Dejavu Movie Review: అరుళ్‌నిధి, మ‌ధుబాల ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన త‌మిళ చిత్రం డెజావు సేమ్ టైటిల్‌తో తెలుగులో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇటీవ‌ల విడుద‌లైంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ సినిమాకు అర‌వింద్ శ్రీనివాస‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

అరుళ్‌నిధి
అరుళ్‌నిధి

Dejavu Movie Review: కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో త‌మిళంలో హీరోగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు అరుళ్‌నిధి(Arulnithi). అత‌డు హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం డెజావు(Dejavu Movie) పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఈ సినిమా అదే పేరుతో తెలుగులో అమెజాన్ ప్రైమ్(Amazon prime) ఓటీటీలో ఇటీవ‌ల‌ రిలీజైంది. ఈ సినిమాకు అర‌వింద్ శ్రీనివాస‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన డెజావు సినిమా ఎలా ఉందంటే...

Dejavu Movie story -ర‌చ‌యిత పాత్ర‌లు ఎదురుతిరిగితే...

సుబ్ర‌హ్మ‌ణ్యం (అచ్యుత్ కుమార్‌) క్రైమ్ న‌వ‌ల‌లు రాస్తుంటాడు. న‌వ‌ల‌ల్లో తాను సృష్టించిన పాత్రలే త‌న‌ను బెదిరిస్తున్నాయంటూ పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు సుబ్ర‌హ్మ‌ణ్యం. తాగుబోతు అయిన అత‌డి కంప్టైంట్‌ను పోలీసులు తిర‌స్క‌రిస్తారు. డీజీపీ ఆశాప్ర‌మోద్ (మ‌ధుబాల‌) కూతురు పూజ కిడ్నాప్ అవుతుంది. కిడ్నాప‌ర్స్ నుంచి వ‌చ్చిన కాల్ నంబ‌ర్‌ను పోలీసులు ట్రేస్ చేయ‌గా అది సుబ్ర‌హ్మ‌ణ్యం నంబ‌ర్‌గా తేలుతుంది.

సుబ్ర‌హ్మ‌ణ్యానికి మీడియా స‌పోర్ట్ ఉండ‌టంతో అత‌డిని అరెస్ట్ చేయ‌డం కుద‌ర‌దు. పూజ మిస్సింగ్‌ కేసును అండ‌ర్ క‌వ‌ర్‌ ఆఫీస‌ర్ విక్ర‌మ్ కుమార్ (అరుళ్‌నిధి) చేప‌డ‌తాడు. ఈ మిస్సింగ్ కేసు అన్వేష‌ణ‌లో విక్ర‌మ్ తెలుసుకున్న నిజాలేమిటి? త‌న న‌వ‌ల‌ల్లో సుబ్ర‌హ్మ‌ణ్యం రాసిన సంఘ‌ట‌న‌లు రియ‌ల్‌లైఫ్‌లో ఎందుకు జ‌రుగుతున్నాయి? డీజీపీ ఆశాప్ర‌మోద్ చేసిన న‌లుగురు కుర్రాళ్ల‌ ఎన్‌కౌంట‌ర్‌కు మిస్సింగ్‌కు సంబందం ఉందా? గ్యాంగ్ రేప్‌లో చ‌న‌పోయిన జ‌న‌ని ఎవ‌రు? విక్ర‌మ్ నిజంగానే అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌రా కాదా అన్న‌దే ఈ సినిమా క‌థ‌.

స‌ర్‌ప్రైజ్ చేసే ట్విస్ట్‌లు...

డిఫ‌రెంట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా డెజావు(Dejavu Movie Review)సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు అర‌వింద్ శ్రీనివాస‌న్‌. క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌ ఊహ‌ల‌కు అంద‌కుండా న‌డిపించ‌డం అంటే క‌త్తిమీద సాములాంటిది. ఈ విష‌యంలో అర‌వింద్ శ్రీనివాస‌న్ పూర్తిగా స‌క్సెస్ అయ్యాడు. సినిమా ఆరంభం నుంచి ముగింపు వ‌ర‌కు ప్ర‌తి ప‌ది నిమిషాల‌కు ఓ ట్విస్ట్ ఇస్తూ స‌ర్‌ప్రైజ్ చేశాడు.

ర‌చ‌యిత సృష్టించిన పాత్ర‌లు అత‌డికి ఎదురుతిర‌గ‌డం అనే పాయింట్‌తో సినిమాలోని ఫ‌స్ట్‌సీన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ర‌చ‌యిత రాసిన ప్ర‌తి సీన్ రియ‌ల్‌లైఫ్‌లో జ‌రుగుతుండ‌టంతో ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుంతో అనే క్యూరియాసిటీ ప్రేక్ష‌కుల్లో క్రియేట్ చేశాడు డైరెక్ట‌ర్‌. డీజీపీ కూతురు కిడ్నాప్ కావ‌డం, ఆ కేసును విక్ర‌మ్ చేప‌ట్ట‌డంతో సినిమా కొత్త మ‌లుపు తిరుగుతుంది. ఈ కేసులోని ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ విక్ర‌మ్ వెళ్ల‌డాన్ని థ్రిల్లింగ్‌గా ఆవిష్క‌రించారు.

ఎన్‌కౌంట‌ర్ క‌థ‌...

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన దిశ ఎన్‌కౌంట‌ర్ సంఘ‌ట‌న నుంచి స్ఫూర్తి పొందుతూ సినిమాలోని మెయిన్ పాయింట్‌ను డైరెక్ట‌ర్ అర‌వింద్ శ్రీనివాస‌న్ రాసుకున్న‌ట్లుగా అనిపిస్తుంది. ఆ స‌న్నివేశాల‌న్నీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అవుతాయి. క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్‌ను డెప్త్‌గా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. కొన్నిసార్లు పై అధికారుల ఒత్తిడితో ఉన్న‌తాధికారులు ఎలాంటి త‌ప్పులు చేస్తుంటారు. వాటి ప‌ర్యావ‌స‌నాలు ఏమిటో చెప్పిన తీరు బాగుంది.

కొన్ని లాజిక్స్ మిస్‌...

సినిమా క‌థ బాగున్నా చాలా చోట్ల ద‌ర్శ‌కుడు లాజిక్స్‌ను మిస్ చేశాడు. డీజీపీకి అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌ర్ ఎవ‌రోతెలియ‌క‌పోవ‌డం విడ్డూరంగా అనిపిస్తుంది. విరామం ముందు వ‌చ్చే మ‌ర్డ‌ర్ సీన్ క‌థ‌కు సంబంధం లేన‌ట్లుగా సాగుతుంది.

అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌ర్‌గా...

విక్ర‌మ్ అనే అండ‌ర్ క‌వ‌ర్ పోలీస్‌గా అరుళ్‌నిధి ఇంటెన్స్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ఆద్యంతం సీరియ‌స్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంది. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో సీనియ‌ర్ హీరోయిన్ మ‌ధుబాల క‌నిపించింది. రైట‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యంగా అచ్యుత్ కుమార్ క్యారెక్ట‌ర్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. స్మృతివెంక‌ట్‌, మైమ్ గోపీ త‌మ ప‌రిధుల మేర చ‌క్క‌గా న‌టించారు.

Dejavu Movie Review-డీసెంట్ థ్రిల్ల‌ర్‌

క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాల్ని ఇష్ట‌ప‌డేవారిని డెజావు డిస‌ప‌యింట్ చేయ‌దు. డీసెంట్ మూవీగా మెప్పిస్తుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.