పేర్లు చెప్పను కానీ మగ నటులు 8 గంటలే పని చేస్తున్నారు కదా.. నేను డిమాండ్ చేస్తే మాత్రం మీకు నొప్పా: దీపిక కామెంట్స్-deepika padukone on her 8 hours shift demand says male actors for years working for just 8 hours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  పేర్లు చెప్పను కానీ మగ నటులు 8 గంటలే పని చేస్తున్నారు కదా.. నేను డిమాండ్ చేస్తే మాత్రం మీకు నొప్పా: దీపిక కామెంట్స్

పేర్లు చెప్పను కానీ మగ నటులు 8 గంటలే పని చేస్తున్నారు కదా.. నేను డిమాండ్ చేస్తే మాత్రం మీకు నొప్పా: దీపిక కామెంట్స్

Hari Prasad S HT Telugu

దీపికా పదుకోన్ మరోసారి 8 గంటల షిఫ్ట్ డిమాండ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. మగ నటులు అదే పని చేస్తున్నారు కదా అంటూ ఆమె ఎదురు ప్రశ్నించడం గమనార్హం. ఈ డిమాండ్ వల్లే ఆమె తెలుగులో రెండు పాన్ ఇండియా సినిమాలను కోల్పోయిన విషయం తెలిసిందే.

పేర్లు చెప్పను కానీ మగ నటులు 8 గంటలే పని చేస్తున్నారు కదా.. నేను డిమాండ్ చేస్తే మాత్రం మీకు నొప్పా: దీపిక కామెంట్స్ (Instagram/ deepikapadukone)

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న 'స్పిరిట్', నాగ్ అశ్విన్ కల్కి 2898 AD సీక్వెల్ సినిమాల నుండి వైదొలగిన తర్వాత దీపికా పదుకోన్ తొలిసారి తన 8 గంటల షిఫ్ట్ డిమాండ్ పై స్పందించింది. CNBC-TV18 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. "మగ సూపర్ స్టార్స్" చాలా సంవత్సరాలుగా 8 గంటల షిఫ్ట్‌లో పనిచేస్తున్నారని.. కానీ అది "ఎప్పుడూ వార్తల్లో రాలేదు" అని అనడం గమనార్హం.

దీపికా పదుకోన్ ఘాటు కామెంట్స్

దీపికా పదుకోన్ షిఫ్ట్ డిమాండ్లతో కొన్నాళ్లుగా వివాదాల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తన నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని చెప్పినప్పుడు దీపిక ఇలా స్పందించింది. "నేను ఒక మహిళను కాబట్టి నా డిమాండ్ అగౌరవంగా లేదా అభ్యంతరకరంగా అనిపిస్తే అలాగే అనిపించనీయండి. కానీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది మగ సూపర్ స్టార్స్ సంవత్సరాలుగా ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తున్నారనేది రహస్యం కాదు. కానీ అది ఎప్పుడూ వార్తల్లోకి రాలేదు" అని దీపికా చెప్పింది.

వీకెండ్ కూడా పని చేయరు

దీపిక తన వాదనను కొనసాగించింది. "నేను ఇప్పుడు పేర్లు చెప్పి దీన్ని పెద్ద విషయం చేయదలుచుకోలేదు కానీ చాలా మంది మగ నటులు సంవత్సరాలుగా రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారనేది బహిరంగంగా అందరికీ తెలిసిన విషయమే. వారిలో చాలా మంది సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే ఎనిమిది గంటలు పనిచేస్తారు. వీకెండ్స్‌లో వారు పనిచేయరు" అని దీపిక తెలిపింది.

"ఇండియన్ సినిమా ఇండస్ట్రీని 'ఇండస్ట్రీ' అని అంటున్నప్పటికీ మేము ఎప్పుడూ నిజంగా ఒక పరిశ్రమలా పనిచేయలేదు" అని దీపికా చెప్పింది. "ఇది చాలా అవ్యవస్థీకృతమైన పరిశ్రమ" అని చెబుతూ.. "ఈ సంస్కృతిలో మనం కొంత వ్యవస్థను తీసుకురావాల్సిన సమయం దగ్గరపడిందని" తాను భావిస్తున్నానని చెప్పింది.

దీపిక వివాదాలు ఇలా..

'స్పిరిట్' సినిమా షూటింగ్ సమయంలో రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదనే డిమాండ్ చేసిన తర్వాత దీపికా వివాదంలో చిక్కుకుంది. తద్వారా ఆమె తన కుమార్తె దువాతో గడపవచ్చని అనుకుంది. అయితే ఆమె డిమాండ్‌లు నెరవేరకపోవడంతో ఆ సినిమా నుండి వైదొలిగింది.

ఇటీవల వైజయంతీ మూవీస్ కూడా 'కల్కి 2898 AD' సీక్వెల్‌లో దీపికా ఇక భాగం కాదని ప్రకటించింది. తమ ప్రకటనలో 'కల్కి' లాంటి సినిమాకు ఎక్కువ స్థాయిలో నిబద్ధత అవసరమని పేర్కొన్నారు.

'కల్కి 2898 AD' సీక్వెల్ నుండి వైదొలిగిన కొద్ది రోజులకే దీపికా తన తదుపరి చిత్రం 'కింగ్' షూటింగ్‌ను ప్రారంభించింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుక్ ఖాన్, సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ తదితరులు నటిస్తున్నారు. అలాగే ఆమె అల్లు అర్జున్ తో కలిసి అట్లీ రాబోయే మూవీ AA22xA6 లో నటించనుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం