బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ 2020లో తన సినిమా ఛపాక్ విడుదలకు కొద్ది రోజుల ముందు జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)కి వెళ్లిన విషయం తెలుసు కదా. ఇది భారీ వివాదానికి దారితీసింది. ఆమె సినిమాపై నిషేధం విధించాలని కూడా కొందరు డిమాండ్ చేశారు.
తాజాగా, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి యూట్యూబర్ సుభాంకర్ మిశ్రా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించాడు. దీపికాకు జేఎన్‌యూలోని రాజకీయాల గురించి ఏమీ తెలియదని, సినిమా ప్రమోషన్ కోసమే అక్కడికి వెళ్లారని అతడు అనడం గమనార్హం.
ఈ ఇంటర్వ్యూలో వివేక్ ఇలా చెప్పాడు. “దీపికాకు తాను ఎక్కడికి వెళ్తున్నానో కూడా తెలియదు. జేఎన్‌యూలో రాజకీయాలు ఎలా ఉంటాయో ఆమెకు అసలు ఐడియా లేదని నేను గ్యారంటీగా చెప్తాను. ఆమె పీఆర్ టీమ్ ఇది సినిమా ప్రమోషన్‌కు మంచి అవకాశమని, ఈ ప్రదేశం రాజకీయంగా సున్నితమైనదని, సినిమా కథ కూడా రాజకీయ అంశాలతో ముడిపడి ఉందని చెప్పి ఉంటారు. అందుకే ఆమె అక్కడికి వెళ్లి ఉంటుంది. ఆమెకు దాని గురించి పట్టించుకునే అవసరం లేదని అనుకుని ఉంటారు” అని వివేక్ అన్నాడు.
వివేక్ ఆ వివాదంపై మరింత స్పందించాడు. “నువ్వు నిప్పుతో ఆడితే కాలిపోతావు. నాకు దీపిక వ్యక్తిగతంగా తెలియదు. ఆమె ఏ భావజాలాన్ని కలిగి ఉందో కూడా తెలియదు. కానీ ఆమె చాలా తెలివైన, బుద్ధిమంతురాలని నాకు తెలుసు. జేఎన్‌యూ రాజకీయంగా సున్నితమైన ప్రదేశమని, అది తన కెరీర్‌పై ప్రభావం చూపవచ్చని తెలిసి ఉంటే ఆమె అక్కడికి వెళ్లేవారు కాదని నేను భావిస్తాను.
సినిమా ప్రమోషన్ సమయంలో చాలామంది నటీనటులకు ఏం చేయాలి, ఎక్కడ మాట్లాడాలని సలహాలు ఇస్తుంటారు. ఆమె పీఆర్ టీమ్ దీన్ని ఓ ఈవెంట్‌గా భావించి ఉంటారు. కానీ అది ఈవెంట్ కాదు. రాజకీయాలను అంత సులభంగా తాకి వెళ్లిపోవడం సాధ్యం కాదు” అని వివేక్ స్పష్టం చేశాడు.
దీపికా పదుకోన్ గతేడాది కల్కి 2898 AD సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే. గత కొన్ని వారాలుగా ఆమె సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమా నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. దీనికి కారణం, సందీప్ 8 గంటల షిఫ్ట్‌ను అంగీకరించకపోవడమని తెలుస్తోంది.
అటు వివేక్ అగ్నిహోత్రి తన తదుపరి మూవీ ది బెంగాల్ ఫైల్స్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు మొదట ఢిల్లీ ఫైట్స్ అని పేరు పెట్టినా ఈ మధ్యే మార్చారు. భారత చరిత్రలో పెద్దగా చర్చించని అధ్యాయాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుందని మూవీ టీమ్ చెబుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
సంబంధిత కథనం