Deepika Padukone: లేడి సింగం వచ్చేసింది.. బ్రూటల్ పోలీసుగా దీపికా పదుకొణె ఫస్ట్ లుక్
Deepika Padukone First Look: బాలీవుడ్ హాట్ బ్యూటి దీపికా పదుకొణె స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి పోలిస్ యూనివర్స్ లోకి ఎంటర్ అయింది. తాజాగా సింగం ఎగైన్ మూవీ నుంచి దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
Deepika Padukone Singham Again: బాలీవుడ్ దివా దీపికా పదుకొణె సినిమాలతో జోరు చూపిస్తోంది. ఇటీవల పఠాన్ మూవీతో వేల కోట్లు కొల్లగొట్టిన క్లబ్‌లో చేరిపోయింది. అలాగే జవాన్ చిత్రంలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి కాప్ యూనివర్స్ లోకి (Rohit Shetty Cop Universe) ఎంట్రీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటి. రోహిత్ శెట్టి (Rohit Shetty) దర్శకత్వంలో లేటెస్ట్ కాప్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సింగం ఎగైన్ (Singham Again).
రోహిత్ శెట్టి మొదటిసారిగా కాప్ యూనివర్స్ లోకి ఫీమెల్ లీడ్ రోల్‌తో సినిమా చేస్తున్నాడు. సింగ్ ఎగైన్‌గా వస్తున్న సినిమాలో దీపికా పదుకొణె మెయిన్ లీడ్ రోల్ చేయనుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశాడు రోహిత్ శెట్టి. ఇందులో దీపికా పదుకొణె లుక్ అదిరిపోయింది. పోలీస్ యూనిఫార్మ్ లో విలన్లు మడతపెట్టి వారిపై కూర్చుని దీపికా ఇచ్చిన పోజ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. తన నవ్వుతో విలన్‌లు గుండెలు బేజారేలా కిల్లింగ్ స్మైల్‌తో దీపికా లుక్ మెస్మరైజ్ చేస్తోంది.
విలన్ నోట్లో గన్ పెట్టి, తన తలకు గన్ పెట్టుకుని పోలీస్ డెవిల్‌లా దీపికా స్మైల్ ప్రస్తుతం బీటౌన్‌ను షేక్ చేస్తోంది. దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ షేర్ చేసిన రోహిత్ శెట్టి "మహిళ సీత రూపంలోనే కాదు దుర్గ అవతారం కూడా ఎత్తుతుంది. మా కాప్ యూనివర్స్ లోకి అడుగు పెట్టిన అతి క్రూరమైన, భయంకర పోలీస్ ఆఫీసర్ శక్తి శెట్టిని చూడండి. నా లేడీ సింగం దీపికా పదుకొణె" అని రాసుకొచ్చాడు.
కాగా రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ లో ఇదివరకు అజయ్ దేవగన్ (సింగం), రణ్‌వీర్ సింగ్ (సింబా), అక్షయ్ కుమార్ (సూర్యవంశీ)తో సినిమాలు తెరకెక్కించాడు. ఇప్పుడు ఫస్ట్ టైమ్ మహిళా ప్రాధాన్యత చిత్రంగా సింగం ఎగైన్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు రోహిత్ శెట్టి. ఫస్ట్ లుక్‌తోనే దీపికా క్యారెక్టర్ ఎలా ఉంటుందో రివీల్ చేశాడు ఈ యాక్షన్ డైరెక్టర్. దీంతో సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.