Dear Krishna: రియల్ ఇన్సిడెంట్స్‌తో ప్రేమలు హీరోయిన్ మమితా బైజు తెలుగు మూవీ.. టికెట్ బుక్ చేస్తే 10 వేల బహుమతి!
Dear Krishna Trailer Release And Ten Thousand Cash Back: శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకుని రూపొందించిన డియర్ కృష్ణ మూవీ ట్రైలర్‌ను రైటర్ విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. టికెట్ బుక్ చేసినవారికి రూ. 10 వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ చేశారు.
Dear Krishna Trailer Release And Ten Thousand Cash Back: పీఎన్‌బీ సినిమాస్ బ్యానర్‌పై రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ 'డియర్ కృష్ణ' చిత్రం ట్రైలర్‌ను తాజాగా రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్, హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్‌కు సర్వత్ర మంచి స్పందన వస్తుంది. పీఎన్ బలరామ్ రచయిత, నిర్మాతగా, దినేష్ బాబు డైలాగ్స్, స్క్రీన్ ప్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్దం అయింది.
ప్రేమలు హీరోయిన్
అక్షయ్ హీరోగా నటించిన డియర్ కృష్ణ సినిమాలో 'ప్రేమలు' చిత్రంతో తెలుగు వారి హృదయాన్ని కొల్లగొట్టిన బ్యూటీ మమిత బైజు కీలక పాత్రలో నటిస్తోంది. తనతోపాటు మరో బ్యూటీ ఐశ్వర్య హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ప్రతి షాట్ ఆసక్తి కలిగేలా
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుందన్నారు. ట్రైలర్‌లో ప్రతి షాట్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుందని అని పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రేమలు హీరోయిన్ మమతా బైజు హీరోయిన్‌గా నటించడంతో మంచి అంచనాలు ఏర్పడ్డాయని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
వినూత్నమైన రీతిలో
ఈ సినిమా కచ్చితంగా ఘన విజయం సాధించాలని దర్శక నిర్మాతలకు శుభాకాంక్షలు తెలిపారు రైటర్ అండ్ డైరెక్టర్ విజయేంద్ర ప్రసాద్. సినీ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. డియర్ కృష్ణ ట్రైలర్ చాలా బాగుందని, వినూత్నమైన కథతో, వినూత్నమైన రీతిలో ప్రమోషన్స్ చేయడం నచ్చింది అని అన్నారు.
తెలుగు, మలయాళంలో
రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా డియర్ కృష్ణ చిత్రాన్ని తెరకెక్కించడం మెచ్చుకోదగ్గ విషయం అని శ్రీకాంత్ చెప్పారు. ఈ చిత్రం మలయాళం తెలుగులో ఒకేసారి విడుదల చేస్తున్నారని, ఇలాంటి చిత్రాలు మరెన్నో చేయాలని చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అని తెలిపారు.
చాలా అరుదుగా
విశ్వ హిందూ పరిషత్ వాళ్లు కూడా ట్రైలర్ చూసీ మేకర్స్‌ను కొనియాడరు. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తాయని, కచ్చితంగా డియర్ కృష్ణ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేస్తారని చెప్పారు. కథాకథనాలలో మాత్రమే కాకుండా, ప్రచార కార్యక్రమాల్లోనూ కొత్తదనాన్ని చూపిస్తోంది టీమ్. తాజాగా మరోక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.
పదివేల క్యాష్ బ్యాక్
డియర్ కృష్ణ సినిమా టికెట్ బుకింగ్ చేస్తే అక్షరాల పదివేలు గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. మొదటి 100 టికెట్ల బుకింగ్‌లో ఒక టికెట్‌ను ఎంపిక చేసి ఆ టికెట్ దారుడికి రూ. 10,000 క్యాష్ బ్యాక్ కింద బహుమతిగా అందించనున్నట్ల చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ ప్రక్రియను వారం రోజుల పాటు కొనసాగించనున్నట్లు చెప్పారు.
మిరాకిల్ సంఘటనను
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. శ్రీ కృష్ణుడికి, కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఒక మిరాకిల్ సంఘటనను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు. నిర్మాణంతర పనులు పూర్తి చేసుకున్న డియర్ కృష్ణ జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సినిమా టికెట్లను బుక్ చేసుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు.