ఓటీటీలోకి ప్రతి వారం ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా 30కిపైగా ఓటీటీ సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. వీటిలో గురు, శుక్రవారాల్లోనే అధికంగా మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అయితే, అతి తక్కువగా ఆదివారం నాడు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంటాయి.
అలా ఇవాళ (జూన్ 8) ఓ తెలుగు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. అదే డియర్ డాడీ. తెలుగులో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన డియర్ డాడీ ఓటీటీ రిలీజ్ అయింది. తండ్రీకూతుళ్ల అనుబంధం, భావోద్వేగాలు చూపించేలా బ్యూటిఫుల్ సీన్స్‌తో మనసుకు హత్తుకునేలా ఈ సినిమాను తెరకెక్కించారు.
డియర్ డాడీ మూవీలో టాలీవుడ్ పాపులర్ నటి శరణ్య ప్రదీప్, శశిధర్ కోసూరి, రవివర్మ, వైష్ణవి కొక్కురతోపాటు బేబి సహస్ర ముఖ్య పాత్రలు పోషించారు. కేవలం ఐదు పాత్రలతో తెరకెక్కిన డియర్ డాడీ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దేవరకొండ శ్రీకాతం వహించారు.
అలాగే, డియర్ డాడీ సినిమాకు రాకేష్ చారీ సంగీతం అందించగా.. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఎస్‌జే శివకిరణ్, సాయి తేజ ఎడిటింగ్ పనులు చేపట్టారు. ఈటీవీ విన్‌లో ఇవాళ్టీ నుంచి డియర్ డాడీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ ఓటీటీలో కథా సుధా అనే మినీ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా కొత్త ఎపిసోడ్‌గా మినీ మూవీగా డియర్ డాడీ ఓటీటీ రిలీజ్ అయింది. కేవలం 48 నిమిషాల 40 సెకన్ల నిడివితో డియర్ డాడీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. డియర్ డాడీ కథ విషయానికొస్తే.. తండ్రి దగ్గర కూతురు అల్లారుముద్దగా పెరుగుతుంది. తల్లికి తండ్రి దూరంగా ఉంటాడు.
ఇద్దరి దగ్గర ఉంటూ కూతురు ప్రేమను పంచుకుంటుంది. కానీ, ఓ సమయంలో కూతురికి తండ్రి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతో తండ్రిని మిస్ అయిన కూతురు ఎలాగైనే అతనితోనే ఉండాలనుకుంటుంది. తండ్రీకూతుళ్లు దూరం కావడానికి ఏర్పడిన పరిస్థితులు ఏంటీ? తల్లి ఎందుకు ఒంటరిగా ఉంది? అనే విషయాలు తెలియాలంటే డియర్ డాడీ చూడాల్సిందే.
ఏకాంతానికి, ఒంటరి తనానికి తేడా చెప్పే విధంగా డియర్ డాడీ తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అచ్చ తెలుగులో రూపొందిన డియర్ డాడీ మూవీని ఈటీవీ విన్ ఓటీటీలో ఎంచక్కా చూసేయండి.
సంబంధిత కథనం