Deadpool And Wolverine: అదరగొడుతున్న క్రేజీ సినిమా.. యూట్యూబ్‌లో ట్రెండింగ్.. అంత స్పెషల్ ఎందుకంటే?-deadpool and wolverine trailer goes trending in youtube and get 2 million above views ryan reynolds hugh jackman ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deadpool And Wolverine: అదరగొడుతున్న క్రేజీ సినిమా.. యూట్యూబ్‌లో ట్రెండింగ్.. అంత స్పెషల్ ఎందుకంటే?

Deadpool And Wolverine: అదరగొడుతున్న క్రేజీ సినిమా.. యూట్యూబ్‌లో ట్రెండింగ్.. అంత స్పెషల్ ఎందుకంటే?

Sanjiv Kumar HT Telugu
Published Apr 26, 2024 01:51 PM IST

Deadpool And Wolverine Trailer Response: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో అతిపెద్ద క్రేజీ ప్రాజెక్ట్‌గా వస్తోన్న సినిమా డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

అదరగొడుతున్న క్రేజీ సినిమా.. యూట్యూబ్‌లో ట్రెండింగ్.. అంత స్పెషల్ ఎందుకంటే?
అదరగొడుతున్న క్రేజీ సినిమా.. యూట్యూబ్‌లో ట్రెండింగ్.. అంత స్పెషల్ ఎందుకంటే?

Deadpool And Wolverine Movie: మార్వెల్ అభిమానులకు ఇది అతి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎప్పటి నుంచో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మ‌రో సూప‌ర్ హీరో మూవీ త్వరలో రానుంది. ఇది సాధారణ సూపర్ హీరో సినిమా కాదు. రెండు క్రేజీ పాత్రలతో కలిసి వస్తోన్న ఈ సినిమాపై మాములు ఎక్స్‌పెక్టేషన్స్ లేవు.

ఇప్ప‌టికే మార్వెల్ యూనివర్స్ నుంచి వ‌చ్చిన డెడ్‌పూల్ సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే మరోవైపు ఎక్స్ మెన్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా భారీ అభిమానులు ఉన్నారి. తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది.

మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ సినిమాలను ఎంతగా ఇష్టపడుతుంటారో అలాగే ఎక్స్ మెన్ సిరీస్‌ను సైతం అంతే అభిమానుస్తుంటారు. ఇప్పుడు మార్వెల్‌లోని డెడ్ పూల్ పాత్ర, ఎక్స్ మెన్ రోల్ వోల్వరిన్ కలిసి రాబోతున్న సినిమానే డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్. మార్వెల్ స్టూడియోస్ నుంచి వ‌స్తున్న అతి క్రేజీ సినిమా ఇది. అందుకే ఈ సినిమా అంత స్పెషల్ కానుంది.

ఈ సినిమాలో డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్, వోల్వరీన్‌గా హ్యూగ్ జాక్‌మాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. ఇటీవల మూడు రోజుల క్రితం చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఫుల్ యాక్ష‌న్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మ‌రోసారి గట్టిగా ఎంట‌ర్‌టైన్ చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వోల్వరిన్‌గా హ్యూగ్ జాక్‌మన్ మరోసారి తన యాక్షన్‌తో విపరీతంగా ఆకట్టుకోనున్నాడు.

ఇప్పుడు డెడ్‌పూల్ & వోల్వరిన్ ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మూడు రోజుల క్రితం యూట్యూబ్‌లో రిలీజైన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ఇంగ్లీష్ వెర్షన్ 2.4 మిలియన్‌కుపైగా వ్యూస్ దక్కించుకుంది. అలాగే 90 వేలకుపైగా వ్యూస్‌తో తెలుగు ట్రైలర్ వీక్షణలు పొందింది. అంతేకాకుండా ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్ యూట్యూబ్‌లో 10 స్థానంలో ట్రెండ్ అవుతోంది.

ఇలా ఇంగ్లీష్, తెలుగు వెర్షన్‌లే కాకుండా హిందీ, తమిళ వెర్షన్ ట్రైలర్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఇలా మూవీ మరోసారి క్రేజీ బజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇక ఈ సినిమాలో వీరిద్దరితోపాటు ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ త‌దిత‌రులు ముఖ్యపాత్ర‌లు పోషిస్తున్నారు.

డెడ్‌పూల్ & వోల్వరిన్ సినిమాలో అత్యంత పవర్‌ఫుల్ విలన్‌ కసాండ్ర నోవాగా ఎమ్మా కొరిన్ ఆకర్షించనుంది. ఈ పాత్రను మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో చూపించడం ఇదే తొలిసారి. అయితే, ఎక్స్ మెన్ 97 కార్టూన్ సిరీస్‌లో మాత్రం కసాండ్ర నోవా ఎంతటి పవర్‌ఫుల్ విలన్ అనేది చూపించారు. ఇకపోతే డెడ్‌పూల్ & వోల్వరిన్ ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో జులై 26న విడుదల కానుంది.

Whats_app_banner