OTT: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 11 వేల కోట్ల బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?-deadpool and wolverine ott release on disney plus hotstar in telugu tamil malayalam kannada deadpool 4 ott streaming ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 11 వేల కోట్ల బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

OTT: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 11 వేల కోట్ల బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Sanjiv Kumar HT Telugu
Nov 11, 2024 03:50 PM IST

Deadpool And Wolverine OTT Streaming: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో రూ. 11 వేల కోట్లకుపైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ మూవీ డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ డెడ్‌పూల్ 4 ఏ ఓటీటీలో రిలీజ్ కానుందనే ఇక్కడ చూద్దాం.

ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 11 వేల కోట్ల బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 11 వేల కోట్ల బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడాలంటే?

Deadpool And Wolverine OTT Release: ఓటీటీలోకి ప్రతి వారం ఎన్నో విభిన్న రకాల సినిమాలు, వెబ్ సిరీసులు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి. అలా, ఈ వారంలోనే అది కూడా మరికొన్ని గంటల్లోనే రూ. 11 వేల కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ కామెడీ మూవీ ఓటీటీ రిలీజ్ కానుంది.

పాపులారిటీ పాత్రలు

ఆ సినిమా మరేదో కాదు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్. డెడ్‌పూల్ మూవీ సిరీస్‌లో నాలుగో సినిమాగా వచ్చిన ఈ మూవీపై ముందుగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ కలిసి ఒక సినిమాలో కనిపిస్తున్నారనే వార్త రాగానే వైల్డ్ వైడ్‌గా ఫుల్ బజ్ వచ్చేసింది. ఎందుకంటే ఈ పాత్రలకు ఉన్న పాపులారిటీ అలాంటిది.

బాక్సాఫీస్ వద్ద

డిస్నీ సినిమాటిక్ యూనివర్స్‌లోని ఎక్స్ మెన్ అదే వోల్వరిన్, ఎమ్‌సీయూలోని డెడ్‌పూల్ కాంబినేషన్‌లో వచ్చిన డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ మూవీ లవర్స్ పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అయిందనే చెప్పాలి. జూలై 26న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో విడుదలైన డెడ్‌పూల్ 4 మంచి టాక్ తెచ్చుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతూ కలెక్షన్స్ కొల్లగొట్టింది.

పదకొండు వేల కోట్లు

ఓవరాల్‌గా డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ మూవీ 1.338 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది. అంటే, ఇండియన్ కరెన్సీ ప్రకారం రూపాయల్లో 11,290,72,95,376. అంటే పదకొండు వేల కోట్లకుపైగానే డెడ్‌పూల్ 4 కలెక్షన్స్ రాబట్టింది. 200 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 1.338 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

మెయిన్ లీడ్ రోల్స్

ఇక ఈ సినిమాలో డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్, వోల్వరీన్‌గా హ్యూగ్ జాక్‌మాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరితోపాటు ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ త‌దిత‌రులు ముఖ్యపాత్ర‌లు పోషించారు. ఈ చిత్రానికి షాన్ లెవీ ద‌ర్శ‌క‌త్వం వహించగా.. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంట‌ర్‌టైన‌మెంట్ సంయుక్తంగా నిర్మించాయి.

7.8 ఐఎమ్‌డీబీ రేటింగ్

పదికి 7.8 ఐఎమ్‌డీబీ రేటింగ్ అందుకున్న డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ మూవీ మూడున్నర నెలలకు తెలుగులో ఓటీటీలోకి వచ్చేయనుంది.అది కూడా మరికొన్ని గంటల్లో డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ ఓటీటీ రిలీజ్ కానుంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్ 12 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అది కూడా ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది.

అర్థరాత్రి నుంచే స్ట్రీమింగ్

నవంబర్ 12 అర్థరాత్రి నుంచే డెడ్‌పూల్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ చేయనున్నారు. అంటే, అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. సూపర్ హీరో మూవీ కేటగిరికి చెందిన డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ సినిమాను సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, యాక్షన్, కామెడీ, అడ్వెంచర్ వంటి అంశాలతో తెరకెక్కించారు. కాగా మార్వెల్ మూవీస్ ఫ్యాన్స్‌కు ఈ మూవీ పెద్ద ట్రీట్ అందించనుంది.

Whats_app_banner