OTT Super Hero Film: తెలుగులో ఓటీటీలోకి రానున్న రూ.11వేల కోట్ల వసూళ్ల సూపర్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Deadpool and Wolverine OTT Release Date: డెడ్‍పూల్ అండ్ వోల్వరైన్ చిత్రం ఇండియాలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రెడీ అవుతోంది. రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు వస్తోంది. తెలుగు కూడా ఈ మూవీ అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..
హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ‘డెడ్‍పూల్ అండ్ వోల్వరైన్’ బాక్సాఫీస్‍ను షేక్ చేసేసింది. ఈ మార్వెల్ కామిక్ మూవీ ప్రపంవవ్యాప్తంగా భారీ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమా జూలై 26వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఇండియాలోనూ ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు దక్కాయి. ఇప్పటికే రెంటల్ పద్ధతిలో కొన్ని ఓటీటీల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. అయితే, రెంట్ లేకుండా ఇండియాలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేందుకు ‘డెడ్‍పూల్ & వోల్వరైన్’ సిద్ధమవుతోంది.
డెడ్‍పూల్ & వోల్వరైన్ సినిమా ఎప్పుడు సాధారణ స్ట్రీమింగ్‍కు వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని రెంట్ లేకుండా చూసే అవకాశం కోసం నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో ఈ మూవీ రెగ్యులర్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్టు తాజాగా రూమర్లు బయటికి వచ్చాయి.
స్ట్రీమింగ్ డేట్ ఇదే!
డెడ్‍పూల్ & వోల్వరైన్ సినిమా ఇండియాలో నవంబర్ 3వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమంగ్‍కు వస్తుందని అంచనాలు బయటికి వచ్చాయి. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళంలో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. స్ట్రీమింగ్ డేట్‍పై హాట్‍స్టార్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
డెడ్‍పూల్ & వోల్వరైన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ+ ఓటీటీల్లో రెంట్ పద్ధతిలో అందుబాటులో ఉంది. అయితే, డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. దీంతో రెంట్ లేకుండా హాట్‍స్టార్ సబ్‍స్కైబర్లందరూ ఈ మూవీని ఉచితంగా చూడొచ్చు.
డెడ్‍పూల్ & వోల్వరైన్ చిత్రంలో ర్యాన్ రొనాల్డ్స్, హ్యూ జాక్‍మాన్, ఇమ్మా కోరిన్ లీడ్ రోల్స్ చేశారు. మొరేనా బకారిన్, రాబ్ డెలనే, లెసీ ఉగ్గమ్స్, ఆరోన్ స్టాన్‍ఫోర్డ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి షాన్ లేవీ దర్శకత్వం వహించారు. మార్వెల్ కామిక్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్వెల్ స్టూడియోస్, మ్యాగ్జిమమ్ ఎఫర్ట్, 21 ల్యాప్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్లు ఈ మూవీని నిర్మించాయి.
డెడ్‍పూల్ & వోల్వరైన్ కలెక్షన్లు
డెడ్‍పూల్ & వోల్వరైన్ మూవీ ఫుల్ క్రేజ్ మధ్య రిలీజ్ అయింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.33 బిలియన్ డాలర్ల (సుమారు రూ.11వేల కోట్లు) కలెక్షన్లను ఈ మూవీ కొల్లగొట్టింది. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా సుమారు రూ.3వేల కోట్లకు పైగా రాబట్టింది. ఆ తర్వాత కూడా జోరు చూపింది. భారీ కలెక్షన్లతో ఈ చిత్రం దుమ్మురేపింది.
జియోసినిమాలో ‘ఫ్యూరియోసా’
‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా’ చిత్రం జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (అక్టోబర్ 23) రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఇంగ్లిష్, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో స్ట్రీమ్ అవనుంది. జూలైలో థియేటర్లలో రిలీజైన ఈ హాలీవుడ్ యాక్షన్ మూవీ మోస్తరు కలెక్షన్లు దక్కాయి. క్రిస్ హేమ్స్‌వర్త్, అన్య టేలర్ జాయ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‍మ్యాక్స్ సాగా చిత్రానికి జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించారు. జియోసినిమా ఓటీటీలో అక్టోబర్ 23 నుంచి ఈ మూవీని ఏడు భాషల్లో చూసేయవచ్చు.