Deadpool and Wolverine box office: నాలుగో రోజు భారీగా పడిపోయిన డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ కలెక్షన్లు-deadpool and wolverine box office collections day 4 dropped weekend collections are huge ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Deadpool And Wolverine Box Office: నాలుగో రోజు భారీగా పడిపోయిన డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ కలెక్షన్లు

Deadpool and Wolverine box office: నాలుగో రోజు భారీగా పడిపోయిన డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ కలెక్షన్లు

Hari Prasad S HT Telugu

Deadpool and Wolverine box office: హాలీవుడ్ సూపర్ హీరో మూవీ డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ మూవీ నాలుగు రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మూడు రోజుల పాటు రికార్డులు క్రియేట్ చేసినా.. ఇండియాలో మాత్రం నాలుగో రోజు చతికిలపడింది.

నాలుగో రోజు భారీగా పడిపోయిన డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ కలెక్షన్లు (AP)

Deadpool and Wolverine box office: మార్వెల్ మూవీ డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ బాక్సాఫీస్ కలెక్షన్లు ఫస్ట్ వీకెండ్ లో రికార్డులను తిరగ రాశాయి. అమెరికా, కెనడాల్లోనే కాదు ఇండియాలోనూ తొలి మూడు రోజులు వసూళ్ల వర్షం కురిపించింది. అయితే నాలుగో రోజైన సోమవారం (జులై 29) ఈ సినిమా కలెక్షన్లు భారీగా పతనమయ్యాయి.

డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ కలెక్షన్లు

రియాన్ రేనాల్డ్స్, హ్యూ జాక్‌మ్యాన్ నటించిన మూవీ డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్. ఈ సినిమా గత శుక్రవారం (జులై 26) ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా రూ.3500 కోట్లకుపైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇండియాలోనూ మూడు రోజుల్లోనే రూ.66 కోట్లు రావడం విశేషం. అయితే వీకెండ్ ముగిసి నాలుగో రోజు వచ్చేసరికి ఈ కలెక్షన్లు భారీగా తగ్గిపోయాయి.

సోమవారం (జులై 29) ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కేవలం రూ.7 కోట్లు మాత్రమే వచ్చాయి. మూడో రోజైన ఆదివారం రూ.22.3 కోట్లుగా ఉన్న కలెక్షన్లు నాలుగో రోజు సగానికి సగం పడిపోవడం గమనార్హం. తొలి రోజు రూ.21 కోట్లతో ప్రారంభమైన ఈ డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ మూవీ రెండో రోజు రూ.22.65 కోట్లు, మూడో రోజు రూ.22.3 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా నాలుగు రోజుల్లో రూ.73.65 కోట్లు వసూలయ్యాయి.

రికార్డులు తిరగ రాస్తూ..

డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ మూవీ యూఎస్, కెనడా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగ రాసింది. ఫస్ట్ వీకెండ్ లోనే 211.4 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఈ ఏడాది అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన సినిమాగా నిలిచింది. ఆర్-రేటెడ్ మూవీ (17 ఏళ్ల లోపు పిల్లలకు ఒంటరిగా అనుమతి ఉండదు)ల్లో అత్యధిక వసూళ్లు సాధించిన జోకర్ (బిలియన్ డాలర్లు) ఫస్ట్ వీకెండ్ వసూళ్ల రికార్డును కూడా ఈ డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ తిరగ రాసింది.

డెడ్‌పూల్ అండ్ వోల్వెరైన్ స్టోరీ ఇదీ

మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్స్‌లో భాగంగా ఈ మూవీ తెర‌కెక్కింది. డెడ్‌పుల్‌, డెడ్‌పుల్ 2 సినిమాల‌కు సీక్వెల్‌గా డెడ్‌పుల్ అండ్ వాల్వ‌రిన్ మూవీ రూపొందింది. ఈ మూవీకి ర‌యాన్ రెనాల్డ్స్ కూడా స్క్రీన్‌ప్లేను స‌మ‌కూర్చ‌డం గ‌మ‌నార్హం. హాలీవుడ్ మూవీకి ర‌యాన్ రెనాల్డ్స్ రైట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం ఇదే మొద‌టిసారి కాదు. ఎక్స్‌మెన్ వాల్వ‌రిన్‌, నో గుడ్ డీడ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల‌కు రైట‌ర్‌గా, డైలాగ్ రైట‌ర్‌గా రెనాల్డ్స్ ప‌నిచేశాడు. ప్రొడ్యూస‌ర్‌గా ప‌లు సినిమాల‌ను నిర్మించాడు.

గ‌ర్ల్‌ఫ్రెండ్ వెనెసాతో బ్రేక‌ప్ చెప్పిన డెడ్‌పుల్ కార్ల సేల్స్ మెన్‌గా కొత్త జీవితాన్ని మొద‌లుపెడ‌తాడు. డెడ్‌పుల్ ను పారాడాక్స్ మ‌నుషులు కిడ్నాప్ చేస్తారు. ఎర్త్ 616లో జాయిన్ కావాల‌ని డిమాండ్ చేస్తారు. డెడ్‌పుల్‌ను హ్యాపీ హోగ‌న్ అలియాస్ వాల్వ‌రిన్‌ను ఎలా క‌లిశాడు? పారాడాక్స్ నుంచి టెమ్‌ప్యాడ్‌ను డెడ్‌పుల్ ఎందుకు దొంగిలించాడు? మ‌ల్టీవెర్స్‌లో డెడ్‌పుల్‌, వాల్వ‌రిన్‌ క‌లిసి ఎలాంటి సాహ‌సాలు చేశార‌న్న‌దే డెడ్‌పుల్ అండ్ వాల్వ‌రిన్ మూవీ క‌థ‌.