David Warner Remuneration: రాబిన్‌హుడ్ కోసం డేవిడ్ వార్నర్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 3 నిమిషాల కోసం అన్ని కోట్లా?
David Warner Remuneration: నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్‌హుడ్ మూవీతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెరంగేట్రం చేసిన విషయం తెలుసు కదా. ఈ సినిమాలో అతిథి పాత్ర కోసం అతడు అందుకున్న రెమ్యునరేషన్ మాత్రం భారీగానే ఉంది.
David Warner Remuneration: డేవిడ్ వార్నర్ తెలుసు కదా. ఆస్ట్రేలియా క్రికెటరే అయినా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి తెలుగు వాళ్లకు దగ్గరయ్యాడు. తాను వ్యక్తిగతంగా తెలుగు సినిమాలకు బాగా ఆకర్షితుడయ్యాడు. ఇప్పుడతడు నితిన్ నటించిన రాబిన్‌హుడ్ మూవీలో నటించి ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా శుక్రవారం (మార్చి 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
డేవిడ్ వార్నర్ రెమ్యునరేషన్
వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన రాబిన్‌హుడ్ మూవీలో డేవిడ్ వార్నర్ మూడు నిమిషాల పాటే ఉండే ఓ చిన్న అతిథి పాత్రలో కనిపించాడు. దీనికోసమే అతడు ఏకంగా రూ.3 కోట్లు అందుకున్నట్లు ఓటీటీ ప్లే రిపోర్టు వెల్లడించింది. నిజానికి ఈ సినిమాలో వార్నర్ నటించినట్లు ఈ నెల మొదట్లోనే ప్రొడ్యూసర్ రవిశంకర్ చెప్పి ఆశ్చర్యపరిచాడు. దీంతో అప్పటి నుంచే అతని రోల్ ఏంటి? ఎలా నటించాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఈ సినిమాలో అతడు నటించిన సీన్లను గతేడాది ఐపీఎల్ సందర్భంగానే చిత్రీకరించినట్లు కూడా సినిమా వర్గాలు వెల్లడించాయి. అతడు నటించిన విషయం బయటకు వచ్చిన తర్వాత వార్నర్ ఈ సినిమా ప్రమోషన్ల కోసం ఇండియాకు వచ్చాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడంతోపాటు నితిన్, శ్రీలీలతో కలిసి రీల్స్ కూడా చేశాడు.
రాజేంద్రప్రసాద్ వివాదం
రాబిన్‌హుడ్ మూవీలో వార్నర్ నటించడం, అతడు ప్రీరిలీజ్ ఈవెంట్ కు రావడం, అతనిపై రాజేంద్ర ప్రసాద్ నోరు జారడం తెలిసిందే. దొంగముండాకొడుకు అంటూ అతడు చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై వార్నర్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించడంతో క్షమాపణ చెబుతూ అతడో వీడియోను రిలీజ్ చేయాల్సి వచ్చింది.
ఇక రాబిన్‌హుడ్ సినిమా విషయానికి వస్తే.. ఇందులో నితిన్, శ్రీలీల జంటగా నటించారు. 2020లో భీష్మ తర్వాత వెంకీ కుడుములతో నితిన్ మరోసారి చేతులు కలిపాడు. ఈ కామెడీ యాక్షన్ మూవీకి పాజిటివ్ రివ్యూలే వస్తున్నాయి.
రాబిన్‌హుడ్ ఎలా ఉందంటే?
కోటీశ్వరుల దగ్గర దోచేసి లేనోడికి పెట్టేయ్ అనేది రాబిన్‌హుడ్ ఫిలాసఫీ. అలాగే దొంగతనాలు చేస్తుంటాడు. చోరీల్లో భాగంగా ముందుగా చూపించే పాత్రలు ఆకట్టుకుంటాయి. టైటిల్‌కు తగినట్లుగా జస్టిఫికేషన్ ఇచ్చారు. దానికోసమే 20 నిమిషాల పాటు స్టోరీ సాగుతుంది. ఆ తర్వాత స్పెషల్ ఆఫీసర్‌గా విక్టర్ ఎంట్రీ, నీరా వాసుదేవ్ ఇండియాకు రావడం వంటివి ఇంట్రెస్టింగ్‌గానే సాగుతాయి. ఈ క్రమంలో రాజేంద్రప్రసాద్- నితిన్- వెన్నెల కిషోర్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.
సెకండ్ హాఫ్‌లో వచ్చే కొన్ని సీన్స్ ప్రేక్షకుల అంచనాలను అందుకోకుండా రాసుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. రొటీన్ కథ అయినా కామెడీతో నడిపించాలని ప్రయత్నించిన దర్శకుడు వెంకి కుడుముల సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే సినిమాలో కామెడీతో పాటు రాసుకున్న కొన్ని ట్విస్టులు బాగా వర్క్ అవుట్ అయ్యాయి. దాంతో సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఆలోచింపజేసేలా ఉంటుంది.
సంబంధిత కథనం