Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్‍పై డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. అలా తిట్టడం ఏంటి అంటూ ఫైర్-david warner fans angry on rajendra prasad for his comments at robinhood pre release event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్‍పై డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. అలా తిట్టడం ఏంటి అంటూ ఫైర్

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్‍పై డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. అలా తిట్టడం ఏంటి అంటూ ఫైర్

Rajendra Prasad - David Warner: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్. రాబిన్‍హుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఈ కామెంట్లు చేశారు. దీంతో వార్నర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్‍పై డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. అలా తిట్టడం ఏంటి అంటూ ఫైర్

రాబిన్‍హుడ్ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాలో క్యామియో రోల్ చేశారు. ఐపీఎల్‍తో తెలుగు ప్రేక్షకులకు ఎంతో చేరువైన వార్నర్.. టాలీవుడ్‍తోనే తెరంగేట్రం చేస్తున్నారు. తెలుగు చిత్రాలను ఎక్కువగా ఇష్టపడే ఆయన పుష్ప సహా మరిన్ని సినిమాల స్టెప్‍లు, మూమెంట్లను చాలాసార్లు చేశారు. ఇప్పుడు వెండితెరపై కనిపించబోతున్నారు. రాబిన్‍హుడ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు వార్నర్ హాజరయ్యారు. అయితే, ఈ ఈవెంట్‍లో వార్నర్‌పై అభ్యంతకరమైన కామెంట్లు చేశారు సీనియర్ యాక్టర్,నట కిరీటీ రాజేంద్ర ప్రసాద్.

రేయ్ వార్నర్ అంటూ కామెంట్స్

డేవిడ్ వార్నర్‌పై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఓ తిట్టు కూడా అన్నారు. ఈ డేవిడ్ వార్నర్ క్రికెట్ ఆడవయ్యా అంటే.. పుష్పలా యాక్షన్ చేశారని చేసి చూపించారు రాజేంద్ర ప్రసాద్. “దొ**ము**కు. మామూలోడు కాదు వీడు. రేయ్ వార్నర్.. బీ వార్నింగ్” అని మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్.

వార్నర్ ఫ్యాన్స్ ఆగ్రహం

ఈ కామెంట్లు చేసిన రాజేంద్ర ప్రసాద్‍పై డేవిడ్ వార్నర్‌ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ప్రేమతో తెలుగు చిత్రంలో నటించిన అంతర్జాతీయ స్టార్ క్రికెటర్‌ వార్నర్‌ను ఇలా తిట్టడం సరికాదంటూ విమర్శిస్తున్నారు. అతిథిలా అత్యంత గౌరవంగా చూసుకోవాల్సిన వార్నర్‌ను దూషించడం ఏంటంటూ ఫైర్ అవుతున్నారు. రాజేంద్ర ప్రసాద్ లాంటి పెద్ద యాక్టర్ ఇలా మాట్లాడడం సరికాదంటూ నెటిజన్లు ఆగ్రహిస్తున్నారు. ఎంత సరదా అయినా అంత పాపులర్ సెలెబ్రిటీని.. అది కూడా స్టేజీపై తిట్టడం అసలు కరెక్ట్ కాదని, దీనికి వివరణ ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. మరి రాజేంద్ర ప్రసాద్ దీనిపై స్పందిస్తారేమో చూడాలి.

వార్నర్ డ్యాన్స్

రాబిన్‍హుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో వార్నర్ ఉత్సాహంగా పాల్గొన్నారు. అదిదా సర్‌ప్రైజ్ పాటకు నితిన్, శ్రీలీల, కేతిక శర్మతో కలిసి డ్యాన్స్ చేశారు. శ్రీవల్లి పాటకు కూడా స్టెప్స్ వేశారు. ఈ చిత్రంలో నటించినందుకు చాలా గౌరవంగా భావిస్తున్నానని వార్నర్ చెప్పారు. తెలుగు ఇండస్ట్రీ కుటుంబంలోకి ఆహ్వానించినందుకు థ్యాంక్స్ అంటూ మాట్లాడారు.

రాబిన్‍హుడ్ చిత్రం ఈ శుక్రవారం మార్చి 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ కామెడీ యాక్షన్ మూవీకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. నితిన్‍కు జోడీగా ఈ చిత్రంలో నటించారు శ్రీలీల. కేతిక శర్మ స్పెషల్ సాంగ్‍లో చిందేశారు. ఈ సినిమాపై నితిన్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. మూవీ టీమ్ కొంతకాలంగా ప్రమోషన్లను జోరుగా చేస్తున్నారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లోనే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రాబిన్‍హుడ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం ఇచ్చారు.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం