OTT Top Releases this week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. రెండు తెలుగు సినిమాలు.. ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు-darling to manorathangal ott top movies and web series releases in this week hotstar etv win ott zee5 jiocinema ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Top Releases This Week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. రెండు తెలుగు సినిమాలు.. ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు

OTT Top Releases this week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. రెండు తెలుగు సినిమాలు.. ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 11, 2024 10:43 PM IST

OTT Top Releases this week: ఈ వారం కూడా ఓటీటీల్లోకి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు వచ్చేస్తున్నాయి. ఇందులో రెండు తెలుగు చిత్రాలు ఉన్నాయి. స్టార్ నటీనటులు ఉన్న ఓ వెబ్ సిరీస్ కూడా రానుంది. ఈ వారంలో ఓటీటీల్లో ముఖ్యమైన 5 రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.

OTT Top Releases this week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. రెండు తెలుగు సినిమాలు.. ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు
OTT Top Releases this week: ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే.. రెండు తెలుగు సినిమాలు.. ఇంట్రెస్టింగ్ సిరీస్‍లు

వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఈ వారం (ఆగస్టు మూడోవారం) కూడా చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు వచ్చేస్తున్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన రిలీజ్‍లుగా ఉన్నాయి. ఓ తెలుగు సినిమా నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. మరో తెలుగు చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. దిగ్గజ స్టార్లు నటించిన మనోరతంగల్ వెబ్ సిరీస్ కూడా ఈ వారంలోనే వస్తోంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఇవే..

డార్లింగ్

హీరోయిన్ నభా నటేష్, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన డార్లింగ్ సినిమా ఈ వారంలోనే ఆగస్టు 13వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ కామెడీ డ్రామా మూవీ జూలై 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే నెగెటివ్ టాక్ తెచ్చుకొని ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేదు. ఈ మూవీకి అశ్విన్ రామ్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 13 నుంచి డార్లింగ్ చిత్రాన్ని హాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు.

వీరాంజనేయులు విహారయాత్ర

వీరాంజనేయులు విహారయాత్ర సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో ఆగస్టు 14వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతోంది. సీనియర్ నటుడు వీకే నరేశ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో పోషించారు. ఫ్యామిలీ రోడ్ ట్రిప్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అనురాగ్ పలుట్ల. వీరాంజనేయులు విహారయాత్ర టీజర్, ట్రైలర్ కామెడీతో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అస్థికలను డబ్బింగ్ చెప్పాడు కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం. గోవాలో అస్థికలు కలిపేందుకు ఓ కుటుంబం ట్రిప్ వేయడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది.

మనోరతంగల్

మనోరతంగల్ వెబ్ సిరీస్ ఆగస్టు 15వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వస్తుంది. ఈ ఆంథాలజీ సిరీస్‍లో సూపర్ స్టార్లు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‍లాల్‍, ఫాహద్ ఫాజిల్ నటించారు. మరికొందరు స్టార్ యాక్టర్లు కూడా ఉన్నాయి. 9 కథలతో ఈ ఆంథాలజీ సిరీస్ రూపొందింది. 8 మంది డైరెక్టర్లు ఈ సిరీస్‍కు దర్శకత్వం వహించారు. ఈ క్రేజీ వెబ్ సిరీస్ మనోరతంగల్‍ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

శేఖర్ హోమ్స్

డిటెక్టివ్ డ్రామాగా శేఖర్ హోమ్స్ వెబ్ సిరీస్ వస్తోంది. జియోసినిమా ఓటీటీలో ఆగస్టు 14వ తేదీన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. 1990ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ సిరీస్ ఉండనుంది. కేకే మీనన్ ఈ సిరీస్‍లో లీడ్ రోల్ చేశారు. రణ్‍వీర్ షోరే, రసిక దుగ్గల్, కృతి కుల్హరీ కీరోల్స్ చేశారు. శేఖర్ హోమ్స్ సిరీస్‍కు రోహణ్ సిప్పీ దర్శకత్వం వహించారు. ఇంగ్లిష్ డిటెక్టివ్ క్లాసిక్ షెర్లాక్ హోమ్స్ స్ఫూర్తిగా ఈ సిరీస్‍ను తెరక్కించారు.

మై పర్‌ఫెక్ట్ హస్బెండ్

తమిళ స్టార్ నటుడు సత్యరాజ్ ప్రధాన పాత్ర పోషించిన మై పర్‌ఫెక్ట్ హస్బెండ్ వెబ్ సిరీస్ ఆగస్టు 16వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ ఫ్యామిలీ డ్రామా సిరీస్ తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ సిరీస్‍కు తమిర దర్శకత్వం వహించారు. రేఖ, వర్ష బొల్లమ్మ, రక్షణ్, లివింగ్ స్టోన్ కీలకపాత్రలు పోషించారు.