Daredevil Born Again OTT Release: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వివిధ రకాల ఫేజ్‌లతో ఎన్నో ఫ్రాంచైజీ సినిమాలు, సిరీస్‌లను తెరకెకిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఎమ్‌సీయూ నుంచి డేర్ డెవిల్ వెబ్ సిరీస్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
డేర్ డెవిల్ సిరీస్ ఒక సూపర్ హీరో క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్. మార్వెల్ కామిక్స్ బుక్ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ ఫ్రాంఛైజీలో మ్యాట్ మర్డోక్ (చార్లీ కాక్స్) ఒక లాయర్. కానీ, అతను అంధుడు. అయితే, పగలు కోర్టులో కేసులు వాదించే ఈ లాయర్ రాత్రి సమయంలో మాత్రం నేరస్థులను అతి కిరాతంగా, రాక్షసంగా చంపుతుంటాడు.
ఇప్పటివరకు ఈ వెబ్ సిరీస్‌లో మూడు సిరీస్‌లు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా రూపొందిన డేర్ డెవిల్ 3 సీజన్స్ వరకు ఎంతగానో మార్వెల్ అభిమానులను ఆకట్టుకుంది. 2018లో డేర్ డెవిల్ 3 వచ్చింది. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి నాలుగో సీజన్‌గా ఏడేళ్లకు డేర్ డెవిల్ బార్న్ అగైన్ టైటిల్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
అంటే, డేర్ డెవిల్ అలియాస్ మ్యాట్ మర్డోక్ పాత్ర చేసిన చార్లీ కాక్స్ చాలా వరకు ఎమ్‌సీయూ సిరీస్‌లు, సినిమాల్లో కనిపించాడు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ మూవీ, షీ హల్క్, ఎకో సిరీస్‌ల్లో కెమియో రోల్‌తో అలరించాడు డేర్ డెవిల్. అయితే, పూర్తి స్థాయిలో మాత్రం ఏడేళ్లకు తన సీజన్‌తో వచ్చేస్తున్నాడు డేర్ డెవిల్. అయితే, ఇది గత సీజన్స్‌కు కంటిన్యూ అయినప్పటికీ దీనిని కొత్త సీజన్‌గా అంటే మొదటి సీజన్‌గా రిలీజ్ చేస్తున్నారు.
ఇక మార్వెల్‌లో చాలా ఫేజ్‌లు ఉంటాయి. అందులోని ఐదో ఫేజ్‌లో డేర్ డెవిల్ ఫ్రాంచైజీలో నాలుగో సీజన్‌గా ఫ్రెష్‌గా ఇది రానుంది. ఇటీవల రిలీజ్ చేసిన డేర్ డెవిల్ 4 ట్రైలర్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. దీంతో ఈ సీజన్‌పై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. డేర్ డెవిల్ బార్న్ అగైన్ ట్రైలర్ చూస్తుంటే ఇదివరకు సీజన్స్ తరహాలోనే మోస్ట్ వయలెంట్‌గా ఉండనుందని తెలుస్తోంది.
ఇందులో పనిషర్ సిరీస్ హీరో కనిపించడం హైలెట్‌గా నిలిచింది. డేర్ డెవిల్ 4లో మ్యాట్ మర్డోక్ తన శత్రువు అయిన కింగ్‌పిన్‌తో కలిసి మరో శత్రువు కోసం పని చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక డేర్ డెవిల్ బార్న్ అగైన్ ఈపాటికే యూఎస్‌లో ప్రీమియర్ అవుతోంది. కానీ, ఇండియాలో మాత్రం మరికొన్ని గంటల్లో డేర్ డెవిల్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
జియోహాట్‌స్టార్‌లో మార్చి 5న డేర్ డెవిల్ బార్న్ అగైన్ ఓటీటీ రిలీజ్ కానుంది. అది కూడా ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, హిందీ, తమిళం వంటి నాలుగు భాషల్లో డేర్ డెవిల్ బార్న్ అగైన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, మార్చి 5న డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్‌లోని మొదటి రెండు ఎపిసోడ్స్ మాత్రమే డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. కాగా ఈ సిరీస్‌లో మొత్తం 9 ఎపిసోడ్స్ ఉన్నాయి.
సంబంధిత కథనం