Extra Ordinary Man song: నితిన్ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ నుంచి తొలి సాంగ్ రిలీజ్.. మెలోడియస్‍గా హారిస్ జయరాజ్ ట్యూన్
Extra Ordinary Man First song: ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రం నుంచి తొలి సాంగ్ రిలీజ్ అయింది. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Extra Ordinary Man song: నితిన్ హీరోగా నటిస్తున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా నుంచి తొలి సాంగ్ వచ్చేసింది. ‘డేంజర్ పిల్ల’ అనే తొలి లిరికల్ సాంగ్‍ను చిత్ర యూనిట్ నేడు (ఆగస్టు 2) రిలీజ్ చేసింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక, ఈ సినిమా నుంచి నేడు వచ్చిన తొలి సాంగ్ మెలోడియస్‍గా ఉంది. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా నుంచి రిలీజ్ అయిన ‘డేంజర్ పిల్ల’ సాంగ్ ‘బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా.. చీకట్లో తిరగని మిణుగురు తళుకువా’ అంటూ మొదలైంది. హారిస్ జయరాజ్ మెలోడియస్‍గా ఈ పాటకు ట్యూన్ ఇచ్చాడు. ఈ లిరికల్ సాంగ్‍లో నితిన్ క్లాస్ లుక్‍లో కనిపిస్తుండగా.. హీరోయిన్ శ్రీలీల లుక్ కూడా ఆకట్టుకుంటోంది. ఈ ‘డేంజర్ పిల్ల’ పాటను అర్మాన్ మాలిక్ పాడాడు. కృష్ణకాంత్ లిరిక్స్ అందించాడు. శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కంపోజ్ చేశాడు. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా థియేటర్లలో ఈ ఏడాది డిసెంబర్ 23న రిలీజ్ కానుంది.
నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో రావు రమేశ్, సంపత్, సుదేవ్ నాయర్, బ్రహ్మాజీ, రోహిణి, హర్షవర్ధన్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్ట్ తెలుగు మూవీకి చాలాకాలం తర్వాత మ్యూజిక్ అందిస్తున్నాడు హారిస్ జైరాజ్. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా విడుదల డిసెంబర్‍లో కాగా.. ఇప్పటి నుంచే పాటలతో క్రేజ్ తెచ్చేలా ప్లాన్ చేసింది చిత్రయూనిట్.
‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ సినిమా శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య మూవీస్ బ్యానర్లపై నిర్మితమవుతోంది. సుధాకర రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రైటర్‌గా సూపర్ సక్సెస్ అయిన వక్కంతం వంశీ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘నా పేరు సూర్య’ తర్వాత డైరెక్టర్‌గా ఇది అతడికి రెండో సినిమా. ఇటీవల వచ్చిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.
కాగా, నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా గతేడాది తీవ్రంగా నిరాశపరిచింది. బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ అయింది. దీంతో ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ హిట్ అవడం నితిన్‍కు కీలకంగా మారింది.
సంబంధిత కథనం