Dance Ikon 2 OTT: ఓటీటీలో ఇవాళే డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్- మెంటార్‌గా బ్రహ్మముడి మానస్- వారికి సీక్రెట్ స్క్రీనింగ్!-dance ikon 2 wild fire ott streaming on aha from today onwards and host omkar comments in secret screening press meet ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dance Ikon 2 Ott: ఓటీటీలో ఇవాళే డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్- మెంటార్‌గా బ్రహ్మముడి మానస్- వారికి సీక్రెట్ స్క్రీనింగ్!

Dance Ikon 2 OTT: ఓటీటీలో ఇవాళే డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్- మెంటార్‌గా బ్రహ్మముడి మానస్- వారికి సీక్రెట్ స్క్రీనింగ్!

Sanjiv Kumar HT Telugu
Published Feb 14, 2025 10:48 AM IST

Dance Ikon 2 OTT Streaming On Aha: ఆహా ఓటీటీలో ఇవాళ్టీ నుంచి తెలుగు డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ సీక్రెట్ స్క్రీనింగ్ నిర్వహించారు. అలాగే, మెంటార్‌గా బ్రహ్మముడి మానస్ ఉండనున్నాడు. షో విశేషాలను ఓంకార్ తెలిపారు.

ఓటీటీలో ఇవాళే డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్- మెంటార్‌గా బ్రహ్మముడి మానస్- వారికి సీక్రెట్ స్క్రీనింగ్!
ఓటీటీలో ఇవాళే డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్- మెంటార్‌గా బ్రహ్మముడి మానస్- వారికి సీక్రెట్ స్క్రీనింగ్!

Dance Ikon 2 OTT Streaming On Aha: డ్యాన్స్ లవర్స్‌ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1కు కొనసాగింపుగా "డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్ ఫైర్" ఈనెల 14వ తేదీ నుంచి అంటే ఇవాళ్టీ నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్‌కు రెడీ అవుతోంది. ఈ షోకి ఓంకార్ హోస్ట్‌గా వ్యవహరించగా.. జాతి రత్నాలు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతలుగా ఉండనున్నారు.

దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్

అలాగే, ఒక మెంటార్‌గా బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ మానస్ ఉండనున్నాడు. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్‌లో డ్యాన్స్ పర్‌ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. పంచభూతాల్లాంటి ఐదుగురు కంటెస్టెంట్స్ తమ పర్‌ఫార్మెన్స్‌లతో మెస్మరైజ్ చేయనున్నారు.

ఫిబ్రవరి 13న మీడియా మిత్రులకు "డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్" 20 నిమిషాల సీక్రెట్ స్క్రీనింగ్ చేశారు. సాధారణంగా మూవీస్‌కు ప్రివ్యూ, ప్రీమియర్స్ వేస్తుంటారు. అలాంటిది ఫస్ట్ టైమ్ ఒక డ్యాన్స్ రియాల్టీ షోకు సీక్రెట్ స్క్రీనింగ్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసింది ఆహా ఓటీటీ. సీక్రెట్ స్క్రీనింగ్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు.

తెలుగు వాళ్లను ఇప్పుడు

ఈ కార్యక్రమంలో హోస్ట్ ఓంకార్ మాట్లాడుతూ .. "డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ సీక్రెట్ స్క్రీనింగ్ ద్వారా షో ఎలా ఉండబోతుంది అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది. సాధారణంగా తెలుగు నుంచి కంటెస్టెంట్స్‌ను సెలెక్ట్ చేస్తుంటాం. కానీ, ఈసారి దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ ఆడిషన్ చేసి అందులో నుంచి పంచభూతాల్లాంటి ఐదుగురు వండర్‌ఫుల్ కంటెస్టెంట్స్‌ను తీసుకున్నాం. వారికి పోటీ ఇచ్చే సత్తా ఉన్న తెలుగు కంటెస్టెంట్స్‍‌ను ఇప్పుడు సెలెక్ట్ చేయనున్నాం" అని తెలిపారు.

"డ్యాన్స్ ఐకాన్ 1 విన్నర్ మన తెలుగు వాళ్లే. మరింత టఫ్ కాంపిటేషన్‌లో మనవాళ్లు టాలెంట్ చూపించాలనే ఇలా చేస్తున్నాం. మీరు చేసిన 60 సెకన్ల డ్యాన్స్ వీడియో మాకు పంపిస్తే అది చూసి ఎంట్రీలను తీసుకుంటాం. మూడు నెలల పాటు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ షోను ప్రేక్షకులను ఎంజాయ్ చేయబోతున్నారు. ఎవ్రీ సెకండ్ వీక్ ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటారు. కంటెస్టెంట్స్‌తో పాటు మెంటార్స్ కూడా ఎలిమినేట్ అవుతారు. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. వారు ఎవరు అనేది సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది" అని ఓంకార్ పేర్కొన్నారు.

100 పాయింట్స్‌లోపు

"ప్రతి శుక్రవారం 7 గంటలకు షో స్టార్ట్ అవుతుంది. షో కంప్లీట్ అయ్యాక ప్రేక్షకుల నుంచి పోల్ నిర్వహిస్తాం. 100 పాయింట్స్‌లోపు ప్రేక్షకులు తమకు నచ్చినన్ని పాయింట్స్ ఇవ్వొచ్చు. ఆదివారం వరకు ఈ ఓటింగ్ కొనసాగుతుంది. ఆహా నుంచి నాకు ఓటింగ్ డీటెయిల్స్ పంపిస్తారు. నేను గతంలో ఆట, ఆట జూనియర్స్ వంటి డ్యాన్స్ షోస్ చేశాను. డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ ఇప్పటిదాకా వచ్చిన డ్యాన్స్ షోస్ అన్నింటిలో కొత్తగా ఉంటుంది" అని ఓంకార్ చెప్పారు.

"ప్రేక్షకులకు ఒక రియల్ ఫీల్ ఇవ్వాలనే స్క్రిప్టెడ్‌గా చేయకుండా రియాల్టీ షో చేస్తున్నాం. శేఖర్ మాస్టర్, ఫరియా గారికి మాత్రం ఎలిమినేషన్ ఉండదు. శేఖర్ మాస్టర్ రీసెంట్‌గా యూఎస్ వెళ్లి వచ్చారు. నెక్ట్ ప్రెస్ మీట్‌లో తప్పకుండా పాల్గొంటారు. మీరంతా మా డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ షోను బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాం" అని హోస్ట్ ఓంకార్ చెప్పుకొచ్చారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం