Daaku Maharaj Trailer: బాలయ్య యాక్షన్ విధ్వంసం.. అదిరిన డాకు మహరాజ్ ట్రైలర్.. విజువల్స్ కూడా సూపర్
Daaku Maharaj Trailer: డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ వచ్చేసింది. బాలకృష్ణ యాక్షన్ అదిరిపోయింది. మాస్‍తో పాటు స్టైలిష్‍గానూ కనిపించారు. ట్రైలర్ ఎలా ఉందంటే..
నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది. బాబీ కొల్లి ఈ మూవీ ఈ యాక్షన్ డ్రామా మూవీకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ నేడు (జనవరి 5) వచ్చేసింది. అమెరికాలోని డల్లాస్‍లో జరిగిన ఈవెంట్‍లో ట్రైలర్ రిలీజ్ అయింది.
చెడ్డ వాళ్లకు డాకు.. మాకు మహారాజు
డాకు మహారాజ్ గురించి ఓ చిన్నారి వివరిస్తుండగా ట్రైలర్ మొదలవుతుంది. చెడ్డ వాళ్లు ఆయనను డాకు అంటారని.. మాకు మహారాజు అని ఆ చిన్నారి వాయిస్ బ్యాక్‍గ్రౌండ్‍లో ఉంటుంది. అడవిలో అమాయక జనాలపై దాడులు చేస్తూ.. కష్టాలు పెట్టే స్మగ్లర్లను బాలకృష్ణ మట్టుబెట్టే షాట్లు ఆ తర్వాత ఉన్నాయి. అడవిలో ప్రజలను రక్షించే పాత్రనే డాకు మహారాజ్ అని అర్థమవుతోంది.
నానాజీ పేరుతో ఓ పాపకు బాలకృష్ణ పరిచయం అవుతారు. ఆ తర్వాత డాకు గెటప్‍లో కనిపించారు. విలన్ బాబీ డియోల్ ఎంట్రీ ఉంది. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా అంటూ ఆ చిన్నారి డైలాగ్ చెబుతోంది. మొత్తంగా డాకు మహారాజ్ చిత్రంలో బాలకృష్ణ రెండు రోల్స్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. మూడు గెటప్స్ ట్రైలర్లో ఉన్నాయి. స్టైలిష్ యాక్షన్‍తో బాలయ్య అదరగొట్టేశారు. ప్రజ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కూడా ట్రైలర్‌లో కనిపించారు.
అదిరిపోయిన యాక్షన్, విజువల్స్.. కొత్తగా బాలయ్య
డాకు మహారాజ్ ట్రైలర్‌లో బాలకృష్ణ.. యాక్షన్ విశ్వరూపం చూపారు. మూడు గెటప్‍ల్లో అదుర్స్ అనిపించారు. అభిమానులకు గూజ్‍బంప్స్ తెప్పించే యాక్షన్ షాట్స్ ఉన్నాయి. డైరెక్టర్ బాబీ టేకింగ్ అదిరిపోయింది. ముందుగా చెప్పినట్టే బాలయ్యను కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. స్టైలిష్‍గానూ నట సింహం కనిపించారు. యాక్షన్ చిత్రమే అయినా విజువల్స్ కూడా రిచ్‍గా సూపర్ అనేలా ఉన్నాయి. సంగీత దర్శకుడు థమన్ కూడా బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేశారు. మొత్తంగా డాకు మహారాజ్ ట్రైలర్ ఫుల్ ప్యాకేజ్‍లా ఉంది. సినిమాపై అంచనాలను పెంచేసింది.
డాకు మహారాజ్ చిత్రానికి విజయ్ కార్తీక్ కణ్ణన్ సినిమాటోగ్రఫీ చేశారు. కెమెరా పనితనం కూడా ట్రైలర్లో ఆకట్టుకుంది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మించారు. బాలకృష్ణ సరసన ప్రజ్యా జైస్వాల్ హీరోయిన్‍గా నటించారు. శ్రద్ధా శ్రీనాశ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా కూడా కీరోల్స్ చేశారు. బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించారు.