Box office Collections: నిలకడగా డాకు మహారాజ్.. దూకుడుగా ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పటి వరకు కలెక్షన్లు ఎంతంటే..
Box office Collections: డాకు మహారాజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలకడగా సాగుతోంది. సంక్రాంతికి వస్తున్నాం మాత్రం దూకుడు చూపిస్తోంది. వెంకటేశ్ మూవీ ఓ మైల్‍స్టోన్‍కు దగ్గరైంది.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సత్తాచాటుతోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నిలకడగా కొనసాగుతోంది. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహించారు. నాలుగు రోజుల్లోనే రూ.100కోట్ల గ్రాస్ మార్క్ దాటిన తర్వాత స్టడీగానే ఈ చిత్రానికి కలెక్షన్లు వస్తున్నాయి. డాకు మహారాజ్ ఆరు రోజుల కలెక్షన్ల వివరాలను మూవీ టీమ్ వెల్లడించింది.
కలెక్షన్లు ఇలా..
డాకు మహారాజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లో రూ.124 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకున్నట్టు మూవీ టీమ్ నేడు (జనవరి 18) వెల్లడించింది. ఈ మూవీకి ఐదు రోజుల్లో రూ.114 కోట్లు వచ్చాయి. ఆరో రోజు సుమారు రూ.10కోట్ల వసూళ్లు దక్కాయి. దీంతో లెక్క రూ.124కోట్లకు చేరింది. వీకెండ్ కావడంతో జోరు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
డాకు మహారాజ్ చిత్రంలో బాలకృష్ణ యాక్షన్‍తో అదరగొట్టేశారు. అభిమానులకు ఫుల్ ఫీస్ట్ ఇచ్చేశారు. దీంతో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. బాలయ్యకు వరుసగా నాలుగో రూ.100కోట్ల చిత్రం సొంతమైంది. బాబీ డియోల్ విలన్‍గా నటించారు. ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతేలా, షైన్ టామ్ చాకో, మకరంద్ దేశ్‍పాండే కీలకపాత్రలు పోషించారు. డాకు మహారాజ్ మూవీకి థమన్ సంగీతం అందించారు.
డాకు మహారాజ్ చిత్రాన్ని యాక్షన్‍తో పాటు స్టైలిష్‍గా తెరకెక్కించారు బాబీ. యాక్షన్ సీక్వెన్సులను కాస్త విభిన్నంగా చూపించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు ప్రొడ్యూజ్ చేశాయి.
రూ.150కోట్లకు చేరువలో ‘సంక్రాంతికి వస్తున్నాం’
విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. జనవరి 14వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం దూకుడుగా కలెక్షన్లను రాబడుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆరంభం నుంచి మంచి టాక్‍తో అదరగొడుతోంది. మూడు రోజుల్లోనే రూ.100కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా నాలుగో రోజు కూడా అదరగొట్టింది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.131కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. మూడో రోజుల్లో రూ.106 కోట్లను సాధించిన ఈ చిత్రం.. నాలుగో రోజు రూ.25కోట్ల గ్రాస్‍ను వసూలు చేసింది. ఈ వీకెండ్‍లో ఈ చిత్రానికి వసూళ్లు మరింత ఊపందుకునే అవకాశం ఉంది. మరొక్క రోజులో రూ.150కోట్లకు చేరే ఛాన్స్ పుష్కలంగా ఉంది. లాంగ్ రన్‍లో రూ.200కోట్లు కూడా సాధ్యంగానే కనిపిస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‍రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీకి భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చారు.
సంబంధిత కథనం
టాపిక్