OTT Crime Drama Web Series: డాకు మహారాజ్ విలన్ సూపర్ హిట్ వెబ్ సిరీస్ మూడో సీజన్ సెకండ్ పార్ట్ వస్తోంది.. ఫ్రీగా చూడండి
OTT Crime Drama Web Series: డాకు మహారాజ్ మూవీ విలన్ బాబీ డియోల్ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఆశ్రమ్ మూడో సీజన్ రెండో పార్ట్ త్వరలోనే రాబోతోంది. దీనికి సంబంధించిన టీజర్ గురువారం (జనవరి 30) రిలీజైంది.
OTT Crime Drama Web Series: ఇండియన్ ఓటీటీ స్పేస్‌లో వచ్చిన సూపర్ హిట్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ లో ఒకటి ఆశ్రమ్ (Ashram). ఈ మధ్యే డాకు మహారాజ్ మూవీలో విలన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన బాబీ డియోల్ నెగటివ్ రోల్లో, ఓ దొంగ బాబాగా నటించిన సిరీస్ ఇది. ఈ వెబ్ సిరీస్ మూడో సీజన్ రెండో పార్ట్ కూడా రాబోతుండగా.. గురువారం (జనవరి 30) ఎంఎక్స్ ప్లేయర్ టీజర్ రిలీజ్ చేసింది.

తాజాగా ఓ టీజర్ ద్వారా ఎంఎక్స్ ప్లేయర్ ఈ విషయాన్ని వెల్లడించింది. బాబా నిరాళా అనే ఓ దొంగ బాబా పాత్రలో బాబీ డియోల్ జీవించేసిన బోల్డ్ వెబ్ సిరీస్ ఇది. తన ఆశ్రమంలోకి తనను నమ్మి వచ్చే ఎంతో మంది అమ్మాయిలను లోబరచుకునే బాబాగా ఈ వెబ్ సిరీస్ లో బాబీ డియోల్ నటించాడు.
టీజర్ ఎలా ఉందంటే?
ఆశ్రమ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ రెండో పార్ట్ టీజర్ ఆసక్తికరంగా ఉంది. తాను ఎంతోకాలంగా కన్నేసిన పమ్మి అనే రెజ్లర్ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి బాబా నిరాళా దగ్గరికే వచ్చి చేరడం ఈ టీజర్లో చూడొచ్చు. తనతోపాటు ఎంతో మంది జీవితాలు నాశనం చేసిన బాబాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ముందు అతనికి లోబడి ఉండటమే మంచిదనుకొని ఆమె తిరిగి వస్తుంది.
గతంలో వచ్చిన మూడో సీజన్ తొలి పార్ట్ లో బాబా నిరాళా తనకు అత్యున్నత స్థాయిలో ఉన్న సంబంధాలతో తనపై సాగిన కోర్టు కేసు నుంచి బయటపడతాడు. ఆ కేసుకు కారణమైన పమ్మీనే తప్పుడు కేసులో ఇరికించి జైలుకు పంపిస్తాడు. అయితే ఆ తర్వాత ఆమెను తిరిగి జైలు నుంచి విడిపించి తన ఆశ్రమానికి రప్పిస్తాడు.
బాబాపై ప్రతీకారంతో రగిలిపోతున్న పమ్మీ.. మొదట తాను మారిపోయినట్లుగా అందరినీ నమ్మించి తర్వాత బాబా పని పట్టాలని నిర్ణయించుకుంటుంది. మూడో సీజన్ రెండో పార్ట్ లో బాబా వర్సెస్ పమ్మీ ఫైట్ ఆసక్తికరంగా సాగబోతున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. తనను తాను కోర్టులో నపుంసకుడిగా చెప్పుకున్న బాబా అసలు భండారాన్ని పమ్మీ ఎలా బయటపెట్టబోతోందన్నది ఈ ఆశ్రమ్ వెబ్ సిరీస్ మూడో సీజన్ రెండో పార్ట్ లో చూడొచ్చు. త్వరలోనే ఈ సెకండ్ పార్ట్ రానుంది. స్ట్రీమింగ్ తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.
సంబంధిత కథనం