Daaku Maharaaj Twitter Review: డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. బాలకృష్ణ మూవీకి ఊహించని టాక్.. గుర్రం ఎపిసోడ్ మాత్రం!-daaku maharaaj twitter review by audience balakrishna movie get good response elevation action scenes stunning visuals ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Daaku Maharaaj Twitter Review: డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. బాలకృష్ణ మూవీకి ఊహించని టాక్.. గుర్రం ఎపిసోడ్ మాత్రం!

Daaku Maharaaj Twitter Review: డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ.. బాలకృష్ణ మూవీకి ఊహించని టాక్.. గుర్రం ఎపిసోడ్ మాత్రం!

Sanjiv Kumar HT Telugu

Daaku Maharaaj Movie Twitter Review In Telugu: నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ఇవాళ (జనవరి 12) గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్‌పై ట్విట్టర్‌లో నెటిజన్స్ రివ్యూ ఇస్తున్నారు. కాబట్టి, ఈ సినిమా ఎలా ఉందో డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ

Daaku Maharaaj Twitter Review Telugu: 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి వరుస ఘన విజయాల తరువాత గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన మరో వైవిద్యభరితమైన సినిమా 'డాకు మహారాజ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చేయనునున్నాడు.

భారీ బడ్జెట్‌తో

జై లవ కుశ, వాల్తేరు వీరయ్య సినిమాలను డైరెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి డాకు మహారాజ్ సినిమాకు దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో 'డాకు మహారాజ్'ను నిర్మించారు.

ఐటమ్ సాంగ్‌తో

టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించిన డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. అలాగే, బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఊర్వశి రౌతేలా దబిడి దిబిడి అనే ఐటమ్ సాంగ్‌తో అదరగొట్టింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న అంటే ఇవాళ 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూ

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో డాకు మహారాజ్ సినిమా ఎలా ఉందో చెబుతూ రివ్యూలు ఇస్తున్నారు నెటిజన్స్. యూస్, పలు చోట్ల డాకు మహారాజ్ ప్రీమియర్ షోలు వేశారు. అవి వీక్షించిన ప్రేక్షకులు ట్విటర్ ద్వారా సినిమాపై తమ అభిప్రాయాలను చెబుతున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉందో డాకు మహారాజ్ ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

స్క్రీన్ ప్రజెన్స్ అదిర్స్

"డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్. బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయింది. బాబీ కొల్లి అన్న నీ డైరెక్షన్ సూపర్. ఎలివేషన్స్ అదిరిపోయాయి. ఇండియన్ సినిమాలోనే నెక్ట్స్ లెవెల్ విజువల్స్ అని కచ్చితంగా చెప్పొచ్చు. తమన్ మ్యూజిక్, బీజీఎమ్ మైండ్ బ్లోయింగ్" అని ఆస్ట్రేలియన్ తెలుగు ఫిల్మ్స్ రివ్యూ ఇచ్చింది.

"డాకు మహారాజ్ ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్‌గా ఉంది. తమన్ బీజీఎమ్ ర్యాంప్ ఆడించాడు. అభిమానులకు, ఆడియెన్స్‌కు మాస్ ఫీస్ట్" అని పానిపూరి అనే అకౌంట్ యూజర్ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.

"తమన్ అన్న మ్యూజిక్‌కు దండం పెట్టాల్సిందే. నాగవంశీ అన్న హిట్ కొట్టేసావ్. డైరెక్టర్ బాబీ డైరెక్షన్ అదుర్స్" అని మరో ట్విటర్ యూజర్ డాకు మహారాజ్‌పై రివ్యూ రాసుకొచ్చారు. అలాగే, సినిమాలోని ఓ వీడియోను షేర్ చేశారు. మరొకరు "సినిమా చూసేందుకు పర్లేదు. కానీ, క్లైమాక్స్ ఇంకాస్తా బెటర్‌గా ఉంటే బాగుండేది" అని చెబుతూ 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

"డాకు మహారాజ్ ఫస్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్. సెకండాఫ్ బాగుంది. ఓవరాల్‌గా పిచ్చెక్కించే బీజీఎమ్‌తో మరణ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్" అని మరొకరు రివ్యూ ఇచ్చారు.

"డాకు మహారాజ్ చూశాను. సెకండాఫ్ చాలా కష్టంగా ఉంది. మెడికోర్ స్టోరీలైన్‌పై తమన్ బీజీఎమ్ వృథా అయింది. కొన్ని సాడ్ సీన్స్‌తో సినిమా ముందుకు సాగుతుంది. కేవలం గుర్రం ఎపిసోడ్‌ మాత్రం బాగా వర్కౌట్ అయింది. ఓవరాల్‌గా ప్రతి ఫ్రేమ్‌లో డిజాస్టర్ రైటింగ్ కనిపించింది" అని చెప్పిన ట్విటర్ యూజర్ 1.75 రేటింగ్ ఇచ్చాడు. దీన్ని మరొకరు షేర్ చేస్తూ స్మైలింగ్ ఎమోజీ పెట్టారు.

ఇలా సోషల్ మీడియాలో బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీపై మిశ్రమ రివ్యూలు వస్తున్నాయి. చాలా మంది సినిమా బాగుందని అంటే, కొంతమంది మాత్రం అవుట్ డేటెడ్ స్టోరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత కథనం