Daaku Maharaj Review: డాకు మహారాజ్ రివ్యూ - సంక్రాంతి విన్నర్‌గా బాలకృష్ణ నిలిచాడా? లేదా? అంటే!
Daaku Maharaj Review: బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారజ్ మూవీ సంక్రాంతి కానుకగా నేడు (ఆదివారం) రిలీజైంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Daaku Maharaj Review: బాలకృష్ణకు సంక్రాంతి అచ్చొచ్చింది. గత ఏడాది వీరసింహారెడ్డితో వంద కోట్ల లీగ్‌లో చేరిపోయాడు. ఈ సారి సంక్రాంతికి డాకు మహారాజ్‌తో బరిలో దిగాడు బాలకృష్ణ. స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి బాబీ దర్శకత్వం వహించాడు. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించాడు. ఆదివారం (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చిన డాకు మహారాజ్ ఎలా ఉంది? సంక్రాంతి విన్నర్‌గా బాలకృష్ణ నిలిచాడా? లేదా? అంటే?

డాకు మహారాజ్ కథ…
1996లో చిత్తురూ జిల్లాలోని మదన పల్లిలో కథ మొదలవుతుంది. కృష్ణమూర్తికి (సచిన్ ఖేడ్కర్) చెందిన కాఫీ ఎస్టేట్ లీజుకు తీసుకున్న ఎమ్మేల్యే త్రిమూర్తులు (రవి కిషన్) స్మగ్లింగ్, జంతువుల అక్రమ రవాణాకు పాల్పడుతుంటాడు. త్రిమూర్తులు అక్రమాలను అడ్డుకునేందుకు కృష్ణమూర్తి ప్రయత్నాలు చేస్తాడు. దాంతో కృష్ణమూర్తిపై పగను పెంచుకున్న త్రిమూర్తులు అతడి మనవరాలు వైష్ణవిని చంపాలని చూస్తాడు. వైష్ణవికి కాపాడటానికి చంబల్ లోయకు చెందిన డాకు మహారాజ్ (బాలకృష్ణ) వస్తాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరుతాడు.
మరోవైపు చంబల్ లోయలో సీతారాం (బాలకృష్ణ) అతడి భార్య (ప్రగ్యా జైస్వాల్) ఇరిగేషన్ ఇంజినీర్లుగా పనిచేస్తుంటాడు. ఆ ఏరియా మొత్తం మైనింగ్ కింగ్ బల్వంత్ ఠాకూర్ ( బాబీ డియోల్) కనుసన్నల్లో ఉంటుంది. తన మైనింగ్ బిజినెస్‌కు అడ్డొచ్చిన వారిని దారుణంగా అంతమొందిస్తుంటాడు. బల్వంత్ ఠాకూర్ మైనింగ్ బిజినెస్ కారణంగా చంబల్ ప్రాంత ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తుంటారు.
బల్వంత్ బారి నుంచి ఆ ప్రాంత ప్రజలను కాపాడటానికి వచ్చిన డాకు మహారాజ్ ఎవరు? అతడికి సీతారామ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలో నందిని (శ్రద్ధా శ్రీనాథ్) ఎవరు? కృష్ణమూర్తి మనవరాలిని కాపాడే బాధ్యతను డాకు మహారాజ్ ఎందుకు తీసుకున్నాడు? అన్నదే ఈ మూవీ కథ.
రివేంజ్ డ్రామా...
పాత కథల్ని కొత్తగా చెప్పడం అన్నది కూడా ఓ ఆర్ట్. ఆ కళలో ఆరితేరాడు డైరెక్టర్ బాబీ. మరోసారి డాకు మహారాజ్‌తో తన మార్కు చూపించేశాడు. డాకు మహారాజ్ సింపుల్ రివేంజ్ డ్రామా మూవీ. బ్యాక్‌డ్రాప్, యాక్షన్ ఎపిసోడ్స్, బాలకృష్ణ హీరోయిజంతో ఫ్రెష్ ఫీల్ ఆడియెన్స్‌లో కలిగేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్.
లార్జర్ దేన్ లైఫ్...
ఫక్తు బాలకృష్ణ స్టైల్ మాస్ మూవీ ఇది. గత సినిమాల ఫ్లేవర్ లేకుండా చాలా స్టైలిష్‌గాడైరెక్టర్ బాబీ ఈ మూవీని తీశాడు. ప్రతి పది నిమిషాలకో యాక్షన్ ఎపిసోడ్, బాలకృష్ణ క్యారెక్టర్‌లోని వేరియేషన్స్, ట్విస్ట్‌లతో చివరి వరకు ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చాడు. ఓ వైపు బాలకృష్ణను లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్‌లో చూపిస్తూనే మరోవైపు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చేలా ఆవిష్కరించాడు. రక్తపాతం, హింస విషయంలో లిమిట్స్ దాటకుండా చాలా సెటిల్డ్‌గా క్యారెక్టర్‌ను బిల్డ్ చేయడం బాగుంది.
యాక్షన్ సీన్‌తోనే...
అడవిలో వచ్చే మాస్ ఫైట్‌తో బాలకృష్ణ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత కృష్ణమూర్తి, త్రిమూర్తులు మధ్య గొడవకు సంబంధించిన సన్నివేశాలతో ఆరంభం కాస్త నత్తనడకన సాగుతుంది. నానాజీ ఎంట్రీ యాక్షన్ మోడ్‌లోకి టర్న్ అవుతుంది.
చిన్నారి చంపడానికి ఎమ్మెల్యే గ్యాంగ్ ప్రయత్నాలు, బాలకృష్ణ ఫైటింగ్స్...ఓ పాటతో ఇంటర్వెల్ వరకు కథను నడిపించారు. ఓ వైపు పాప ఎమోషన్...మరోవైపు డాకు గురించి పోలీస్ ఆఫీసర్ సాగించే అన్వేషణను చూపించారు.
బాలకృష్ణ, ఊర్వశి రౌటేలాపై వచ్చే దబిడి దిబిడి సాంగ్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటుంది. చెప్పరా గాడిద అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన బాలకృష్ణ డైలాగ్‌ను బాబీ భలేగా వాడుకున్నాడు.
యాక్షన్ ఎపిసోడ్ గూస్‌బంప్స్...
ఇంటర్వెల్ ముందు సినిమాలో అసలు విలన్ బాబీ డియోల్ పాత్ర స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇస్తుంది. ఇంటర్వైల్ ఫైట్ అదిరిపోతుందని ప్రమోషన్స్‌లో నిర్మాత నాగవంశీ అన్నాడు. అతడి మాటల్లో ఏ మాత్రం అబద్ధం లేదనిపిస్తుంది. పదిహేను నిమిషాల పాటు సాగే యాక్షన్ ఎపిసోడ్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది.
చంబల్ లోయకు షిఫ్ట్...
సెకండాఫ్ మదనపల్లె నుంచి కథను చంబల్ లోయకు షిఫ్ట్ అవుతుంది. చంబల్ లోయలో బల్వంత్ ఠాకూర్ అక్రమాలు, అక్కడి ప్రజల కష్టాలను తీర్చడానికి సీతారాం చేసే ప్రయత్నాలతో చుట్టూ నడిపించారు. డాకు మహారాజ్ పాత్ర తాలూకు మ్యానరిజమ్స్, ఎలివేషన్స్ అభిమానులకు ఫీస్ట్‌గా ఉంటాయి. ఇసుక తుఫాను ఫైట్ హైలైట్‌గా అనిపిస్తుంది. ద్వితీయార్థం రొటీన్‌గా మారుతున్నట్లుగా అనిపిస్తోన్న టైమ్‌లో బాలకృష్ణతో పాటు శ్రద్ధా శ్రీనాథ్ పాత్రలకు సంబంధించి వచ్చే ట్విస్ట్‌లు హై ఫీల్‌ను కలిగిస్తాయి.
ప్రెడిక్టబుల్...
ఎలివేషన్లు, ఫైట్స్ తీసేస్తే డాకు మహారాజ్ కథలో ఎలాంటి కొత్తదనం కనిపించదు. పాపకు నానాజీకి ఉన్న సంబంధం ఏమిటి? అనే దానితో కథ చాలా వరకు ప్రెడిక్టబుల్‌గా సాగుతుంది. కథను ముగించిన తీరు అంతగా ఆకట్టుకోదు.
మూడు వేరియేషన్స్...
మూడు డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో బాలకృష్ణ అదగొట్టాడు. డాకు మహారాజ్ పాత్రలో బాలకృష్ణ ఎనర్జీ ఆకట్టుకుంటుంద. లిమిటెడ్ డైలాగ్స్‌తో సెటిల్డ్‌గా ఈ క్యారెక్టర్ సాగడం కొత్తగా అనిపిస్తుంది. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ సెకండాఫ్‌లోనే కనిపిస్తారు. శ్రద్ధా శ్రీనాథ్ మరోసారి ఓ డిఫరెంట్ రోల్‌తో ఆకట్టుకుంటుంది. విలన్‌గా బాబీ డియోల్ కొన్ని సీన్స్‌లో భయపెట్టాడు. సచిన్ ఖేడ్కర్, రవి కిషన్, షైన్ టామ్ చాకో ఇలా చాలా మందే సీరియర్ యాక్టర్లు ఈ సినిమాలో ఉన్నారు.
ఈ సినిమాకు బాలకృష్ణ తర్వాత మరో హీరోగా తమన్ నిలిచాడు. యాక్షన్ ఎపిసోడ్స్‌లో తమన్ బీజీఎమ్‌కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమే. దబిడి దిబిడి, డేగ సాంగ్స్ బాగున్నాయి.
నో డౌట్...
బాలకృష్ణ అభిమానులకు డాకు మహారాజ్ తెగ నచ్చేస్తుంది. అందులో నో డౌట్. బాలకృష్ణ యాక్టింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ కోసమైనా ఈ మూవీని చూడొచ్చు.
రేటింగ్: 3/5