Daaku Maharaaj Pre Release Business: డాకు మహారాజ్ ప్రీరిలీజ్ బిజినెస్ ఇదీ.. బాలకృష్ణ సినిమాల్లో ఇదే హయ్యెస్ట్-daaku maharaaj pre release business highest for balakrishna movie with 84 crores worldwide ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Daaku Maharaaj Pre Release Business: డాకు మహారాజ్ ప్రీరిలీజ్ బిజినెస్ ఇదీ.. బాలకృష్ణ సినిమాల్లో ఇదే హయ్యెస్ట్

Daaku Maharaaj Pre Release Business: డాకు మహారాజ్ ప్రీరిలీజ్ బిజినెస్ ఇదీ.. బాలకృష్ణ సినిమాల్లో ఇదే హయ్యెస్ట్

Hari Prasad S HT Telugu
Jan 07, 2025 04:35 PM IST

Daaku Maharaaj Pre Release Business: డాకు మహారాజ్ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ లోనే రికార్డు క్రియేట్ చేసింది. నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే అత్యధిక బిజినెస్ చేయడం గమనార్హం. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

డాకు మహారాజ్ ప్రీరిలీజ్ బిజినెస్ ఇదీ.. బాలకృష్ణ సినిమాల్లో ఇదే హయ్యెస్ట్
డాకు మహారాజ్ ప్రీరిలీజ్ బిజినెస్ ఇదీ.. బాలకృష్ణ సినిమాల్లో ఇదే హయ్యెస్ట్

Daaku Maharaaj Pre Release Business: రెండేళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ మరోసారి సంక్రాంతి బరిలో నిలిచాడు. చివరిసారి 2023లో వీర సింహారెడ్డి మూవీతో వచ్చిన అతడు.. ఇప్పుడు డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆ సంక్రాంతికి చిరంజీవితో వాల్తేర్ వీరయ్య తీసిన బాబీ కొల్లి ఈసారి బాలయ్యతో ఈ మూవీ డైరెక్ట్ చేశాడు. భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమా కావడంతో డాకు మహారాజ్ ప్రీరిలీజ్ బిజినెస్ కూడా పెద్ద ఎత్తున జరిగింది.

yearly horoscope entry point

డాకు మహారాజ్ ప్రీరిలీజ్ బిజినెస్

డాకు మహారాజ్ మూవీలో బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా, బాబీ డియోల్ లాంటి వాళ్లు నటించారు. జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. బాలయ్య సినిమాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. ఓటీటీప్లేలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. మూవీ కనీసం రూ.85 కోట్లు వసూలు చేస్తే బ్రేక్ఈవెన్ సాధిస్తుంది. నైజాం ఏరియాలో ఈ మూవీ రూ.18 కోట్ల బిజినెస్ చేసింది.

ఇక ఈస్ట్ గోదావరిలో రూ.6.3 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.5 కోట్లు, కృష్ణలో రూ.5.6 కోట్లు, గుంటూరులో రూ.9.2 కోట్లు, సీడెడ్ లో రూ.16.2 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.8.4 కోట్లు, నెల్లూరులో రూ.2.8 కోట్లు, కర్ణాటకలో రూ.4 కోట్లు, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ.1.5 కోట్లు, ఓవర్సీస్ లో రూ.8 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. అంటే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇది రూ.84 కోట్లుగా ఉంది. ఏపీలో మొత్తంగా డాకు మహారాజ్ థియేట్రికల్ హక్కుల విలువ రూ.51 కోట్లుగా ఉండటం విశేషం.

ఇప్పటి వరకూ వచ్చిన బాలయ్య మూవీస్ లో ఇదే అత్యధికం అంటే ఈ సినిమాపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రెండేళ్ల కిందట చిరంజీవితో వాల్తేర్ వీరయ్య మూవీ తీసి సంక్రాంతి హిట్ కొట్టిన బాబీ కొల్లి.. ఈసారి బాలయ్యతో ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడన్న నమ్మకం అభిమానుల్లో ఉంది.

అదిరిపోయిన ట్రైలర్

డాకు మహారాజ్ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య సినిమాలో ఉండాల్సిన ఎలిమెంట్స్ అనీ అందులో ఉన్నాయి. వరుస హిట్స్ తో మాంచి ఊపు మీదున్న బాలకృష్ణ.. ఈసారి సంక్రాంతి విజేతగా నిలుస్తాడని అతని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు.

నాగ వంశీ సినిమాను నిర్మించాడు. డాకు మహారాజ్ మూవీకి రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుంచి గట్టి పోటీ ఉంది. డాకు మహారాజ్ కంటే రెండు రోజుల ముందు గేమ్ ఛేంజర్, రెండు రోజుల తర్వాత సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ కానున్నాయి. డాకు మహారాజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. వీటికి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో భారీ ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తున్నాయి.

Whats_app_banner