Daaku Maharaaj OTT: బాలకృష్ణ డాకు మహారాజ్ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే - స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే!!
Daaku Maharaaj OTT: బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ యాక్షన్ మూవీకి బాబీ దర్శకత్వం వహించాడు. సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 115 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.

బాలకృష్ణ డాకు మహారాజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌తో పాటు రిలీజ్ డేట్ రివీలైంది. ఫిబ్రవరి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఓటీటీ రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ ఆదివారం అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ యాక్షన్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నది.
బాడీ డియోల్ విలన్...
డాకు మహారాజ్ మూవీకి బాబీ దర్శకత్వం వహించాడు. శ్రద్ధాశ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీడియోల్ విలన్‌గా కనిపించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 115 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది.
మూడు వేరియేషన్స్‌లో...
డాకు మహారాజ్‌గా బాలకృష్ణ క్యారెక్టరైజేషన్, యాక్టింగ్‌తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.
ఈ యాక్షన్ మూవీలో డాకు మహారాజ్, సీతారాం, నానాజీ అనే మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లో బాలకృష్ణ కనిపించాడు. చంబల్ లోయ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు బాబీ డాకు మహారాజ్ మూవీని రూపొందించాడు.
డాకు మహారాజ్ కథ ఇదే...
చంబల్ లోయలో మైనింగ్ కింగ్ బల్వంత్ ఠాకూర్ అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్టవేస్తారు ఇరిగేషన్ ఇంజినీర్లు సీతారాం (బాలకృష్ణ) అతడి భార్య (ప్రగ్యా జైస్వాల్). బల్వంత్ ఠాకూర్ మైనింగ్ బిజినెస్ కారణంగా చంబల్ ప్రాంత ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తుంటారు. మరోవైపు మదనపల్లిలో కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్) కాఫీ ఎస్టేట్ లీజుకు తీసుకుంటాడు ఎమ్మేల్యే త్రిమూర్తులు (రవి కిషన్) . బిజినెస్ పేరుతో స్మగ్లింగ్, జంతువుల అక్రమ రవాణాకు పాల్పడుతుంటాడు.
త్రిమూర్తులు అక్రమాలను అడ్డుకునేందుకు కృష్ణమూర్తి ప్రయత్నిస్తాడు. దాంతో కృష్ణమూర్తిపై పగను పెంచుకున్న త్రిమూర్తులు అతడి మనవరాలు వైష్ణవిని చంపాలని చూస్తాడు. వైష్ణవికి కాపాడటానికి చంబల్ లోయకు చెందిన డాకు మహారాజ్ (బాలకృష్ణ) వస్తాడు.
నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరుతాడు. బల్వంత్ ఠాకూర్‌ను ఎదురించి పోరాటం చేసిన డాకు మహారాజ్...వైష్ణవి కాపాడాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు? డాకు మహారాజ్‌కు సీతారామ్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలో నందిని (శ్రద్ధా శ్రీనాథ్) ఎవరు? అన్నదే ఈ మూవీ కథ.
అఖండ 2
డాకు మహారాజ్ తర్వాత అఖండ 2 మూవీ చేస్తోన్నాడు బాలకృష్ణ. అఖండకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
సంబంధిత కథనం