Daaku Maharaaj First Review: డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ- బాలకృష్ణ అదుర్స్- పండుగకు పర్ఫెక్ట్ మూవీ- 3 స్టార్ రేటింగ్ అంటూ!-daaku maharaaj movie first review by critic umair sandhu balakrishna bobby deol powerful action perfect sankranti film ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Daaku Maharaaj First Review: డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ- బాలకృష్ణ అదుర్స్- పండుగకు పర్ఫెక్ట్ మూవీ- 3 స్టార్ రేటింగ్ అంటూ!

Daaku Maharaaj First Review: డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ- బాలకృష్ణ అదుర్స్- పండుగకు పర్ఫెక్ట్ మూవీ- 3 స్టార్ రేటింగ్ అంటూ!

Sanjiv Kumar HT Telugu

Daaku Maharaaj First Review In Telugu By Umair Sandhu: నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సౌత్ ఫిల్మ్ క్రిటిక్ అండ్ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకునే ఉమైర్ సంధు డాకు మహారాజ్‌పై రివ్యూ ఇచ్చాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ ట్వీట్ అవుతోంది.

డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ

Daaku Maharaaj First Review In Telugu: నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నటించిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య, జై లవ కుశ వంటి సినిమాలను తెరకెక్కించిన బాబీ కొల్లి డాకు మహారాజ్‌కు దర్శకత్వం వహించారు. భగవంత్ కేసరి తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా ఇది.

యానిమల్ విలన్

డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. యానిమల్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా చేశాడు. ఇక దబిడి దిబిడి అనే ఐటమ్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటి ఊర్వశి రౌటెలా పర్ఫామ్ చేసింది.

డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ

జనవరి 10న గ్రాండ్‌గా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా.. సినిమా రిలీజ్ ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీంతో డాకు మహారాజ్‌పై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ మూవీ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.

మరికొన్ని గంటల సమయం

సౌత్ ఫిల్మ్ క్రిటిక్ అండ్ ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకుంటూ కాంట్రవర్సియల్ ట్వీట్స్ చేసే ఉమైర్ సంధు డాకు మహారాజ్ మూవీపై రివ్యూ ఇచ్చాడు. అయితే, ఓవర్సీస్‌లో డాకు మహారాజ్ సెన్సార్ స్క్రీనింగ్ జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ వీక్షించిన ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, సినిమా రిలీజ్‌కు మరికొన్ని గంటల సమయం ఉండగా.. డాకు మహారాజ్ రివ్యూ ఆసక్తిగా మారింది.

సెక్సీ ఐటమ్ సాంగ్

"డాకు మహారాజ్ పైసా వసూల్ ఎంటర్‌టైనర్. నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్ పవర్ ప్యాక్‌డ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. ఊర్వశి రౌటెలా సెక్సీ ఐటమ్ సాంగ్, సిటీ మార్ డైలాగ్స్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్. రొటీన్ స్టోరీ, స్క్రీన్‌ ప్లే ఉన్నప్పటికీ ఈ పండుగకు పర్ఫెక్ట్ సినిమా డాకు మహారాజ్" అని రాసుకొచ్చిన ఉమైర్ సంధు 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.

దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. "సినిమా ఇంకా రిలీజ్ కాలేదు", "అసలు ఇంతవరకు సినిమా సౌండ్ మిక్స్‌లే అవ్వలేదు" అంటూ ఉమైర్ సంధుపై కౌంటర్స్ వేస్తున్నారు నెటిజన్స్.

నెగెటివ్ కామెంట్స్‌తో

ఇదిలా ఉంటే, ఉమైర్ సంధు స్టార్ సెలబ్రిటీలపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ చాలా వైరల్ అయ్యాడు. ప్రతి సినిమా, ట్రైలర్‌కు రివ్యూ ఇస్తూ హైలెట్ అవుతుంటాడు. అంతేకాకుండా హీరోయిన్స్ ప్రైవేట్ విషయాలపై కూడా ఊహించని విధంగా సంచలన కామెంట్స్ చేస్తుంటాడు ఉమైర్ సంధు.

పాజిటివ్ రివ్యూ

ఇక ఉమైర్ సంధు రివ్యూలు కొన్నిసార్లు నిజం కాగా, మరికొన్ని సార్లు పూర్తిగా రివర్స్ అయ్యాయి. ఇదివరకు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌పై నెగెటివ్ రివ్యూ ఇచ్చిన ఉమైర్ సంధు ఇప్పుడు బాలకృష్ణ డాకు మహారాజ్‌పై పాజిటివ్ రివ్యూ ఇచ్చి మరోసారి హైలెట్ అయ్యాడు.

సంబంధిత కథనం