Daaku Maharaaj: బాలకృష్ణ డాకు మహారాజ్‌కు 25 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే!
- Daaku Maharaaj Movie Live Updates: బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మూవీ ఇవాళ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ లైవ్ అప్డేట్స్‌లో సినిమాపై వచ్చే రివ్యూలు, కలెక్షన్స్ వివరాలు, పబ్లిక్ టాక్, బాబీ డైరెక్షన్, తమన్ మ్యూజిక్, మూవీ సీన్స్, ఓటీటీ రిలీజ్, విశ్లేషణ వంటి వివరాలపై లుక్కేద్దాం.
Sun, 12 Jan 202507:04 AM IST
డాకు మహాారాజ్ ఓటీటీ
బాలకృష్ణ డాకు మహారాజ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అని సమాచారం. భారీ ధరకు డాకు మహారాజ్ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
Sun, 12 Jan 202506:35 AM IST
25 కోట్లకుపైగా కలెక్షన్స్
డాకు మహారాజ్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రూ. 18 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉందని చెప్పిన సినీ విశ్లేషకులు వరల్డ్ వైడ్‌గా రూ. 25 కోట్లకు పైగా షేర్ సాధించే ఛాన్స్ ఉందని తెలిపారు.
Sun, 12 Jan 202508:12 AM IST
ఏపీ, తెలంగాణలో
డాకు మహారాజ్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున రూ. 16 నుంచి 18 కోట్ల రేంజ్‌లో షేర్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ అనిలిస్ట్‌లు అంచనా వేశారు.
Sun, 12 Jan 202505:09 AM IST
డాకు మహారాజ్ కలెక్షన్స్
బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా రిలీజ్‌కు ముందు వరల్డ్ వైడ్‌గా రూ. 14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Sun, 12 Jan 202504:50 AM IST
వయసు తగ్గిపోతుంది
యూఎస్‌లో డాకు మహారాజ్ సినిమాను చూసిన ప్రేక్షకులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. అన్ని రకాలుగా సినిమా అదిరిపోయిందని చెబుతున్నారు. బాలయ్య ఏజ్ రోజు రోజుకు తగ్గిపోతుందని, వన్ మ్యాన్ షో అని చెబుతున్నారు.
Us #DaakuMaharaajreview :
— 𝗗𝗥𝗔𝗚𝗢𝗡 𝗪𝗔𝗥🐉 (@NtrneelMode) January 12, 2025
Positive response for #DaakuMaharaj pic.twitter.com/7WudaWOQ93
Sun, 12 Jan 202504:19 AM IST
ఇరగదీసిన బాలయ్య
డాకు మహారాజ్ సినిమా చాలా బాగుందని ఆడియెన్స్ చెబుతున్నారు. బాలకృష్ణ ఇరగదీశాడని తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Sun, 12 Jan 202503:36 AM IST
నువ్ అరిస్తే కుక్క మొరగడం..
డాకు మహారాజ్ సినిమాలోని సీన్స్ వీడియోలను ట్విట్టర్‌లో షేర్ చేస్తున్నారు. అందులో బాలకృష్ణ చెప్పే డైలాగ్ అదిరిపోయింది. నువ్ అరిస్తే బార్కింగ్ (కుక్క మొరగడం).. నేను అరిస్తే.. అని బాలకృష్ణ డైలాగ్ చెప్పినప్పుడు సింహం గర్జింజిన సౌండ్ ప్లే అవుతుంది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
Hit💥💥💥@MusicThaman 🙏🏻🙏🏻💥💥💥💥@vamsi84 💥💥💥 annaaa kotesav hit 💥💥💥💥💥💥💥@dirbobby 🔥🔥🔥🔥🔥🔥#DaakuMaharaaj #DaakuMaharaajOnJan12th #NBK #DaakuMaharaajreview
— Filmupdates (@film_updatez) January 11, 2025
#DaakuMaharaaj pic.twitter.com/NfpEB7MoSM
Sun, 12 Jan 202502:54 AM IST
బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్
డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ స్క్రీన్ ప్రజెన్స్ అదిరిపోయిందని, నెక్ట్స్ లెవెల్ విజువల్స్ ఉన్నాయని, యాక్షన్ మూవీలో ఇలాంటి విజువల్స్ ఎప్పుడు చూడలేదని అంటున్నారు.
Sun, 12 Jan 202502:00 AM IST
ఆడియెన్స్ టాక్
డాకు మహారాజ్ సినిమాకు ఆడియెన్స్ నుంచి టాక్ బాగా వస్తోంది. మూవీలో తమన్ మ్యూజిక్ అదిరిపోయిందని, అతనికి దండం పెట్టాలని అంటున్నారు.
Sun, 12 Jan 202501:35 AM IST
ఏపీలో అలా
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సినిమాలకు రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే ఉదయం నాలుగు గంటలకే ఏపీలో డాకు మహారాజ్ మూవీ షోలు పడ్డాయి.
Sun, 12 Jan 202501:34 AM IST
8 గంటలకు షోలు
తెలంగాణలో డాకు మహారాజ్ సినిమా ఫస్ట్ షోను ఉదయం 8.02 గంటలకు ప్రదర్శించనున్నారు. అయితే, ఇదివరకే అమెరికాలో షోలు పడిపోయాయి.
Sun, 12 Jan 202501:34 AM IST
డాకు మహారాజ్ మూవీ రివ్యూ, కలెక్షన్స్
సంక్రాంతి కానుకగా జనవరి 12న అంటే ఇవాళ 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ మూవీ రివ్యూ, కలెక్షన్స్, బడ్జెట్, ఓటీటీ ప్లాట్‌ఫామ్, రిలీజ్ వంటి విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.
Sun, 12 Jan 202501:34 AM IST
పవర్‌ఫుల్ విలన్‌గా
డాకు మాహారాజ్ సినిమాలో బాలకృష్ణకు పోటీనిచ్చే పవర్‌ఫుల్ విలన్‌గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ నటించాడు. అలాగే, సినిమాలో చాందిని చౌదరి కీలక పాత్ర పోషించగా.. బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా ఐటమ్ సాంగ్‌తో అలరించింది.
Sun, 12 Jan 202501:34 AM IST
భారీ బడ్జెట్ తో
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య డాకు మహారాజ్ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటించారు.
Sun, 12 Jan 202501:34 AM IST
సంక్రాంతి కానుకగా
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి 'డాకు మహారాజ్' చిత్రంతో అలరించనున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.