Daaku Maharaaj Collections: రోజు రోజు తగ్గిపోతున్న డాకు మహారాజ్ కలెక్షన్స్- 5 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Daaku Maharaaj Worldwide Box Office Collection Day 5: గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన డాకు మహారాజ్ 5 రోజుల కలెక్షన్స్ లెక్కలపై లుక్కేద్దాం.
Daaku Maharaaj 5 Days Worldwide Box Office Collection: నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో రూపొందిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ సినిమా డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. తాజాగా నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఐదో రోజు కలెక్షన్స్
అయితే, నాలుగో రోజున 20.41 శాతం తగ్గుదలతో 9.75 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిన డాకు మహారాజ్ సినిమా ఐదో రోజున ఇండియాలో రూ. 4.9 కోట్లు రాబట్టే అవకాశం ఉందని సక్నిల్క్ సంస్థ తెలిపింది. అయితే, ఇవి ఆన్ లైన్ టికెట్స్ సేల్స్ ప్రకారం చెప్పినట్లుగా పేర్కొంది. ఆఫ్ లైన్ టికెట్స్ లెక్కలు వేస్తే మరిన్ని కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.
బడ్జెట్ అండ్ రికవరీ
ఇక ఐదు రోజుల్లో ఇండియాలో డాకు మహారాజ్ సినిమాకు రూ. 65.05 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక సుమారుగా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాకు 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 82 కోట్లుగా నమోదు అయింది. అయితే, 4 రోజుల్లోనే రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్‌కు పెట్టిన ఖర్చులో 76 శాతం రికవరీ చేసింది ఈ సినిమా.
రోజుల వారీగా కలెక్షన్స్
ఐదు రోజుల్లో డాకు మహారాజ్ సినిమాకు రూ. 125 నుంచి 130 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ అయ్యే అవకాశం ఉందని, దాంతో మరింత రికవరీ శాతం పెరిగనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, డాకు మహారాజ్ సినిమాకు మొదటి రోజున రూ. 32.85 కోట్లు, రెండో రోజు రూ. 11.43 కోట్లు, మూడో రోజు రూ. 10.02 కోట్లు, నాలుగో రోజు రూ. 7.71 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.
వీకెండ్‌లో పెరిగే అవకాశం
ఈ లెక్కలు చూస్తుంటే రోజు రోజు డాకు మహారాజ్ కలెక్షన్స్ పడిపోతున్నాయి. ఐదో రోజు కూడా ఐదు కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మిడ్ వీక్ కలెక్షన్స్ ఇలా ఉన్నప్పటికీ వీకెండ్స్ అయిన శనివారం, ఆదివారం డాకు మహారాజ్ వసూళ్లు పెరుగుతాయో చూడాల్సి ఉంది.
సంక్రాంతి బరిలో దిగి
కాగా, జనవరి 12న సంక్రాంతి బరిలోకి దిగిన డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్స్‌గా నటించారు. ఎస్ తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ రోల్ ప్లే చేశారు. ఊర్వశి రౌటెలా ఓ పాత్ర పోషించడమే కాకుండా ఐటమ్ సాంగ్‌తో ఆకట్టుకుంది.
సంబంధిత కథనం