Daaku Maharaaj Collections: సగానికిపైగా పడిపోయిన డాకు మహారాజ్ కలెక్షన్స్- అయినా 70 కోట్లు- 50 శాతం బడ్జెట్ రికవరీ!
Daaku Maharaaj Worldwide Box Office Collection Day 2: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో జోరు చూపిస్తోంది. తొలి రోజు 56 కోట్లు కలెక్ట్ చేసిన డాకు మహారాజ్ మూవీకి రెండు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా వచ్చే కలెక్షన్స్‌పై లుక్కేద్దాం.
Daaku Maharaaj 2 Days Worldwide Box Office Collection: నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ నటించిన లేటెస్ట్ తెలుగు యాక్షన్ థ్రిల్లర్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాగానే పాజిటివ్ రివ్యూస్ తెచ్చుకుంది.
రెండో రోజు కలెక్షన్స్
బాలకృష్ణ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్‌పై ప్రశంసలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ కలెక్షన్స్‌పై క్యూరియాసిటీ నెలకొంది. మొదటి రోజు డాకు మహారాజ్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే, వీర సింహారెడ్డి ఓపెనింగ్ డే (రూ. 54 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ కంటే ఎక్కువ. మొదటి రోజుతో అదరగొట్టిన డాకు మహారాజ్ రెండో రోజు కలెక్షన్స్ కూడా బాగున్నాయి.
సగానికిపైగా పడిపోయిన కలెక్షన్స్
డాకు మహారాజ్ మూవీకి రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్‌గా రూ. 15 కోట్ల రేంజ్‌లో కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని సమాచారం. ఆఫ్‌లైన్ లెక్కలతో కలిపి సుమారుగా రూ. 16 కోట్ల వరకు అందుకునే అవకాశం ఉందట. అయితే, తొలి రోజు వచ్చిన 36.85 కోట్ల కంటే ఇది చాలా తక్కువ. దాదాపుగా సగానికి పైగా కలెక్షన్స్ పడిపోయినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
ఇక కర్ణాటక రెస్టాఫ్ ఇండియా మొత్తంగా డాకు మహారాజ్ సినిమాకు రూ. 1.5 కోట్లకుపైగానే గ్రాస్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే, ఓవర్సీస్‌లో కూడా రెండో రోజున రూ. 19 నుంచి 20 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో డాకు మహారాజ్ సుమారుగా రూ. 52 కోట్ల రేంజ్‌లో గ్రాస్ రాబట్టనుందని టాక్.
డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
అలాగే, వరల్డ్ వైడ్‌గా రెండు రోజుల్లో డాకు మహారాజ్‌కు రూ. 70 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా డాకు మహారాజ్ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ. 80.70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కాగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 82 కోట్లుగా ఫిక్స్ అయింది. తొలి రోజే రూ. 32.85 కోట్ల షేర్ అందుకున్న డాకు మహారాజ్ పెట్టిన ఖర్చులో దాదాపుగా 40 శాతం రికవరీ అయింది.
రికవరీ అయింది
ఇక రెండో రోజుతో సుమారుగా 50 శాతం రికవరీ అయ్యే అవకాశం ఉంది. అయితే, డాకు మహారాజ్ హిట్ కావాలంటే సినిమా ఇంకా రూ. 45 కోట్లు కలెక్ట్ చేసి బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి చేయాలి. ఈ టార్గెట్‌ను డాకు మహారాజ్ త్వరగానే పూర్తి చేస్తే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, డాకు మహారాజ్ సినిమాను దాదాపుగా రూ. 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు సమచారం.
సంబంధిత కథనం