Custody Teaser Tease: ఊపిరి బిగపట్టుకోండి.. కస్టడీ టీజర్ వచ్చేస్తోంది
Custody Teaser Tease: ఊపిరి బిగపట్టుకోండి.. కస్టడీ టీజర్ వచ్చేస్తోంది అంటూ ఈ టీజర్ కు ముందు ఓ టీజ్ రిలీజ్ చేశారు మేకర్స్. నాగచైతన్య నటిస్తున్న ఈ మూవీ టీజర్ తేదీని దీని ద్వారా అనౌన్స్ చేశారు.
Custody Teaser Tease: థ్యాంక్యూ డిజాస్టర్ తర్వాత నాగ చైతన్య నటిస్తున్న మూవీ కస్టడీ. తెలుగు, తమిళంలలో వస్తున్న ఈ సినిమాపై చైతూతోపాటు అతని అభిమానులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకు తగినట్లే ఈ మూవీ మొదటి నుంచీ ఎంతో ఆసక్తి రేపుతోంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్న చైతన్య ఫస్ట్ లుక్ తోనే డైరెక్టర్ వెంకట్ ప్రభు ఆసక్తి రేపాడు.
ఇక ఇప్పుడు టీజర్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఆ టీజర్ కంటే ముందు కస్టడీ టీజర్ టీజ్ అంటూ మరో షార్ట్ వీడియోను సోమవారం (మార్చి 13) రిలీజ్ చేశారు. ఈ టీజ్ తో టీజర్ పై ఆసక్తిని మరింత పెంచారు. ఊపిరి బిగపట్టుకోండి.. టీజర్ వచ్చేస్తోంది అంటూ ఈ టీజ్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ వీడియోలో నీటి అడుగున ఉన్న సెట్ లో నాగచైతన్య కనిపిస్తాడు.
కెమెరా తన దగ్గరికి రాగానే వెనక్కి తిరిగి చూస్తూ సెల్ నుంచి బయటకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత కస్టడీ అనే టైటిల్ వస్తుంది. ఈ మూవీ టీజర్ ను మార్చి 16, సాయంత్రం 4.51 గంటలకు తీసుకురానున్నట్లు ఈ షార్ట్ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో చైతూ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి. ఈ సినిమా నుంచి ఇప్పటికే ప్రతి క్యారెక్టర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్స్ వచ్చాయి. ఇవి మూవీపై క్యూరియాసిటీని మరింత పెంచాయి. మూవీ గ్లింప్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఫస్ట్ లుక్, గ్లింప్స్ లోనే చైతన్యను పవర్ ఫుల్ గా చూపించిన దర్శకుడు వెంకట్ ప్రభు.. టీజర్ లో ఫుల్ యాక్షన్ ను చూపించేలా కనిపిస్తున్నాడు. కస్టడీ మూవీలో అరవింద్ స్వామి విలన్ గా చేశాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నాడు. కస్టడీ మూవీ మే 12న రిలీజ్ కానుంది.
సంబంధిత కథనం