OTT: ఓటీటీలో దుమ్ములేపుతున్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఏకంగా 30 దేశాల్లో టాప్.. ఆ పాన్ ఇండియా చిత్రాలను దాటేసి మరి!-curry and cyanide gets huge response in ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott: ఓటీటీలో దుమ్ములేపుతున్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఏకంగా 30 దేశాల్లో టాప్.. ఆ పాన్ ఇండియా చిత్రాలను దాటేసి మరి!

OTT: ఓటీటీలో దుమ్ములేపుతున్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఏకంగా 30 దేశాల్లో టాప్.. ఆ పాన్ ఇండియా చిత్రాలను దాటేసి మరి!

Sanjiv Kumar HT Telugu
Jan 05, 2024 08:58 AM IST

Curry And Cyanide Response In OTT: రియల్ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఇటీవల ఓటీటీలోకి వచ్చిన డాక్యుమెంటరీ సిరీస్ కర్రీ అండ్ సైనైడ్. దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఏకంగా 30 దేశాల్లో టాప్‌ 10లో ఉంది.

ఓటీటీలో దుమ్ములేపుతున్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఏకంగా 30 దేశాల్లో టాప్.. ఆ పాన్ ఇండియా చిత్రాలను దాటేసి మరి!
ఓటీటీలో దుమ్ములేపుతున్న రియల్ క్రైమ్ స్టోరీ.. ఏకంగా 30 దేశాల్లో టాప్.. ఆ పాన్ ఇండియా చిత్రాలను దాటేసి మరి!

Curry And Cyanide The Jolly Joseph Case OTT Streaming: క్రైమ్ థ్రిల్లర్, హారర్ మూవీస్, వెబ్ సిరీస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు సినీ ప్రియులు. ఇటీవల వచ్చిన నాగ చైతన్య దూత, తమిళ హీరో ఆర్య ది విలేజ్ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక చైతూ అయితే నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా సూపర్ హిట్ కొట్టాడు. ఇలా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే, ఇలా క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఇటీవలే ఓటీటీలోకి రియల్ క్రైమ్ స్టోరీ సిరీస్‌గా వచ్చింది.

కేరళలో జరిగిన ఓ రియల్ క్రైమ్ స్టోరీని ఇప్పటికే చాలా మంది సినిమాగా తెరకెక్కించగా.. మరికొందరు డాక్యుమెంటరీ, సీరియల్‌గా కూడా మలిచి విడుదల చేశారు. ఈ కేరళ క్రైమ్ స్టోరీ ఆధారంగా ఇప్పటికీ మూడు సినిమాలు రాగా.. ఇటీవల డాక్యుమెంటరీ సిరీస్ వచ్చింది. అదే "కర్రీ అండ్ సైనైడ్: ది జూలీ జోసేఫ్ కేస్". కేరళలోని కోజికోడ్ కూడతాయి విలేజ్‌కు చెందిన జూలీ జోసేఫ్ 14 ఏళ్లలో మొత్తం 6 హత్యలు చేసింది. అది కూడా తన కుటుంబ సభ్యులనే చంపడం అప్పట్లో సెన్సేషన్‌గా మారింది.

అయితే జూలీ జోసేఫ్ ఆ ఆరు హత్యలు ఎలా చేసింది, ఎందుకు చేసిందో తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. అలా ఈ రియల్ స్టోరీ సంచలనంగా మారింది. దాంతో ఈ రియల్ క్రైమ్ కథను ఆధారంగా తీసుకునే అనేక సినిమాలు చేశారు. ఇక ఇటీవల "కర్రీ అండ్ సైనైడ్: ది జూలీ జోసేఫ్ కేస్" పేరుతో డాక్యుమెంటరీ సిరీస్‌ను తెరకెక్కించి ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. కర్రీ అండ్ సైనైడ్ డిసెంబర్ 22 నుంచి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, మలయాళం, హిందీ, తమిళం, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ప్రస్తుతం కర్రీ అండ్ సైనైడ్ ఓటీటీలో దుమ్ములేపుతోంది (Curry And Cyanide OTT Response). ఈ సిరీస్ చూసిన వీక్షకులు బాగుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సిరీస్‌పై, జూలీ జోసేఫ్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా సందడి చేస్తున్నాయి. ఆ క్యారెక్టర్ చాలా భయపెట్టిందంటూ వచ్చే పోస్టులు నవ్వు తెప్పించడమే కాదు సిరీస్ చూసేలా ప్రభావం చేస్తున్నాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సిరీస్ ఎంతలా ఆకట్టుకుంటుందో. ఇదంతా ఒకవైపు అయితే, మరోవైపు కర్రీ అండ్ సైనైడ్ సిరీస్ ఇండియా వ్యాప్తంగా టాప్ 3లో నిలిచింది.

కర్రీ అండ్ సైనైడ్ సిరీస్ ఓటీటీలో హీరో వైష్ణవ్ తేజ్-శ్రీలీల ఆదికేశవ సినిమాను మాత్రమే కాకుండా పాన్ ఇండియా చిత్రాలైన షారుక్ ఖాన్ జవాన్, హాలీవుడ్ డీసీ ఫ్రాంఛైజీ మూవీ ఆక్వామాన్‌లను అధిగమించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏకంగా 30 దేశాల్లో టాప్ 10లో కొనసాగుతోంది కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ సిరీస్. ఈ సిరీస్ మొత్తంగా గంటన్నర పాటు ఉండటంతో ఓటీటీ వీక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఇలా ఊహకందని రెస్పాన్స్ తెచ్చుకుంటున్న "కర్రీ అండ్ సైనైడ్: ది జూలీ జోసేఫ్ కేస్" సిరీస్‌కు జాతీయ అవార్డ్ విజేత క్రిస్టో టామీ దర్శకత్వం వహించారు. ఇందులో రెమో రాయ్, రోజో థామస్, రెంజీ విల్సన్, కేజీ సైమన్, బీఏ అలూర్ తదితరులు నటించారు.

Whats_app_banner