Critics Choice Awards: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల్లో 12th ఫెయిల్ హవా.. బెస్ వెబ్ సిరీస్ ఇదే
Critics Choice Awards: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు 2024లో 12th ఫెయిల్, జోరమ్ మూవీస్.. కోహ్రా వెబ్ సిరీస్ సత్తా చాటాయి. ఈ అవార్డుల పూర్తి జాబితాను ఇప్పుడు చూద్దాం.

Critics Choice Awards: ఉత్తమ సినిమాలు, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ లను సత్కరించే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2024 ఈవెంట్ మంగళవారం (మార్చి 12) ముంబైలో జరిగింది. రిచా చద్దా, అలీ ఫజల్, కరణ్ జోహార్, కిరణ్ రావు, అనిల్ కపూర్, విద్యాబాలన్ వంటి సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
విధు వినోద్ చోప్రా డైరెక్ట్ చేసిన 12th ఫెయిల్ మూవీ ఉత్తమ చిత్రంగా, మూవీలో ప్రధాన నటుడు విక్రాంత్ మస్సే ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. త్రీ ఆఫ్ అజ్ మూవీకిగాను షెఫాలీ షా ఉత్తమ నటి అవార్డును గెలుచుకోగా, బరున్ సోబ్తి డైరెక్ట్ చేసిన కోహ్రా బెస్ట్ సిరీస్ అవార్డు అందుకుంది. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2024 విజేతల పూర్తి జాబితా ఇక్కడ ఉంది.
షార్ట్‌ఫిల్మ్ కేటగిరీ
• ఉత్తమ షార్ట్ ఫిల్మ్ - నోక్టర్నల్ బర్గర్
• ఉత్తమ దర్శకుడు - నోక్టర్నల్ బర్గర్ (డైరెక్టర్ - రీమా మాయ)
• ఉత్తమ నటుడు - గిద్ద్ (ది స్కావెంజర్) (నటుడు - సంజయ్ మిశ్రా)
• ఉత్తమ నటి - నోక్టర్నల్ బర్గర్ (నటి - మిల్లో సుంకా)
• ఉత్తమ రచన - గిద్ద్ (ది స్కావెంజర్) (రచయిత - అశోక్ సంఖ్లా, మనీష్ సైనీ)
• ఉత్తమ సినిమాటోగ్రఫీ - లాస్ట్ డేస్ ఆఫ్ సమ్మర్ (సినిమాటోగ్రాఫర్ - జిగ్మెట్ వాంగ్ చుక్)
వెబ్ సిరీస్ కేటగిరీ
• ఉత్తమ వెబ్ సిరీస్ - కోహ్రా
• ఉత్తమ దర్శకత్వం - జూబ్లీ (దర్శకుడు - విక్రమాదిత్య మోత్వానే)
• ఉత్తమ రచన - కోహ్రా (రచయిత - గుంజిత్ చోప్రా, డిగ్గీ సిసోడియా, సుదీప్ శర్మ)
• ఉత్తమ నటుడు - కోహ్రా (నటుడు - సవీందర్ పాల్ విక్కీ)
• ఉత్తమ నటి - ట్రయల్ బై ఫైర్ (నటి - రాజశ్రీ దేశ్ పాండే)
• ఉత్తమ సహాయ నటుడు - జూబ్లీ (నటుడు - సిద్దాంత్ గుప్తా)
• ఉత్తమ సహాయ నటి - లస్ట్ స్టోరీస్ సీజన్ 2: ది మిర్రర్ (నటి - అమృత సుభాష్)
ఫీచర్స్
• ఉత్తమ చిత్రం - 12th ఫెయిల్
• ఉత్తమ దర్శకత్వం - పి.ఎస్.వినోద్ రాజ్ (సినిమా పేరు - కూళంగల్ [పెబుల్స్])
• ఉత్తమ రచన - దేవాశిష్ మఖిజా (సినిమా పేరు - జోరం)
• ఉత్తమ ఎడిటింగ్ - అబ్రో బెనర్జీ (సినిమా పేరు - జోరం)
• ఉత్తమ సినిమాటోగ్రఫీ - అవినాష్ అరుణ్ (సినిమా పేరు - త్రీ ఆఫ్ అజ్)
• ఉత్తమ నటుడు - విక్రాంత్ మస్సే (సినిమా పేరు - 12th ఫెయిల్)
• ఉత్తమ నటి - షెఫాలీ షా (సినిమా పేరు - త్రీ ఆఫ్ అజ్)
• ఉత్తమ సహాయ నటి - దీప్తి నావల్ (సినిమా పేరు - గోల్డ్ ఫిష్)
• జెండర్ సెన్సిటివిటీ - ఫైర్ ఇన్ ది మౌంటెన్స్