థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, కోర్టు డ్రామాతో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే వెబ్ సిరీస్ ‘క్రిమినల్ జస్టిస్’. ఈ వెబ్ సిరీస్ నుంచి ఇప్పటివరకూ వచ్చిన మూడు సీజన్లు సక్సెస్ ను అందుకున్నాయి. ఇప్పుడు అదే గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నాలుగో సీజన్ వచ్చేసింది. ‘క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్’ పేరుతో నాలుగో సీజన్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
క్రిమినల్ జస్టిస్ అనేది జియోహాట్‌స్టార్ స్పెషల్ వెబ్ సిరీస్. ఫస్ట్ 3 సీజన్లు అదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. ఇప్పుడు నాలుగో సీజన్ ‘క్రిమినల్ జస్టిస్ ఏ ఫ్యామిలీ మ్యాటర్’ కూడా జియోహాట్‌స్టార్‌లోకి వచ్చేసింది. ఈ రోజు (మే 29) నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. గురువారం ఓటీటీలో అడుగుపెట్టింది. క్రైమ్ లీగల్ డ్రామా థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఇందులో ఓ ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం ఫస్ట్ 3 ఎపిసోడ్లను మాత్రమే జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేస్తోంది. ‘ఏ బర్త్ డే రిమైండర్’, ‘బర్రీడ్ సీక్రెట్స్’, ‘క్విడ్ ప్రో కో’ పేర్లతో తొలి మూడు ఎపిసోడ్లు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఈ మూడు ఎపిసోడ్లు వరుసగా 38 నిమిషాలు, 41 నిమిషాలు, 41 నిమిషాలున్నాయి.
క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 వెబ్ సిరీస్ ఏడు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇది ఒరిజినల్ హిందీ వెబ్ సిరీస్. హిందీతో పాటు తెలుగు, మలయాళం, బెంగాలి, మరాఠి, తమిళ్, కన్నడ భాషల్లో క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం మూడు ఎపిసోడ్లు మాత్రమే స్ట్రీమింగ్ కు ఉన్నాయి. మొత్తం ఎన్ని ఎపిసోడ్లు, మిగతావి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయన్న దానిపై క్లారిటీ లేదు.
క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ అంటేనే కోర్టు డ్రామా, థ్రిల్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్.. ఇలాంటి కీ ఎలిమెంట్లతో ఆడియన్స్ ను స్క్రీన్ ముందు కూర్చోబెడుతోంది. ఇప్పుడు సీజన్ 4 కూడా అందుకు తగ్గట్లే ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోసారి సీనియర్ లాయర్ మాధవ్ మిశ్రాగా పంకజ్ త్రిపాఠి అదరగొట్టారని చెబుతున్నారు.
రాజ్ నాగ్ పాల్ (మహ్మద్ జీషన్) కూతురు బర్త్ డే తర్వాత అతని ఇంట్లో నర్సు రోషిని సలూజ డెడ్ బాడీ దొరుకుతుంది. దీంతో రాజ్ నాగ్ పాల్ హత్య చేశారని అంతా అనుకుంటారు. మరి ఈ హత్య ఎవరు చేశారు? ఇందులో ఫ్యామిలీ కథ ఏంటి? లాయర్ గా మాధవ్ మిశ్రా ఎలాంటి లాజిక్ లతో కోర్టు డ్రామాను నడిపించారన్నది కథ.
ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠితో పాటు మహ్మద్ జీషన్, సర్వీన్ చావ్లా, ఆశ నేగి తదితరులు యాక్ట్ చేశారు. దీనికి రోషన్ సిప్పీ డైరెక్టర్.
సంబంధిత కథనం