OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్ మూవీ లేదా వెబ్ సిరీస్ అంటే ఓటీటీలో మినిమం గ్యారెంటీ అనేది మేకర్స్ కు అర్థమైపోయింది. ఇప్పుడందుకే భాషతో సంబంధం లేకుండా చాలా వరకు ఈ జానర్ కంటెంట్ నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తాజాగా తెలుగులోనూ టచ్ మి నాట్ (Touch Me Not) పేరుతో ఓ వెబ్ సిరీస్ వస్తోంది.
టచ్ మి నాట్ వెబ్ సిరీస్ ను జియోహాట్‌స్టార్ తీసుకొస్తోంది. నవదీప్, దీక్షిత్ శెట్టి నటించిన ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానున్నట్లు సోమవారం (మార్చి 17) సరికొత్త పోస్టర్ ద్వారా మరోసారి వెల్లడించింది. “నిజాన్ని అసలు తాకలేము అంటే ఏం జరుగుతుంది?
దానికి దగ్గరగా వెళ్లిన కొద్దీ అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. వాళ్లు ఈ కేసును ఛేదించగలరా? టచ్ మి నాట్ జియోహాట్‌స్టార్ లో త్వరలోనే” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. నవదీప్, దీక్షిత్ శెట్టితోపాటు కోమలీప్రసాద్, పూనచ సాంచోలాంటి వాళ్లు ఇందులో నటించారు.
తాజాగా తీసుకొచ్చిన పోస్టర్ లో వెబ్ సిరీస్ లోని లీడ్ రోల్స్ నలుగురినీ చూడొచ్చు. వాళ్లందరూ చాలా ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు.
ఈ టచ్ మి నాట్ వెబ్ సిరీస్ గురించి గతంలోనూ జియోహాట్‌స్టార్ ఓ పోస్టర్ ద్వారా రివీల్ చేసింది. ఆ పోస్టర్లో మంటల్లో కాలిపోతున్న ఓ భారీ భవనం బ్యాక్‌గ్రౌండ్ లో కనిపిస్తోంది. గతంలో అశ్వథ్థామలాంటి మూవీ తీసిన డైరెక్టర్ రమణ తేజ ఈ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు.
పోస్టర్లో దీక్షిత్ శెట్టిని చూపించిన తీరు అతని పాత్రకు ఏదో ప్రత్యేకత ఉన్నట్లుగా చెబుతోంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి సమాచారం త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. అయితే క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అందులోనూ తెలుగులో కాబట్టి ఈ టచ్ మి నాట్ కు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.
ఈ మధ్యే జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కలిసి జియోహాట్‌స్టార్ గా మారిన విషయం తెలుసు కదా. దీంతో గతంలో రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఉండే కంటెంట్ ఇప్పుడీ జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు. ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ధర కూడా తక్కువగానే ఉంది.
మూడు నెలల కాలానికి రూ.299, రూ.399.. ఏడాదికి అయితే రూ.899, రూ.1099, రూ.1499 ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధర ఉన్న ప్లాన్ యాడ్స్ తో పాటు వస్తుంది. ఇందులో కంటెంట్ మధ్యలో యాడ్స్ ను భరించాల్సిందే. లేదంటే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం