Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-crime thriller web series khakee the bengal chapter ott release date netflix web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

Netflix Crime Thriller Web Series: నెట్‌ఫ్లిక్స్ లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. సోమవారం (మార్చి 3) ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేశారు.

నెట్‌ఫ్లిక్స్‌లోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Netflix Crime Thriller Web Series: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లోకి మరో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. గత వారమే టైటిల్ టీజర్ అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. తాజాగా సోమవారం (మార్చి 3) స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది. ఈ సిరీస్ పేరు ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్.

ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ ఓటీటీ రిలీజ్ డేట్

ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ పేరుతో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. దేబాత్మ మండల్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే షోరన్నర్ గా ఉండటం విశేషం. గతంలో నెట్‌ఫ్లిక్స్ లోనే ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ పేరుతో ఓ వెబ్ సిరీస్ వచ్చిన విషయం తెలిసిందే.

పవర్ కోసం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే గ్యాంగ్‌స్టర్లు, పొలిటీషియన్లు ఓవైపు.. ఐపీఎస్ ఆఫీసర్ అర్జున్ మైత్రా మరోవైపు.. ఈ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణే ఈ ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ లో శాశ్వత ఛటర్జీ, పరంబ్రతా ఛటర్జీ, ప్రొసేన్‌జీత్, రిత్విక్ భౌమిక్ లాంటి వాళ్లు నటించారు.

“ఖూన్ యా కానూన్ (రక్తం లేదా చట్టం).. గెలుపు దేనిది? ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లోకి రాబోతోంది” అనే క్యాప్షన్ తో గతవారం ఈ వెబ్ సిరీస్ టైటిల్ టీజర్ ను ఆ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ పోస్టర్ చాలా ఇంటెన్స్ లుక్ లో ఉంది. ఇందులో సిరీస్ లోని ప్రధాన పాత్రలన్నీ కనిపిస్తున్నాయి. చాలా వరకు చేతుల్లో గన్స్ తో ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే.. రక్తం ఏరులై పారే వెబ్ సిరీస్ లా కనిపిస్తోంది.

ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ గురించి..

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ఇప్పటికే ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ పేరుతో ఓ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. మొదట నవంబర్, 2022లో తొలి సీజన్ వచ్చింది. తర్వాత ఆగస్ట్ 2023లో రెండో సీజన్ ను కూడా తీసుకొచ్చారు.

ఈ వెబ్ సిరీస్ బీహార్ లో పేరు మోసిన ఓ క్రిమినల్ ఆట కట్టించడానికి ప్రయత్నించే ఓ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతుంది. నీరజ్ పాండే ఈ షోని కూడా క్రియేట్ చేశాడు. కరణ్ టక్కర్, అవినాష్ తివారీ, అశుతోష్ రాణా, అభిమన్యు సింగ్ లాంటి వాళ్లు నటించారు. భవ్ ధూలియా డైరెక్ట్ చేశాడు. ఈ సిరీస్ ను ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు. ఇక ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ కూడా మార్చి 20న ఇదే ఓటీటీలోకి వస్తోంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం