మీ ఫేవరెట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపే డాక్టర్-crime thriller web series criminal justice season 4 trailer released new season to stream from 29th may on jiohotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మీ ఫేవరెట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపే డాక్టర్

మీ ఫేవరెట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపే డాక్టర్

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఇప్పటి వరకూ వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటైన క్రిమినల్ జస్టిస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది. తాజాగా బుధవారం (మే 14) ట్రైలర్ రిలీజైంది. ఈసారి మరో మర్డర్ కేసుతో మన ముందుకు వస్తున్నాడు లాయర్ మాధవ్ మిశ్రా.

మీ ఫేవరెట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. ట్రైలర్ రిలీజ్.. గర్ల్‌ఫ్రెండ్‌ను చంపే డాక్టర్

క్రైమ్ థ్రిల్లర్ జానర్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ (Criminal Justice). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుందీ సిరీస్. ఇప్పుడు నాలుగో సీజన్ రాబోతోంది. ఇందులో డిఫెన్స్ లాయర్ మాధవ్ మిశ్రా పాత్రలో జీవించేసిన పంకజ్ త్రిపాఠీ.. ఈసారి మరో కొత్త కేసుతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ ట్రైలర్

క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ పేరుతో ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వస్తోంది. ఈ కొత్త సీజన్ మే 29 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బుధవారం (మే 14) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

“ఈసారి నిజానికి రెండు కాదు మూడు కోణాలు ఉన్నాయి. మిశ్రాజీ కెరీర్లో అత్యంత ముఖ్యమైన కేసును చూడటానికి మరికొన్ని రోజులు వేచి చూడండి. హాట్‌స్టార్ స్పెషల్స్ క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్ మే 29 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ ట్వీట్ చేసింది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

క్రిమినల్ జస్టిస్ తొలి మూడు సీజన్లలాగే ఈసారి కూడా ఓ సరికొత్త కేసుతో డిఫెన్స్ లాయర్ మాధవ్ మిశ్రా (పంకజ్ త్రిపాఠీ) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ కొత్త సీజన్లో తన గర్ల్‌ఫ్రెండ్ ను చంపాడన్న అభియోగాన్ని ఎదుర్కొంటాడు ఓ డాక్టర్. అయితే ఇందులో అతని భార్య పేరు కూడా బయటకు వస్తుంది. దీంతో ఆమె డిఫెన్స్ లాయర్ మాధవ్ మిశ్రాను ఆశ్రయిస్తుంది.

అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఈ కొత్త సీజన్లో కనిపించనుంది శ్వేతా బసు ప్రసాద్. తాను తన గర్ల్‌ఫ్రెండ్ ను చంపలేదని డాక్టర్ వేడుకుంటాడు. ఈ కేసు తాను అనుకున్నంత సులువుగా ఏమీ లేదని మాధవ్ మిశ్రాకు కూడా అర్థమవుతుంది. మరి ఆ మహిళను హత్య చేసిందెవరు? మాధవ్ మిశ్రా తన క్లైంట్ ను కాపాడుకుంటాడా లేదా అన్నది మే 29 నుంచి స్ట్రీమింగ్ కానున్న క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ సిరీస్ లో చూడొచ్చు.

క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ గురించి..

క్రిమినల్ జస్టిస్ వెబ్ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. తొలి సీజన్ ఏప్రిల్ 5, 2019న స్ట్రీమింగ్ మొదలైంది. తొలి సీజన్ లో 10 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇక రెండో సీజన్ డిసెంబర్ 24, 2020 నుంచి స్ట్రీమింగ్ అవుతుండగా.. 2022లో మూడో సీజన్ వచ్చింది. ఇప్పుడు దాదాపు మూడేళ్ల తర్వాత నాలుగో సీజన్ రాబోతోంది.

ఈ కొత్త సీజన్ ను రోహన్ సిప్పీ డైరెక్ట్ చేశాడు. ఇందులో పంకజ్ త్రిపాఠీ, శ్వేతా బసు ప్రసాద్ తోపాటు మహ్మద్ జీషాన్ ఆయుబ్, సుర్వీన్ చావ్లా, ఆశా నేగి, ఖుష్బూ ఆత్రేలాంటి వాళ్లు నటించారు. మే 29 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో ఈ కొత్త సీజన్ చూడొచ్చు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం