OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రేమ చంపేస్తుందంటూ.. ట్రైలర్ రిలీజ్-crime thriller web series black white and gray ott release date sony liv ott stream from 2nd may trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller Web Series: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రేమ చంపేస్తుందంటూ.. ట్రైలర్ రిలీజ్

OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రేమ చంపేస్తుందంటూ.. ట్రైలర్ రిలీజ్

Hari Prasad S HT Telugu
Published Apr 14, 2025 02:53 PM IST

OTT Crime Thriller Web Series: ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ప్రేమ చంపేస్తుందంటూ రాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ సోమవారం (ఏప్రిల్ 14) రిలీజైంది. సోనీ లివ్ ఓటీటీ ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనుంది.

ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రేమ చంపేస్తుందంటూ.. ట్రైలర్ రిలీజ్
ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ప్రేమ చంపేస్తుందంటూ.. ట్రైలర్ రిలీజ్

OTT Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్లో ఓ వెబ్ సిరీస్ రాబోతోంది. ఓ ప్రేమ జంట.. అనుకోని పరిస్థితుల్లో జరిగే హత్యల చుట్టూ తిరిగే ఈ సిరీస్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండటంతో సిరీస్ పై అంచనాలు పెరిగాయి.

బ్లాక్ వైట్ అండ్ గ్రే ఓటీటీ రిలీజ్ డేట్

సోనీ లివ్ ఓటీటీలోకి బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ అనే సరికొత్త వెబ్ సిరీస్ రానుంది. ఈ వెబ్ సిరీస్ మే 2 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సోమవారం (ఏప్రిల్ 14) ట్రైలర్ రిలీజ్ చేశారు.

“అన్ని ప్రేమ కథలూ చరిత్ర సృష్టించలేవు. కొన్ని క్రైమ్ రిపోర్టులుగా మారతాయి. నాలుగు శవాలు.. లెక్కలేనన్ని అబద్ధాలు. బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ మే 2 నుంచి కేవలం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ట్రైలర్ వచ్చేసింది” అనే క్యాప్షన్ తో సోనీ లివ్ ఓటీటీ ట్వీట్ చేసింది. దీనికి ట్రైలర్ వీడియోను యాడ్ చేసింది.

ట్రైలర్ ఎలా ఉందంటే?

బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ అనే వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ఓ ప్రేమ జంట చాటింగ్ చేసుకుంటున్న సీన్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత వీళ్లు సీక్రెట్ గా కలుసుకొని కారులో వెళ్తుంటారు. నేను నీతో సీరియస్ గా ప్రేమలో ఉన్నానని అబ్బాయి చెబుతాడు.. కానీ అమ్మాయి మాత్రం ప్రేమలాంటివేమీ వద్దంటుంది.

ఆ తర్వాత సడెన్ గా ఆ అమ్మాయి కారులోనే కన్నుమూస్తుంది. ఏం చేయాలో అర్థం కాక ఆ యువకుడు ఆ అమ్మాయి శవాన్ని ఓ అడవిలోకి తీసుకెళ్లి తగలబెట్టేస్తాడు. ఆ అమ్మాయి ఓ రాజకీయ నాయకుడి కూతురు కావడం గమనార్హం. దీంతో స్టోరీ కాస్తా పొటిలికల్ టర్న్ తీసుకుంటుంది.

అసలు ఆ అమ్మాయికి ఏమైంది? ఎలా చనిపోయింది? దీనికి మరో రెండు హత్యలకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. బ్లాక్ వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్ అనే ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీలో మే 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ ఎస్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం