OTT Crime Show: ఓటీటీలోకి వచ్చిన మరో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-crime thriller tv show crime patrol now streaming on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Show: ఓటీటీలోకి వచ్చిన మరో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Crime Show: ఓటీటీలోకి వచ్చిన మరో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Hari Prasad S HT Telugu

OTT Crime Show: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో రావడం విశేషం. ఒకప్పుడు టీవీల్లో ప్రేక్షకుల ఆదరణ సంపాదించిన షోలను ఇప్పుడు ఓటీటీలోకి తీసుకురావడం ఓ ట్రెండ్ గా మారిన విషయం తెలిసిందే.

ఓటీటీలోకి వచ్చిన మరో సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ టీవీ షో.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Crime Show: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్, సినిమాలే కాదు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఒకప్పటి పాపులర్ క్రైమ్ షోలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఈ మధ్యే సోనీ ఛానెల్ హిట్ షో సీఐడీ నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన విషయం తెలుసు కదా. ఇప్పుడు మరో క్రైమ్ షో కూడా అదే రూట్లో వెళ్లింది.

క్రైమ్ ప్యాట్రోల్ ఓటీటీ స్ట్రీమింగ్

క్రైమ్ ప్యాట్రోల్ (Crime Patrol) పేరు వినే ఉంటారు. ఒకప్పుడు టీవీల్లో ఓ ఊపు ఊపేసిన క్రైమ్ షో. ఇప్పుడీ షో నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చింది. సీఐడీ రూట్లోనే ఈ షో కూడా అదే ఓటీటీలోకి అడుగుపెట్టడం విశేషం. నిజానికి ఇప్పటికే ఈ షో సోనీ లివ్ ఓటీటీలోనూ ఉంది.

ఆ ఓటీటీకి చెందిన ఛానెల్ సోనీ నెట్‌వర్క్ లో ఒకప్పుడు మంచి పేరు సంపాదించిన షో ఇది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోనూ వచ్చింది. సోమవారం (మార్చి 17) నుంచే ఈ రెండో ఓటీటీలోకీ స్ట్రీమింగ్ కు వచ్చింది.

క్రైమ్ ప్యాట్రోల్ షో గురించి..

అనూప్ సోనీ నటించిన షో ఈ క్రైమ్ ప్యాట్రోల్. సావధాన్ రహే.. సతర్క్ రహే (జాగ్రత్తగా ఉండండి.. అప్రమత్తంగా ఉండండి) అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయ్యాడతడు. అతనితోపాటు దివాకర్ పండిర్, శక్తి ఆనంద్, సాక్షి తన్వర్, సంజీవ్ త్యాగి, నిస్సార్ ఖాన్, మనీష్ రాజ్ శర్మ, సోనాలి కులకర్ణి, దివ్యాంకా త్రిపాఠీలాంటి వాళ్లు కూడా హోస్ట్‌లుగా వ్యవహరించారు. అయితే అనూప్ సోనీకి ఈ షో ద్వారా వచ్చినంత పేరు మరెవరికీ రాలేదు.

మే 9, 2003లో ఈ క్రైమ్ ప్యాట్రోల్ తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. ఇప్పటి వరకూ ఏకంగా 2072 ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం విశేషం. నిజ జీవితంలో జరిగిన నేరాలను సందేశాత్మకంగా ఈ షో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో తొలి ఐదు ఎపిసోడ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి సోమవారం ఒక్కో కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వస్తుంది.

ఇప్పటికే సీఐడీ 2 కూడా నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఐడీ తొలి సీజన్ అన్ని ఎపిసోడ్లతోపాటు రెండో సీజన్ లో వచ్చిన ఎపిసోడ్లన్నీ ఇందులో ఉన్నాయి. కొత్త ఎపిసోడ్లు ప్రతి వారం వస్తున్నాయి. ఈ రెండు క్రైమ్ షో నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రైబర్లకు మరింత వినోదం పంచుతున్నాయి.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం