OTT Crime Thriller: ఓటీటీలోకి రానున్న నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. సస్పెన్స్‌గా టీజర్.. తెలుగులోనూ..-crime thriller ott web series 1000 babies teaser is gripping to stream soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: ఓటీటీలోకి రానున్న నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. సస్పెన్స్‌గా టీజర్.. తెలుగులోనూ..

OTT Crime Thriller: ఓటీటీలోకి రానున్న నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. సస్పెన్స్‌గా టీజర్.. తెలుగులోనూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 25, 2024 03:40 PM IST

1000 Babies OTT Crime Thriller: ‘1000 బేబీస్’ వెబ్ సిరీస్ టీజర్ వచ్చేసింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ టీజర్ గ్రిప్పింగ్‍గా.. ఇంట్రెస్టింగ్‍గా ఉంది. నీనా గుప్తా ఈ సిరీస్‍లో మెయిన్ రోల్ చేశారు. టీజర్ సస్పెన్స్‌ఫుల్‍గా ఉండటంతో సిరీస్‍పై ఆసక్తి పెరిగింది.

OTT Crime Thriller: ఓటీటీలోకి రానున్న నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. సస్పెన్స్‌గా టీజర్.. తెలుగులోనూ..
OTT Crime Thriller: ఓటీటీలోకి రానున్న నయా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. సస్పెన్స్‌గా టీజర్.. తెలుగులోనూ..

ఓటీటీల్లోకి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‍ల హోరు కొనసాగుతోంది. ఈ జానర్లో వరుసగా సిరీస్‍లు వస్తూనే ఉన్నాయి. ప్రేక్షకుల నుంచి కూడా థ్రిల్లర్ సిరీస్‍లకు ఎక్కువగా రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలో మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రెడీ అవుతోంది. ‘1000 బేబీస్’ అనే డిఫరెంట్ టైటిల్‍తో ఈ సిరీస్ వస్తోంది. ఈ సిరీస్‍లో రహమాన్, నీనా గుప్తా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. సస్పెన్స్‌ఫుల్‍గా ఉంది.

టీజర్ ఇలా..

అడవి మధ్యలో ఉన్న ఓ భవనం షాట్‍తో 1000 బేబీస్ టీజర్ మొదలైంది. ఆ తర్వాత పిల్లలు సందడిగా ఆడుతున్న సీన్ ఉంది. ప్రసవాలు చేసే ఆసుపత్రిలా ఉండే భవనంలో ఓ మహిళ ఏడుస్తుంటుంది. ఆ భవనం బయట నీనా గుప్తా ఆందోళన చెందుతూ నిల్చొని ఉంటారు. నవజాత శిశువుల ఏడుపులు తన చెవుల్లో మారుమోగుతున్నాయంటూ ఆమె అంటారు. ఆ తర్వాత రహమాన్ కనిపిస్తారు. ఆయనది ఈ మిస్టరీని ఛేదించే పాత్రలా అనిపిస్తోంది.

54 సెకన్ల పాటు ఉన్న 1000 బేబీస్ టీజర్ మిస్టరీతో గ్రిప్పింగ్‍గా.. ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంటెన్స్‌గా ఉంది.

1000 బేబీస్ వెబ్ సిరీస్‍కు నీజమ్ కొయ్య దర్శకత్వం వహిస్తున్నారు. నీజమ్‍తో పాటు అరౌజ్ ఇర్ఫాన్ కూడా కథ రాశారు. గతేడాది నుంచే ఈ సిరీస్ షూటింగ్ జరుగుతోంది. కేరళ, తమిళనాడులోని సుమారు 93 లొకేషన్లలో ఈ సిరీస్‍ షూటింగ్ జరిగింది.

ఏడు భాషల్లో.. త్వరలో స్ట్రీమింగ్

మలయాళంలో రూపొందిన 1000 బేబీస్ వెబ్ సిరీస్ మొత్తంగా ఏడు భాషల్లో డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍‍కు రానుంది. మలయాళం, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. అయితే, స్ట్రీమింగ్ డేట్‍ను హాట్‍స్టార్ ప్రస్తుతం వెల్లడించలేదు. త్వరలో అంటూ పేర్కొంది. సెప్టెంబర్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది.

రహమాన్, నీనా గుప్తాతో పాటు సంజూ శివరాం, ఆశ్విన్ కుమార్, షాజు శ్రీధర్, ఇర్షాద్ అలీ, జాయ్ మాథ్యూస్, మనూ ఎం లాల్, షాలు రహీం, సిరాజుద్దీన్ నజర్ 1000 బేబీస్ సిరీస్‍లో కీలకపాత్రలు పోషించారు. నీరజ్ కోయా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‍కు శంకర్ శర్మ సంగీతం అందించారు.

1000 బేబీస్ సిరీస్‍ను ఆగస్ట్ సినిమాస్ పతాకంపై షాజీ నటేషన్ నిర్మించారు. ఫైజ్ సిద్దిఖ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ సిరీస్‍కు జాన్ కుట్టీ ఎడిటింగ్ చేశారు.

స్ట్రీమింగ్‍కు వచ్చిన ముంజ్య

సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమా ‘ముంజ్య’ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో నేడు (ఆగస్టు 25) స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. హిందీలో అందుబాటులోకి వచ్చింది. జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సుమారు రూ.130 కోట్ల వరకు కలెక్షన్లు సాధించి బ్లాక్‍బస్టర్ అయింది. శార్వరీ వాఘ్, అజయ్ వర్మ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఆదిత్య సర్పోట్దార్ దర్శకత్వం వహించారు. ముంజ్య సినిమాను హాట్‍స్టార్ ఓటీటీలో చూసేయవచ్చు.