OTT Trending Movies: ఓటీటీలో మూడు వారాలుగా ట్రెండ్ అవుతున్న రెండు సినిమాలు.. ఒకటి థ్రిల్లర్.. మరొకటి కామెడీ-crime thriller officer on duty and dragon movies trending on netflix ott from more than three weeks ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Trending Movies: ఓటీటీలో మూడు వారాలుగా ట్రెండ్ అవుతున్న రెండు సినిమాలు.. ఒకటి థ్రిల్లర్.. మరొకటి కామెడీ

OTT Trending Movies: ఓటీటీలో మూడు వారాలుగా ట్రెండ్ అవుతున్న రెండు సినిమాలు.. ఒకటి థ్రిల్లర్.. మరొకటి కామెడీ

OTT Trending Movies: ఓటీటీలో రెండు సినిమాలు దుమ్మురేపుతున్నాయి. ఆరంభం నుంచి మంచి వ్యూస్ సాధిస్తున్నాయి. ఇందులో ఒకటి క్రైమ్ థ్రిల్లర్ కాగా.. మరొకటి కామెడీ సినిమా. ఆ వివరాలు ఇవే..

OTT Trending Movies: ఓటీటీలో మూడు వారాలుగా టాప్-10లో ట్రెండ్ అవుతున్న రెండు సినిమాలు

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ, తమిళ కామెడీ మూవీ డ్రాగన్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్లు అయ్యాయి. థియేటర్లలో దుమ్మురేపాయి. ఈ రెండు చిత్రాలు ఒకే వారం.. ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చాయి. మంచి వ్యూస్ దక్కించుకొని సత్తాచాటుతున్నాయి. ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చిన మూడు వారాలు అవుతున్నా ఇంకా టాప్-10లోనే ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ఆఫీసర్ ఆన్ డ్యూటీ

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మొదటి నుంచే అదరగొడుతోంది. మంచి క్రేజ్‍తో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ఈ మూవీ భారీ వ్యూస్ సాధిస్తోంది. కొన్ని రోజుల పాటు నెట్‍ఫ్లిక్స్ ఇండియా సినిమాల ట్రెండింగ్‍ లిస్టులో టాప్‍లో నిలిచింది. ప్రస్తుతం (ఏప్రిల్ 14) ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

కుంచకో బోబన్ ప్రధాన పాత్ర పోషించిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ మార్చి 21న నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఓటీటీలోకి వచ్చి మూడు వారాలు అవుతున్నా ఇంకా టాప్-10లోనే ఈ సినిమా ఉంది. మంచి వ్యూస్ సాధిస్తూ ట్రెండింగ్‍లో కంటిన్యూ అవుతోంది.

థియేటర్లలోకి ఆఫీసర్ ఆన్ డ్యూటీ మంచి హిట్ సాధించింది. దాదాపు రూ.12కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం రూ.50కోట్లకు పైగా వసూళ్లతో దుమ్మురేపింది. ఈ చిత్రానికి జితూ అష్రఫ్ దర్శకత్వం వహించారు. నెట్‍ఫ్లిక్స్‌ ఓటీటీలోనూ ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయింది. వరుస హత్యలపై ఓ పోలీస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ మూవీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ చిత్రంలో ప్రియమణి కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు.

డ్రాగన్

తమిళ యూత్‍ఫుల్ కామెడీ మూవీ ‘డ్రాగన్’ కూడా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సత్తాచాటుతోంది. స్ట్రీమింగ్‍కు వచ్చి మూడు వారాలు దాటినా ఇంకా టాప్-10లో ట్రెండ్ అవుతోంది. పస్తుతం (ఏప్రిల్ 14) నెట్‍ఫ్లిక్స్ ఇండియా సినిమా ట్రెండింగ్ జాబితాలో ఆరో ప్లేస్‍లో ఉంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమా మార్చి 21న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అడుగుపెట్టింది.

డ్రాగన్ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలై బంపర్ హిట్ సాధించింది. సుమారు రూ.37 కోట్ల బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ రూ.150కోట్ల కలెక్షన్లతో సెన్సేషనల్ హిట్ సొంతం చేసుకుంది. తెలుగులోనూ మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ మూవీకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ప్రదీప్‍కు జోడీగా అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు.

థియేటర్లలో సూపర్ హిట్ అయిన డ్రాగన్.. నెట్‍ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోంది. భారీ వ్యూస్ సాధిస్తోంది. స్ట్రీమింగ్ తర్వాత కూడా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఇటీవల కొన్ని పాపులర్ సినిమాలు నెట్‍ఫ్లిక్స్‌లోకి వచ్చినా టాప్-10లో కొనసాగుతూనే ఉంది. ఆరంభం సుమారు వారం పాటు టాప్‍లోనూ నిలిచింది. మరి ఈ రెండు చిత్రాలు ఇంకా ఎంతకాలం ట్రెండింగ్‍లో హవా కొనసాగిస్తాయో చూడాలి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం