Crime Thriller Movie: నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. రూ.500 కోట్ల డైమండ్ చోరీ.. ట్రైలర్ అదుర్స్-crime thriller movie jewel thief trailer netflix to stream from 25th april ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crime Thriller Movie: నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. రూ.500 కోట్ల డైమండ్ చోరీ.. ట్రైలర్ అదుర్స్

Crime Thriller Movie: నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. రూ.500 కోట్ల డైమండ్ చోరీ.. ట్రైలర్ అదుర్స్

Hari Prasad S HT Telugu

Crime Thriller Movie: నెట్‌ఫ్లిక్స్ లో మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ నేరుగా అడుగుపెడుతోంది. సోమవారం (ఏప్రిల్ 16) ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఫుల్ యాక్షన్, థ్రిల్ తో ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా సాగింది.

నెట్‌ఫ్లిక్స్‌లోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. రూ.500 కోట్ల డైమండ్ చోరీ.. ట్రైలర్ అదుర్స్

Crime Thriller Movie: యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరైన డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడ్యూస్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ జువెల్ థీఫ్ (Jewel Thief) నెట్‌ఫ్లిక్స్ లోకి వస్తోంది. నేరుగా ఓటీటీలోకే అడుగుపెడుతున్న ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం (ఏప్రిల్ 16) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. సైఫ్ అలీ ఖాన్ ఇందులో డైమండ్ దొంగగా కనిపించనున్నాడు.

జువెల్ థీఫ్ ట్రైలర్

నెట్‌ఫ్లిక్స్ తీసుకొస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ జువెల్ థీఫ్ ది హైస్ట్ బిగిన్స్. ఈ సినిమా ఏప్రిల్ 25 నుంచి ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్, నిఖితా దత్తా లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమా రూ.500 కోట్ల డైమండ్ చోరీ చుట్టూ తిరుగుతుంది. రెడ్ సన్ అనే ఈ డైమండ్ ఆఫ్రికాలోనే అత్యంత ఖరీదైన డైమండ్ గా పరిచయం చేస్తూ ట్రైలర్ ప్రారంభమవుతుంది.

ముంబైకి వచ్చే ఈ డైమండ్ ను దొంగిలించడానికి ప్రపంచంలోనే పేరుగాంచిన జువెల్ థీఫ్ రేహాన్ రాయ్ ను స్థానిక డాన్ నియమిస్తాడు. ఆ జువెల్ థీఫే సైఫ్ అలీ ఖాన్. ఇందులో రాజన్ ఔలాఖ్ అనే పాత్రలో జైదీప్ అహ్లావత్ నటించాడు. అతనిదో మాఫియా బాస్ పాత్ర. ఇక ఈ డైమండ్ దొంగలను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పటేల్ పాత్రలో కునాల్ కపూర్ నటించాడు.

ట్రైలర్ ఎలా ఉందంటే?

రెడ్ సన్ అనే ఓ భారీ డైమండ్ చోరీ కథే ఈ జువెల్ థీఫ్ మూవీ స్టోరీ. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉండబోతోంది ఈ 2 నిమిషాల 13 సెకన్ల ట్రైలర్ కళ్లకు కట్టింది. కుకీ గులాటీ, రాబీ గ్రేవాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ నిర్మించింది.

పఠాన్, ఫైటర్ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఆనంద్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో అతని మూవీస్ లోని హైఓల్టేజ్ యాక్షన్ సీన్లన్నీ ఈ జువెల్ థీఫ్ లోనూ కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మొదట్లోనే ఈ మూవీ గురించి నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఈ సినిమాను ఏప్రిల్ 25 నుంచి చూడొచ్చు.

Hari Prasad S

TwittereMail
హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం