OTT Releases: ఒకే రోజు అమెజాన్ ప్రైమ్‌లోకి ఐదు తెలుగు సినిమాలు వచ్చాయి. వీటిలో ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలే ఉండటం గమనార్హం. ఈ ఐదు సినిమాలు ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో అందుబాటులోకి వచ్చాయి. 99 రూపాయల రెంట్‌తో స్ట్రీమింగ్ అవుతోన్నాయి.
బిగ్‌బాస్ సీజన్ 2 బ్యూటీ సంజన అన్నే ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ రీల్ మూవీ థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీలో సిరి చౌదరి, జబర్ధస్థ్ అభి, భరత్ కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్‌గా నటిస్తూనే ఈ మూవీకి సంజన అన్నే దర్శకత్వం వహించింది. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.
సినిమాలపై ఇష్టంతో ఇంట్లో నుంచి పారిపోయిన మౌనిక అనే అమ్మాయి దారుణంగా హత్యకు గురవుతుంది. మౌనికను మర్డర్ చేసిన వారిని పోలీస్ ఆఫీసర్ మాయ ఎలా పట్టుకుంది అన్నదే ఈ మూవీ కథ.
ఐపీఎస్ ఆఫీసర్ టర్న్‌డ్ పొలిటికల్ లీడర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా రూపొందిన ప్రవీణ్ ఐపీఎస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ బయోపిక్ మూవీలో నందకిషోర్ ధూళిపాళ హీరోగా నటించాడు. ప్రవీణ్ కుమార్ జీవితంలోని కీలక ఘట్టాల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి దుర్గాదేవ్ నాయుడు దర్శకత్వం వహించాడు.
బిగ్‌బాస్ ఫేమ్ అజయ్ కతుర్వార్‌తో పాటు వంశీ, ఆదిత్య, రోమికా శర్మ, ప్రగ్యా నయన్ హీరోహీరోయిన్లుగా నటించిన వీ లవ్ బ్యాడ్ బాయ్స్ సడెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ప్రశాంత్, వినయ్, అరుణ్ ప్రాణ స్నేహితులు. వారి జీవితంలోకి ఓ ముగ్గురు అమ్మాయిలు ఎలా ఎంటరయ్యారు? లవ్ అంటే టైమ్‌పాస్ అనే అభిప్రాయంలో ఉన్న వారిలో ఎలా మార్పు వచ్చింది అన్నదే ఈ మూవీ కథ.
అమ్మాయిలు బ్యాచ్‌లర్ పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుందనే వెరైటీ కాన్సెప్ట్‌తో పెళ్లి కూతురు పార్టీ మూవీ తెరకెక్కింది. ప్రిన్స్, అర్జున్ కళ్యాణ్, అనీషా దామా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి అపర్ణ మల్లాది దర్శకత్వం వహించింది. మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ కమర్షియల్‌గా మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఈ నాలుగు సినిమాలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బొమ్మల కొలువు కూడా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చింది. హృషికేష్, ప్రియాంక శర్మ, మాళవికా సతీషన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి సుబ్బు వేదుల దర్శకత్వం వహించాడు. 2022లో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. దాదాపు మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చింది.
సంబంధిత కథనం