Comedy Thriller OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
Bharathanatyam OTT Release Date: భరతనాట్యం చిత్రం ఓటీటీలో అడుగుపెడుతోంది. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రం ఎప్పుడు, ఓ ప్లాట్‍ఫామ్‍లోకి రానుందంటే..

తక్కువ బడ్జెట్‍తో ‘భరతనాట్యం’ చిత్రం రూపొందింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ మూవీ వచ్చింది. సూర్య తేజ అయిలే, మీనాక్షి గోస్వామి హీరోహీరోయిన్లు నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. దొరసాని ఫేమ్ డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహించడంతో భరతనాట్యం మూవీపై కాస్త బజ్ వినిపించింది. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంత పర్ఫార్మ్ చేయలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.
స్ట్రీమింగ్ తేదీ, ప్లాట్‍ఫామ్
భరతనాట్యం చిత్రం జూలై 27వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజైన సుమారు మూడున్నర నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ మూవీలో సూర్యతేజ హీరోగా పరిచయం అయ్యారు. వైవా హర్ష కూడా ఓ మెయిన్ రోల్ చేశారు.
తన తొలి మూవీ దొరసానితో మెప్పించిన దర్శకుడు కేవీఆర్ మహేంద్ర.. భరతనాట్యం చిత్రంతో అంచనాలను అందుకోలేకపోయారు. ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అందులోని పెద్దగా ప్రమోషన్లు కూడా చేయకపోవటంతో థియేటర్లలో ఎక్కువ కాలం రన్ కాలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది.
భరతనాట్యం చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని పాయల్ సరాఫ్ నిర్మించారు. వెంకట్ ఆర్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి రవితేజ గిరిజల ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రంలో సూర్యతేజ, మీనాక్షి, హర్షతో పాటు హర్షవర్ధన్, అజయ్ ఘోష్, మస్తాలీ, టెంపర్ వంశీ, గంగవ్వ కీలకపాత్రలు పోషించారు.
భరతనాట్యం స్టోరీ లైన్
సినీ దర్శకుడు కావాలనే కలలు కనే రాజు సుందరమ్ (సూర్య తేజ) చుట్టూ భరతనాట్యం స్టోరీ తిరుగుతుంది. అతడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తూ ఉంటాడు. డైరెక్టర్ అయ్యేందుకు స్క్రిప్టులను నిర్మాతలకు చెబుతుంటే వారు అవసరమైన మార్పులను చెబుతుంటారు. ప్రేయసి అభి (మీనాక్షి గోస్వామి).. రాజును ఉద్యోగం చేయాలని ఒత్తిడి చేస్తుంటుంది. అయితే సినీ ఇండస్ట్రీలోనే ఉండాలని రాజు డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో రాజు తల్లికి ఆరోగ్య సమస్య వస్తుంది. ఆపరేషన్ కోసం భారీగా డబ్బు అవసరం అవుతుంది. ఇక వేరే దారి లేక త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించి పెద్ద చిక్కుల్లో పడతాడు రాజు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే భరతనాట్యం చిత్రంలో ఉంటుంది.
ఆహాలో రాజుయాదవ్
కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజుయాదవ్ సినిమా కూడా ఇదే వారం ఆహా ఓటీటీలోకి వస్తోంది. జూలై 24వ తేదీన ఈ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయంపై ఆహా అధికారిక ప్రకటన కూడా చేసింది. రాజు యాదవ్ చిత్రంలో గెటప్ శ్రీను సరసన అంకిత ఖారత్ హీరోయిన్‍గా నటించారు. ఆనంద చక్రవాణి, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, రాకెట్ రాఘవ కీలకపాత్రలు పోషించారు. కృష్ణమాచారి కే దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. రాజుయాదవ్ చిత్రాన్ని జూలై 24 నుంచి ఆహాలో చూసేయవచ్చు.