Court OTT Release: నిన్న థియేటర్లలో రిలీజైన మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే.. ఎప్పుడు రావచ్చంటే?
Court OTT Release: నాని ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. అటు టీవీ పార్ట్‌నర్ ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. ప్రియదర్శి నటించిన ఈ సినిమాకు మంచి రివ్యూలు వస్తున్న విషయం తెలిసిందే.
Court OTT Release: భిన్నమైన కథలను ప్రోత్సహిస్తూ నిర్మాతగానూ రాణిస్తున్న నటుడు నాని తాజాగా కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ అనే మూవీని తీసుకొచ్చాడు. ఈ సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ, శాటిలైట్ పార్ట్‌నర్స్ ఖరారయ్యాయి. వచ్చే నెలలోనే ఈ మూవీ ఓటీటీలోకి రానుంది.
కోర్ట్ ఓటీటీ, టీవీ పార్ట్‌నర్స్
ప్రియదర్శి నటించిన మూవీ కోర్ట్: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ. సీనియర్ నటుడు శివాజీ విలన్ గా నటించాడు. ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు కూడా వచ్చిన ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మూవీ వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక టీవీ హక్కులను ఈటీవీ సొంతం చేసుకోవడం విశేషం. ఓ చిన్న సినిమాగా రిలీజైనా.. నాని ప్రొడ్యూస్ చేసిన సినిమా కావడం, తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో కోర్ట్ మూవీకి క్రేజ్ పెరుగుతోంది.
కోర్ట్ మూవీ ఎలా ఉందంటే?
ప్రియదర్శి, శివాజీ, రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు. కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. కోర్టు రూమ్ డ్రామా కథాంశాలతో బాలీవుడ్, మలయాళం భాషలతో పోలిస్తే తెలుగులో చాలా తక్కువ సినిమాలొచ్చాయి. కోర్టు రూమ్ సినిమాలు ఒకే లోకేషన్‌లో సాగుతాయి.
కేవలం డైలాగ్స్‌తోనే థ్రిల్‌ను పంచుతూ చివరి వరకు ఆడియెన్స్‌ను థియేటర్లలో కూర్చోబెట్టడం అంటే కత్తిమీద సాములాంటిదే.ఈ ప్రయత్నంలో డైరెక్టర్ రామ్ జగదీష్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. పోక్సో చట్టంలోని లోతుపాతులను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించారు. పోక్సో చట్టం గురించి తెలియని కోణాలను ఈ సినిమాలో టచ్ చేశాడు.
కులం, పగ ప్రతీకారాల కోసం పోక్సో లాంటి చట్టాలను కొందరు ఎలా దుర్వినియోగం చేస్తున్నారు? చట్టంలోని లొసుగుల కారణంగా ఏ తప్పు చేయని అమాయకులు ఏ విధంగా బలవుతున్నారన్నది అర్థవంతంగా సినిమాలో చూపించాడు. యాక్టింగ్ పరంగా కోర్ట్ మూవీకి శివాజీ హైలైట్‌గా నిలిచాడు. కులం, పరువు ప్రతిష్టల కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా నెగెటివ్ షేడ్ క్యారెక్టర్‌లో విశ్వరూపం చూపించాడు. చందు పాత్రలో రోషన్, జాబిలిగా శ్రీదేవి క్యారెక్టర్స్‌కు బాగా సూటయ్యారు.
సంబంధిత కథనం