Nani Judgement: నాని జడ్జిమెంట్ మీదే ఉంటుంది.. పెద్దగా లెక్కలేమీ వేయరు.. కోర్ట్ నిర్మాత ప్రశాంతి కామెంట్స్-court movie producers prashanthi deepthi comments on court state vs a nobody premieres and nani story judgment ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nani Judgement: నాని జడ్జిమెంట్ మీదే ఉంటుంది.. పెద్దగా లెక్కలేమీ వేయరు.. కోర్ట్ నిర్మాత ప్రశాంతి కామెంట్స్

Nani Judgement: నాని జడ్జిమెంట్ మీదే ఉంటుంది.. పెద్దగా లెక్కలేమీ వేయరు.. కోర్ట్ నిర్మాత ప్రశాంతి కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Published Mar 14, 2025 10:21 AM IST

Producers Prashanthi Deepthi About Court Movie And Nani: నేచురల్ స్టార్ నాని సమర్పించిన లేటెస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఈ సినిమాకు ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా, దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. కోర్ట్ మూవీ ఇవాళ రిలీజ్ కానున్నండగా విశేషాలు చెప్పారు ప్రశాంతి, దీప్తి.

నాని జడ్జిమెంట్ మీదే ఉంటుంది.. పెద్దగా లెక్కలేమీ వేయరు.. కోర్ట్ నిర్మాత ప్రశాంతి కామెంట్స్
నాని జడ్జిమెంట్ మీదే ఉంటుంది.. పెద్దగా లెక్కలేమీ వేయరు.. కోర్ట్ నిర్మాత ప్రశాంతి కామెంట్స్

Producers Prashanthi Deepthi On Court Movie And Nani: ప్రియదర్శి, రోహన్, శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై సమర్పించారు.

కోర్ట్ ప్రిమియర్స్‌ టాక్

అలాగే, రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన కోర్ట్ మూవీకి ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, అలానే ప్రేమలో పాట కూడా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ప్రశంసలు అందుకున్నాయి. కోర్ట్ ప్రిమియర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

సినిమా విశేషాలు

అయితే, కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ చిత్రం మార్చి 14న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

దీప్తి గారు కోర్టు జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

-నాని, ప్రశాంతి గారు స్క్రిప్ట్ విని ఓకే చేశారు. నేను ఆన్ సెట్ ప్రొడ్యూసర్‌గా జాయిన్ అయ్యాను. నేను రోజు సెట్స్‌లో ఉండేదాన్ని. నాని, ప్రశాంతి నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు.

కథ విన్నాక మీకు ఎలా అనిపించింది?

-నేను స్క్రిప్ట్ మొత్తం చదివాను. డైరెక్టర్ జగదీష్ చాలా బాగా రాసుకున్నాడు. చాలా లేయర్స్ ఉన్నాయి. అన్నీ బాగా కనెక్ట్ చేసుకున్నాడు. స్క్రీన్ ప్లే చాలా టైట్‌గా ఉంటుంది. కథ నాకు చాలా నచ్చింది.

ప్రశాంతి గారు వాల్ పోస్టర్ సినిమాలో కథ ఓకే అవ్వడం ఎలా ఉంటుంది?

-నాని, నేను ఇద్దరం కథ వింటాం. అయితే మా నమ్మకం అంతా నాని గారి జడ్జిమెంట్ మీదే ఉంటుంది. ఆయన పెద్దగా లెక్కలేమీ వేయరు. ఒక కథ థియేటర్‌లో చూడాలనిపించేలా ఉంటే ఓకే చేస్తారు.

ప్రశాంతి గారు ప్రీమియర్స్‌కి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది?

- కోర్ట్ ప్రిమియర్స్‌కి యునానిమస్‌గా ఎక్స్‌లెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ అఫ్ చూసి 'వావ్' అన్నారు. సెకండ్ హాఫ్ కోసం ఈగర్‌గా వెయిట్ చేశారు. సెకండ్ హాఫ్‌లోని హైలెట్స్ కూడా ఆడియన్స్‌కి చాలా నచ్చాయి. రెస్పాన్స్ చాలా బావుంది. మేము అనుకున్నదాని కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి జోనర్ సినిమాని ఆడియన్స్ ఆదరించి బిగ్ సక్సెస్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది.

- ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాం. ప్రిమియర్స్‌కి కొందరు లాయర్స్ కూడా వచ్చారు. వారికి చాలా నచ్చింది. ఒక కోర్ట్ రూమ్ డ్రామాని ఇంత నేచురల్ ప్రజెంట్ చేయడం ఇంతకుముందు చూడలేదని చెప్పారు. ఇది మాకు మంచి కాంప్లీమెంట్.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌ కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం