Court Day 5 Collections: బాక్సాఫీస్ వద్ద కోర్ట్ సినిమా జోరు కంటిన్యూ.. 5 రోజుల్లో ఎన్ని కోట్లంటే..-court day 5 box office collections nani produced priyadarshi legal drama movie strong run ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Court Day 5 Collections: బాక్సాఫీస్ వద్ద కోర్ట్ సినిమా జోరు కంటిన్యూ.. 5 రోజుల్లో ఎన్ని కోట్లంటే..

Court Day 5 Collections: బాక్సాఫీస్ వద్ద కోర్ట్ సినిమా జోరు కంటిన్యూ.. 5 రోజుల్లో ఎన్ని కోట్లంటే..

Court Day 5 Collections: కోర్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఈ లీగల్ డ్రామా చిత్రం జోరు అంచనాలకు మించి సాగుతోంది. ఐదు రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..

Court Day 5 Collections: బాక్సాఫీస్ వద్ద కోర్ట్ సినిమా జోరు కంటిన్యూ

‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా బాక్సాఫీస్ రన్ జోరుగా సాగుతోంది. మార్చి 14న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. నేచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ మూవీలో ప్రియదర్శి లీడ్ రోల్ చేశారు. హర్ష్ రోహణ్, శ్రీదేవీ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన కోర్ట్ చిత్రం వీక్‍డేస్‍లోనూ అదరగొడుతోంది.

ఐదు రోజుల కలెక్షన్లు ఇవే

కోర్ట్ చిత్రం ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.33.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఐదు రోజైన మంగళవారం ఈ చిత్రం రూ.4.65 కోట్ల వసూళ్లు దక్కించుకుంది. వీక్‍డే రోజు కూడా జోరు చూపి సత్తాచాటింది. ఐదు రోజుల్లోనే రూ.33కోట్ల మార్క్ దాటింది.

కోర్ట్ చిత్రానికి పాజిటివ్ టాక్ స్ట్రాంగ్‍గా ఉండడంతో థియేట్రికల్ రన్ అద్భుతంగా సాగుతోంది. లోబడ్జెట్‍తో రూపొందిన ఈ చిత్రం అంచనాలకు మించి వసూళ్లను రాబడుతోంది. వీక్‍డేస్‍లో మంచి ఆక్యుపెన్సీ సాధిస్తోంది. పెద్దగా పోటీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద కోర్ట్ మూవీ జోరు కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రూ.9కోట్ల బడ్జెట్.. అప్పుడే భారీ లాభాలు

కోర్ట్ చిత్రం దాదాపు రూ.9కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనా. ఇప్పటికే ఈ చిత్రం భారీ లాభాలను సాధించేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‍ఫ్లిక్స్ మంచి ధరకు కొనుగోలు చేసిందని సమాచారం. కలెక్షన్లలోనూ దుమ్మురేపుతోంది. దీంతో నానికి ఈ మూవీ లాభాల వర్షం కురిపిస్తోంది.

కోర్ట్ మూవీ గ్రిప్పింగ్ నరేషన్‍తో ఎంగేజింగ్‍గా ఉండటంతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. లీగల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రామ్ జగదీశ్ తెరకెక్కించారు. తొలి చిత్రంతోనే తన సత్తాను నిరూపించుకున్నారు. ఈ మూవీలో లాయర్ పాత్రను ప్రియదర్శి పోషించారు. టీనేజ్ లవర్స్ పాత్రలో హర్ష్ రోహణ్, శ్రీదేవీ నటించారు. శివాజీ నెగెటివ్ రోల్ చేశారు. హర్షవర్దన్, రోహిణి, సాయికుమార్, సురభి పార్వతి కీలకపాత్రల్లో కనిపించారు.

వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నాని ఈ చిత్రాన్ని సమర్పించారు. నాని బ్రాండ్ ఉండటంతో ముందు నుంచే ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ ఆకట్టుకోవటం, ప్రమోషన్లను జోరుగా చేయడంతో బజ్ నెలకొంది. సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించడంతో కలెక్షన్లలో దుమ్మురేపుతోంది. ఈ మూవీకి ప్రశాంతి త్రిపురనేని నిర్మాతగా.. దీప్తి గంటా సహనిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఇచ్చారు. దినేశ్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ చేయగా.. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్‍ కూడా మూవీకి మరో ప్లస్ అయింది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం