OTT Bold: ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్.. సన్యాసితో స్వామిజీ శృంగార పాఠాలు, న్యూడ్ సీన్స్.. ఇక్కడ చూసేయండి!-cosmic sex movie ott streaming on apple plus tv rituparna sen bengali romantic thriller film cosmic sex ott release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Bold: ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్.. సన్యాసితో స్వామిజీ శృంగార పాఠాలు, న్యూడ్ సీన్స్.. ఇక్కడ చూసేయండి!

OTT Bold: ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్.. సన్యాసితో స్వామిజీ శృంగార పాఠాలు, న్యూడ్ సీన్స్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

Cosmic Sex OTT Streaming: ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్ మూవీ కాస్మిక్ సెక్స్ స్ట్రీమింగ్ అవుతోంది. సన్యాసికి తను ఆరాధించే స్వామిజీనే శృంగార పాఠాలు చెప్పి చేయడం, న్యూడ్ సీన్స్‌తో మరింత బోల్డ్‌గా ఈ సినిమా ఉంటుంది. మరి కాస్మిక్ సెక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్.. సన్యాసితో స్వామిజీ శృంగార పాఠాలు, న్యూడ్ సీన్స్.. ఇక్కడ చూసేయండి!

Cosmic Sex OTT Release: ఓటీటోలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. వాటిలో విభిన్న జోనర్ మూవీస్ ఉంటాయి. అయితే, ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువగా హారర్, క్రైమ్, కామెడీ జోనర్స్‌నే ఇష్టపడుతుంటారు. వీటి తర్వాత కాస్తా ఇంట్రెస్ట్ చూపించే జోనర్ ఏమైనా ఉందా అంటే రొమాంటిక్ లేదా బోల్డ్ థ్రిల్లర్స్.

ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్

కొన్ని రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాల్లో సీన్స్ బోల్డ్‌గా ఉన్న కథా, కథనం ఆకట్టుకోవడమో, లేదా సందేశాత్మకంగా తెరకెక్కించడం వంటివి జరుగుతుంటాయి. అలా ఇటీవల కాలంలో కొన్ని బోల్డ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. అయితే, ఓటీటీలో మరో బోల్డ్ థ్రిల్లర్ మూవీ కూడా సజెషన్ కింద చూసేలా ఉంది. ఆ సినిమానే కాస్మిక్ సెక్స్ (Cosmic Sex Movie).

కాస్మిక్ సెక్స్ ఒక ఆర్ట్ హౌజ్ బెంగాలీ మూవీ. డ్రామా, రొమాన్స్, న్యూడ్ సీన్స్‌తో పచ్చి బోల్డ్‌గా కాస్మిక్ సెక్స్ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమాకు అమితాబ్ చక్రవర్తి దర్శకత్వం వహించారు. అమితాబ్ చక్రవర్తి, లియాఖత్ అలీ, సురోజిత్ సేన్ రచన చేశారు. కాస్మిక్ సెక్స్ సినిమాలో ఆయుష్మాన్ మిత్రా, రితుపర్ణ సేన్ లేదా రీ సేన్ ప్రధాన పాత్రలు పోషించారు.

బాక్సాఫీస్ ఫలితం

ఈ ఇద్దరితోపాటు పపియా ఘోషల్, మురారి ముఖర్జీ, బిప్లాబ్ బెనర్జీ, రివిక్ జైస్వాల్, నివేదితా భట్టాచార్య ఇతర కీలక పాత్రలు కాస్మిక్ సెక్స్ సినిమాలో పోషించారు. 2013లో తెరకెక్కిన ఈ సినిమా 2015లో ఫిబ్రవరి 1న ఇండియన్ థియేటర్లలో విడుదలైంది. అయితే, కాస్మిక్ సెక్స్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆదరణకు నోచుకోలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, కాస్మిక్ సెక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పాపులారిటీ లేని, ఊహించని ఓటీటీ అయిన యాపిల్ ప్లస్ టీవీలో కాస్మిక్ సెక్స్ ఓటీటీ రిలీజ్ అయింది. యాపిల్ ప్లస్ టీవీలో బెంగాలీ భాషలో మాత్రమే కాస్మిక్ సెక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, దీనికి అర్థమంతమైన ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో కాస్మిక్ సెక్స్‌ను ఓటీటీలో వీక్షించవచ్చు.

నచ్చివారితో పెళ్లి చేయిస్తా

ఇక కాస్మిక్ సెక్స్ కథలోకి వెళితే.. ఓ స్వామిజీ వద్ద సన్యాసిగా సాద్వి పని చేస్తుంటుంది. స్వామిజీని గరువుగా భావించి అతనివద్ద శిష్యరికం చేస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తుంటుంది. అయితే, ఓ రోజు సాద్విని గతం, ఎవరైన నచ్చినవారు ఉంటే చెప్పు వారికిచ్చి పెళ్లి చేస్తా అని స్వామిజీ అంటాడు.

నేను చిన్నప్పటి నుంచి మీ దగ్గరే పెరిగాను. మీరు తప్ప నాకు ఇంకెవరు తెలియదు. ఏదైనా మీతోనే అని సాద్వి సమాధానం ఇస్తుంది. అప్పుడు శృంగారంకున్న ప్రాధాన్యతను ఆధ్యాత్మికంగా ఎలా చూడాలో వివరిస్తాడు స్వామిజీ. శృంగార పాఠాలు చెబుతూ సన్యాసి అయిన సాద్వీతో సెక్స్ చేస్తాడు స్వామిజీ. ఆ తర్వాత కొన్నిరోజులకు స్వామిజీ చనిపోతాడు.

కాస్మిక్ సెక్స్ ట్విస్టులు

స్వామిజీ చనిపోవడంతో ఒంటరైన సాద్వి ఎక్కడికి వెళ్లింది?, ఎవరిని కలుసుకుంది? అసలు సాద్వి గతం ఏంటీ? కృపా ఎవరు? సాద్వి-కృపా మధ్య శృంగార సంబంధం ఎలాంటి పరిస్థితికి దారి తీసింది? వంటివి తెలియాలంటే యాపిల్ ప్లస్ టీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కాస్మిక్ సెక్స్ చూడాల్సిందే.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం