Copy Review: కాపీ రివ్యూ- 40 నిమిషాల రన్‌టైమ్, అయినా అదిరిపోయే ట్విస్టులు- ఓటీటీ రొమాంటిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Copy Movie Review In Telugu: ఓటీటీలో కేవలం 40 నిమిషాల రన్‌టైమ్‌తో స్ట్రీమింగ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ కాపీ. 12th ఫెయిల్ మూవీతో క్రేజ్ సంపాదించుకున్న విక్రాంత్ మాస్సే నటించిన కాపీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో కాపీ మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
Copy Movie Review Telugu: ఓటీటీలో రకరకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతుంటాయి. అవి ఎలాంటి జోనర్స్‌లో ఉన్న కొన్నిసార్లు రన్‌టైమ్ వాటికి ప్లస్ లేదా మైనస్ అవుతుంది. థ్రిల్లింగ్ సీన్స్‌తో ఎంగేంజింగ్‌గా తెరకెక్కిస్తే ఎంత రన్‌టైమ్ ఉన్న పెద్ద సమస్య ఉండదు. కానీ, స్లో నెరేషన్ అయితే చాలా బోరింగ్ ఫీల్ వస్తుంది. అందుకే సినిమాకు ఉండే నిడివి కూడా చాలా కీ రోల్ పోషిస్తుంది.

అలాంటిది కేవలం 40 నిమిషాలతోనే సినిమా తెరకెక్కిస్తే. అది కూడా మంచి ట్విస్టులతో ఆకట్టుకుంటే. అలాంటి సినిమానే కాపీ మూవీ. రొమాంటిక్ థ్రిల్లర్ మిస్టరీగా తెరకెక్కిన కాపీ మూవీలో 12th ఫెయిల్ మూవీతో క్రేజ్ సంపాదించుకున్న విక్రాంత్ మాస్సే, సుర్వీన్ చావ్లా (రానా నాయుడు ఫేమ్), అనుప్రియ గోయెంకా (పోటుగాడు ఫేమ్) ప్రధాన పాత్రలు పోషించారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా ఎలా ఉందో కాపీ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
కోపిష్టి అయిన సిద్ధార్థ్ (విక్రాంత్ మాస్సే) తన భార్య మమతా (సుర్వీన్ చావ్లా) కంపెనీని నడుపుతుంటాడు. సిద్ధార్థ్‌పై మమతా ఎంతో ప్రేమ ఉంటుంది. కానీ, మమతా ప్రేమను సిద్ధార్థ్ డిమాండింగ్‌లా ఫీల్ అవుతుంటాడు. దాంతో తనకు బదులు అచ్చం తనలాగే ఉండే ఒక రోబోట్‌ను కాంట్రాక్ట్ కింద తీసుకుని మమతాతో పర్‌ఫెక్ట్ హస్బండ్‌లా మలుచుకోమని ఇన్‌స్టక్షన్స్ ఇస్తాడు.
సిద్ధార్థ్ కొనుక్కున్న రోబోట్ ఏం చేసింది మమతా ఆఫీస్‌లో సిద్ధార్థ్ ఏం చేశాడు? అతన్ని స్టాఫ్ ఎలా చూసేవారు ఇతరులు పట్ల సిద్ధార్థ్ ఎలా ప్రవర్తించేవాడు? సిమోనా (అనుప్రియ గోయెంకా) పాత్ర ఏంటీ? సిద్ధార్థ్‌కు సిమోనాకు ఉన్న సంబంధం ఏంటీ? చివరికి సిద్ధార్థ్ పెట్టిన రోబోట్ మమతాతో ఎలా నడుచుకుంది? చివరికీ ఏం జరిగింది? అనే విషయాలు తెలియాలంటే ఈ మినీ మూవీ కాపీని చూసేయాల్సిందే.
విశ్లేషణ:
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న మినీ మూవీనే కాపీ. ఈ సినిమా రొమాన్స్, థ్రిల్లర్, మిస్టరీ అంశాలతో సాగుతుంది. కేవలం మూడు పాత్రల చుట్టూనే 40 నిమిషాల మూవీ సాగుతుంది. కానీ, ప్రారంభం నుంచి క్లైమాక్స్ వరకు మంచి థ్రిల్ ఇస్తుంది. సినిమా ప్రారంభమైన 10 సెకన్లకే ఓ ట్విస్ట్ వచ్చి ఎగ్జైట్ చేస్తుంది. అనంతరం సిద్ధార్థ్ ఎవరు, రోబోట్ ఎవరు, అసలు ఏం జరుగుతుంది, పాత్రల స్వభావం ఏంటీ అనే విషయాలు ఒక్కటి కూడా గెస్ చేయరాకుండా ఉంటాయి.
అదిరిపోయే క్లైమాక్స్
వాటికి తగినట్లు సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. అంతేకాకుండా నటీనటులు పర్ఫామెన్స్ నెక్ట్స్ లెవెల్. ముఖ్యంగా విక్రాంత్ మాస్సే నటన హైలెట్ అని చెప్పొచ్చు. కోపిష్టిగా తన యాక్టింగ్ బాగా ఆకట్టుకుంటుంది. సుర్వీన్ చావ్లా, అనుప్రియా గోయెంకా కూడా మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. ఏమాత్రం ఊహించలేనివిధంగా ఉంటుంది.
ఇలాంటి స్టోరీలు, ట్విస్టులు కాస్తా కామన్ అనిపించొచ్చు కానీ, 2018లోనే ఇలాంటి తరహా టేకింగ్‌తో వచ్చిందంటే డైరెక్టర్ అరిందమ్ సిల్, రచయితలు తాన్యా భట్టాచార్య, సుజోయ్ ఘోష్, రాజ్ వసంత్‌లను మెచ్చుకోవాల్సిందే.
ఫైనల్‌గా చెప్పాలంటే
ఫైనల్‌గా చెప్పాలంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో నేరుగా ఓటీటీ రిలీజ్ అయిన కాపీ మూవీపై లుక్కేయొచ్చు. అయితే, 7.6 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న కాపీ ఓటీటీలో హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈజీగా చూసేయొచ్చు.
సంబంధిత కథనం