టైటిల్: కూలీ
నటీనటులు: రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, పూజా హెగ్డే, అమీర్ ఖాన్ తదితరులు
దర్శకుడు: లోకేష్ కనగరాజ్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరన్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
నిర్మాత: కళానిధి మారన్
విడుదల తేది: ఆగస్ట్ 14, 2025
సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, పూజా హెగ్డే, శ్రుతి హాసన్ వంటి భారీ తారాగణం కలిసి నటించిన సినిమా కూలీ. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మించారు.
ఇవాళ (ఆగస్ట్ 14) థయేటర్లలో చాలా గ్రాండ్‌గా కూలీ మూవీ విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో పోటీ పడుతున్న ఈ తలైవా మూవీ ఎలా ఉందో నేటి కూలీ రివ్యూలో తెలుసుకుందాం.
సైమన్ (నాగార్జున) అక్రమ దందా చేస్తుంటాడు. అతనికి చాలా నమ్మకంగా దయాల్ (సౌబిన్ షాహిర్) ఉంటాడు. మరోవైపు సైమన్‌ను పట్టుకునేందుకు పోలీస్ అండర్ కవర్ టీమ్ పనిచేస్తుంది. ఇంకోవైపు దేవా (రజనీకాంత్) తన బృందంతో అజ్ఞాతంలో బతుకుతుంటాడు. ఓ క్రమంలో దేవా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ (సత్యరాజ్) చనిపోతాడు.
అయితే, రాజశేఖర్‌ది హత్య అని దేవా కనిపెడతాడు. ప్రాణ స్నేహితుడుని చంపిందెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు దేవా. ఇంతకీ రాజశేఖర్‌ను చంపింది ఎవరు? ఎందుకు చంపారు? క్రిమినల్‌ను పట్టుకునేందుకు దేవా ఏం చేశాడు? ఎలాంటి ప్లాన్స్ వేశాడు? మరి క్రిమినల్ దందా చేసే సైమన్ నేపథ్యం ఏంటీ? వంటి విశేషాలు తెలియాలంటే? కూలీ చూడాల్సిందే.
కూలీ ఒక రెగ్యులర్ యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ డ్రామా. కథ రొటీన్‌గా ఉన్నప్పటికీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో లోకేష్ కనగరాజ్ ఆకట్టుకున్నారు. స్టార్ హీరోల నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ రాబట్టుకొన్నారు. దేవాగా రజనీకాంత్ తన పర్ఫామెన్స్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అందించారు.
అదిరిపోయే యాక్షన్ సీన్స్‌తో పాటు మంచి ఎమోషన్స్‌తో ఆకట్టుకున్నారు. కథలోకి వెళ్లిన విధానం, అక్కడ ట్విస్టులు హైలెట్ అయ్యాయి. రజనీకాంత్ చుట్టూ బిల్డ్ అయ్యే సీన్స్ బాగున్నాయి. ఇక రజనీకాంత్ తన బాడీ లాంగ్వేజ్‌తో మెప్పించారు. ఫ్లాష్ బ్యాక్ సీన్లలో తనదైన స్టైలిష్ లుక్స్‌తో రజనీకాంత్ వింటేజ్ హీరోలా కనిపించారు.
ఇక సైమన్‌గా నాగార్జున చాలా స్టైలిష్‌గా అట్రాక్ట్ చేశారు. కొన్ని సీన్లలో పవర్‌ఫుల్‌గా కనిపించిన నాగార్జున నటనతో మెప్పించారు. సినిమాకు నాగార్జున స్టైల్ బాగానే వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఉపేంద్ర, అమీర్ ఖాన్ పాత్రలు గెస్టులైనప్పటికీ ఇంపాక్ట్ చూపిస్తాయి. వారు సినిమాకు బాగా ప్లస్ అయ్యారు.
ఇక మలయాళ నటుడు సౌబిన్ షాహిర్ యాక్టింగ్ కూడా మరో ప్రధాన బలం అని చెప్పొచ్చు. సౌబిన్ తన నటనతో ఆకట్టుకున్నారు. శ్రుతి హాసన్ పాత్రకు సరిగ్గా న్యాయం చేసింది. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ బాగుంది. ఆ పాటలో పూజా హెగ్డే, సౌబిన్ డ్యాన్స్ ఈపాటికే ఎంత క్రేజ్ తెచ్చుకున్నాయో తెలిసిందే.
ఇక మిగతా నటీనటులు కూడా బాగా చేశారు. విజువల్స్, సినిమాటోగ్రఫీ, అనిరుధ్ బీజీఎమ్ బాగున్నాయి. సాంకేతిక విలువలు బాగున్నాయి. అయితే, దర్శకుడిగా ఆకట్టుకున్న లోకేష్ కనగరాజ్ రచయితగా ఇంకాస్త బెటర్‌మెంట్ చూపించాల్సింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఆడియెన్స్ అందరిని మెప్పించే కూలీ.
సంబంధిత కథనం
టాపిక్