రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కలెక్షన్లు సోమవారం పడిపోయాయి. అయినప్పటికీ ఈ సినిమా రికార్డుల వేటలో కొనసాగుతోంది. సూపర్ స్టార్ సినీ పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆగస్టు 14న విడుదలైన ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద లాంగ్ వీకెండ్‌ను ఆస్వాదించింది. రికార్డు స్థాయిలో ఓపెనింగ్ డే కలెక్షన్లు, మూడు రోజుల్లో రూ. 150 కోట్ల మైలురాయిని చేరుకుంది. ఇప్పుడు అయిదు రోజుల మొత్తం కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
కూలీ సినిమా అయిదు రోజుల్లో భారత్ లో రూ.200 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు రాబట్టింది. సక్నిల్క్ ప్రకారం సోమవారం (ఆగస్టు 18) ఈ రజనీకాంత్ సినిమా ఇండియాలో రూ.9.36 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. దీంతో మొత్తం కలెక్షన్ రూ.203.86 కోట్లకు చేరింది. ఈ మూవీ తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో పాన్ ఇండియా చిత్రంగా రిలీజైంది. ఫస్ట్ డే నుంచి ఫిల్మ్ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది.
ప్రపంచవ్యాప్తంగా కూలీ సినిమా గ్రాస్ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. ఈ మూవీ రూ.400 కోట్ల మైలురాయిని దాటింది. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తమిళ సినిమాగా కూలీ రికార్డు నెలకొల్పింది. 2025లో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద భారతీయ ఓపెనర్‌గా కూలీ నిలిచిన సంగతి తెలిసిందే.
4 రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.383 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అయిదో రోజు కూడా కలిపితే సినిమా గ్రాస్ వసూళ్లు రూ.400 కోట్లు దాటాయి. ఇందులో ఓవర్సీస్ లో రూ.160 కోట్లకు పైగా, ఇండియాలో రూ.240 కోట్లకు పైగా వసూళ్లున్నాయి. బాక్సాఫీస్ దగ్గర రజనీకాంత్ మేనియాను ఈ మూవీ మరోసారి చాటింది.
కూలీ సినిమాకు వార్ 2తో పోటీ కొనసాగుతోంది. ఈ రెండు సినిమాలు ఆగస్టు 14నే రిలీజ్ అయ్యాయి. అయినప్పటికీ తలైవా పవర్ ముందు వార్ 2 తేలిపోయింది. వార్ 2 సోమవారం రూ.7.52 కోట్లు నెట్ వసూలు చేసింది. దీని మొత్తం కలెక్షన్ రూ.182.27 కోట్లు. వార్ 2లో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్స్ ప్లే చేసిన సంగతి తెలిసిందే.
రజనీకాంత్ నటించిన కూలీలో నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శృతి హాసన్, రెబా మోనికా జాన్, జూనియర్ ఎంజీఆర్, మోనిషా బ్లెస్సీ తదితరులు యాక్ట్ చేశారు. బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్, పూజా హెగ్డే కూడా అతిథి పాత్రల్లో కనిపించారు.
సంబంధిత కథనం