Tollywood: ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద కుమ్మేసిన చిన్న సినిమాలు ఇవే - ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన టాప్ ఫైవ్ మూవీస్ ఏవంటే?
Small Budget Movies: ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిన్న సినిమాలు వండర్స్ క్రియేట్ చేశాయి. కంటెంట్‌ను నమ్మి తెరకెక్కిన లిమిటెడ్ బడ్జెట్ మూవీస్ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించాయి. పెట్టిన పెట్టుబడికి రెండు, మూడింతల లాభాలను తెచ్చిపెట్టాయి.
Small Budget Movies 2024: ఈ ఏడాది భారీ బడ్జెట్ మూవీస్‌తో పాటు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టాయి. కంటెంట్‌ను నమ్మి చేసిన పలు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మాతలకు లాభాల పంటను పడించాయి. కథ ఉంటే స్టార్లతో పనిలేదని నిరూపించాయి. బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన ఆ చిన్న సినిమాలు ఏవంటే?
అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు....
సుహాస్ హీరోగా నటించిన అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు మూవీ మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నది. కుల వివక్ష నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ పది కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఈ మూవీతో దుష్యంత్ దర్శకుడిగా పరిచయమయ్యాడు.
విశ్వక్‌సేన్ గామి...
ఈ ఏడాది విశ్వక్‌సేన్ గామి, మెకానిక్ రాకీతో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు చేశాడు. గామి అతడికి సక్సెస్‌ను తెచ్చిపెట్టింది. అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా దర్శకుడు విధ్యాధర్ ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో అఘోరగా విశ్వక్‌సేన్ నటన, కాన్సెప్ట్ ప్రేక్షకుల్ని మెప్పించాయి. ఆరు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన గామి 12 కోట్ల వరకు వసూళ్లను రాబట్టడం గమనార్హం.
కమిటీ కుర్రోళ్లు...
మెగా డాటర్ నిహారిక ప్రొడ్యూస్ చేసిన కమిటీ కుర్రాళ్లు మూవీ ఈ ఏడాది చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది. కేవలం మూడు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా 19 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్...10 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ దక్కించుకున్నది.
నిర్మాత నిహారికకు ఏడు కోట్ల వరకు ఈ సినిమా లాభాలను మిగిల్చినట్లు సమాచారం. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీతో 11 మంది హీరోలు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో స్నేహం, ప్రేమ అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది.
సోలో హీరోగా ఫస్ట్ హిట్...
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ఆయ్ మూవీతో సోలో హీరోగా ఫస్ట్ హిట్‌ను అందుకున్నాడు. ఫన్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా కేవలం మూడున్నర కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఎనిమిదిన్నర కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది. ఆయ్ మూవీలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించింది. అంకిత్ కొయ్య, రాజ్‌కుమార్ కసిరెడ్డి కామెడీ ఈ సినిమా ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
35 చిన్న కథ కాదు...
నివేథా థామస్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన 35 చిన్న కథ కాదు మూవీ డీసెంట్ మూవీగా తెలుగు ఆడియెన్స్ మన్ననలను అందుకున్నది. నందకిషోర్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి రానా ప్రజెంట్‌గా వ్యవహరించాడు.
రెండున్నర కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన ఈ మూవీ ఆరు కోట్ల వరకు కలెక్షన్స్ దక్కించుకున్నది. నిర్మాతలకు మంచి లాభాలనే తెచ్చిపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. చదువు విషయంలో పిల్లలు ఎదుర్కొనే సంఘర్షణను ఆలోచనాత్మకంగా దర్శకుడు ఈ మూవీలో చూపించాడు.